E-Paper
Advertisement

ఫ్లిప్ కార్ట్ సేల్‌లో వాషింగ్ మెషీన్లు, ఫ్రిడ్జ్‌లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

ఫ్లిప్ కార్ట్ సేల్‌లో వాషింగ్ మెషీన్లు, ఫ్రిడ్జ్‌లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు!
Advertisement

Flipkart Black Friday Sale 2026: షాపింగ్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2026’ఎట్టకేలకు లైవ్ అయింది.ఈ ప్రత్యేక సేల్‌లో.. భాగంగా ప్రధానంగా వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, ఇతర హోం అప్లయన్సెస్‌పై భారీ ధరల డిస్కౌంట్‌లను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. పాత వస్తువులను మార్చుకోవాలనుకునే..వారికి, కొత్త ఇంటికి కావాల్సిన ఎలక్ట్రానిక్స్ కొనుగోలు చేయాలనుకునే ..వారికి ఇది ఒక సువర్ణావకాశం. బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో.. ఈ సేల్ కప్టమర్లను విశేషంగా ఆకర్షిస్తోంది.

వాషింగ్ మెషీన్లపై కళ్లు చెదిరే ఆఫర్లు:

ఈ సేల్‌లో మెయిన్ అట్రాక్షన్‌గా వాషింగ్ మెషీన్లు నిలుస్తున్నాయి. శామ్‌సంగ్, ఎల్‌జీ , వర్ల్‌పూల్, బాష్, ఐఎఫ్‌బీ వంటి బ్రాండ్ల ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లపై 50% నుంచి 65% వరకు భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. 7 కేజీల నుంచి 9 కేజీల సామర్థ్యం గల లేటెస్ట్ ఫీచర్లు ఉన్న సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటో మేటిక్ మోడల్స్ అత్యంత తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఉదాహరణకు.. సాధారణ రోజుల్లో.. రూ. 35,000 పలికే ప్రీమియం ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు ఈ సేల్‌లో కేవలం రూ.23,000 నుంచి రూ.25,000 మధ్యలోనే అందుబాటులో ఉన్నాయి.

రిఫ్రిజిరేటర్లపై భారీ ధరల డిస్కౌంట్:

Advertisement

మీ ఇంటికి కొత్త ఫ్రిడ్జ్ కొనాలని ప్లాన్ చేస్తుంటే..ఇదే సరైన టైం. సింగిల్ డోర్, డబుల్ డోర్, సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్లపై..ఫ్లిప్‌ కార్ట్ బంపర్ ఆఫర్లను అందిస్తోంది. కన్వర్టిబుల్ ఫీచర్లు, ఇన్వర్టర్ టెక్నాలజీ, అధిక ఎనర్జీ రేటింగ్ కలిగిన ఎల్‌జీ, శామ్‌సంగ్, హైయర్, గోద్రెజ్ ఫ్రిడ్జ్‌లపై వేల రూపాయల తగ్గింపు ఉంది. ముఖ్యంగా.. పెద్ద ఫ్యామిలీలకు.. అనువైన 250 లీటర్ల కంటే ఎక్కువ సామర్థ్యం గల డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌లపై 40% వరకు నేరుగా డిస్కౌంట్ లభిస్తోంది.

అదనపు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్:

కేవలం ధరల తగ్గింపు మాత్రమే కాకుండా, కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు ఫ్లిప్‌కార్ట్ ప్రముఖ బ్యాంకులతో ..జతకట్టింది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ , ఎస్‌బీఐ , యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి కొంటే.. 10% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతే కాకుండా..మీ పాత వాషింగ్ మెషీన్ లేదా ఫ్రిడ్జ్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ. 5,000 నుంచి రూ. 12,000 వరకు  ఎక్స్ఛేంజ్ బోనస్ పొందే.. అవకాశం ఉంది. ఒకేసారి  మొత్తం డబ్బులు చెల్లించలేని.. వారి కోసం 6 నుంచి 12 నెలల వరకు ‘నో-కాస్ట్ ఈఎంఐ అవకాశం కూడా ఉంది.

ఇతర ఎలక్ట్రానిక్స్‌పై కూడా ఆఫర్ల వర్షం:

Advertisement

వాషింగ్ మెషీన్లు, ఫ్రిడ్జ్‌లతో.. పాటు స్మార్ట్ టీవీలు, మైక్రో వేవ్ ఓవెన్లు, వాటర్ ప్యూరిఫైయర్లు, ఎయిర్ కండిషనర్లు, కిచెన్ అప్లయెన్సెస్‌పై కూడా బెస్ట్ డీల్స్ ఉన్నాయి. 4K అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ టీవీలపై 60% వరకు తగ్గింపు లభిస్తోంది. చలికాలం కావడంతో.. గీజర్లు , రూమ్ హీటర్లపై కూడా ప్రత్యేక డిస్కౌంట్లు కల్పిస్తున్నారు.

Also Read: రూ.1,999కే పవర్‌ఫుల్ బ్యాకప్..పాకెట్ సైజులోనే పవర్ బ్యాంక్

కొనే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు:

బ్లాక్ ఫ్రైడే సేల్ తక్కువ కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి, స్టాక్ ముగియకముందే.. మీకు కావాల్సిన ప్రొడక్ట్‌ను కార్ట్‌లో యాడ్ చేసుకోవడం మంచిది.ప్రొడక్ట్ వారంటీ, ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు, మీ ప్రాంతానికి డెలివరీ అవకాశం ఉందో లేదో చెక్ చూసుకోండి. అలాగే.. వివిధ బ్యాంక్ కార్డులపై ఉన్న ఆఫర్లను పోల్చి చూసుకుని, ఏ కార్డు ద్వారా ఎక్కువ తగ్గింపు వస్తుందో దానిని ఎంచుకోవడం ద్వారా మరింత డబ్బు ఆదా చేసుకోవచ్చు. మొత్తానికి, తక్కువ బడ్జెట్‌లో ఇంటిని ఆధునీకరించుకోవాలనుకునే.. వారికి ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ ఒక అద్భుతమైన ఆప్షన్గా నిలుస్తోంది.

Related News

BSNL రూ.202 ప్లాన్‌తో కళ్లు చెదిరే బెనిఫిట్స్.. డేటా, కాలింగ్‌తో పాటు ఉచిత ఇన్సూరెన్స్ కూడా!

ఇంత సన్నని ఫోన్‌లో 6500mAh బ్యాటరీ ఎలా పెట్టారబ్బా? యాపిల్‌కు చెమటలు పట్టిస్తున్న Huawei Mate 90 Air!

ఇవి మామూలు ఇయర్ బడ్స్ కాదు.. మన మాటలన్నీ రికార్డ్ చేసి నోట్స్ రాసిపెట్టే ఏఐ గ్యాడ్జెట్!

రూ.1,499కే ఇయర్‌బడ్స్..మెటాలిక్ ఫినిష్,సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్

రూ.963కే బ్లూటూత్ సౌండ్‌బార్..ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

BSNL క్రేజీ ఆఫర్.. రూ.399కే 60 Mbps స్పీడ్, 3,300GB డేటా.. పైగా మొదటి నెల బిల్లు ఫ్రీ!

వాట్సప్ అకౌంట్ బ్యాన్ ఎందుకు అవుతుంది? రివ్యూ రిక్వెస్ట్ పెట్టి మళ్లీ పొందడం ఎలా?

రూ.902కే స్మార్ట్‌వాచ్..తక్కువ ధరకే పిచ్చెక్కించే ఫీచర్లు!

Big Stories

Advertisement
×