BigTV English
Advertisement

Drinks Side Effects: కూల్ డ్రింక్స్ తాగితే జట్టు రాలిపోతుందా? పోర్చుగల్ శాస్త్రవేత్తల షాకింగ్ రీసెర్చ్

Drinks Side Effects: కూల్ డ్రింక్స్ తాగితే జట్టు రాలిపోతుందా? పోర్చుగల్ శాస్త్రవేత్తల షాకింగ్ రీసెర్చ్

Drinks Side Effects: జుట్టు అంటే ప్రతిఒక్కరికీ ఎంతో విలువైన ఆభరణం. మహిళలకు సౌందర్యానికి ప్రతీకగా, పురుషులకు వ్యక్తిత్వానికి ప్రతినిధిగా జుట్టు నిలుస్తుంది. అలాంటి జుట్టు రాలిపోతే మనసులో కలిగే బాధ వర్ణించలేనిది. సాధారణంగా వాతావరణం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, జన్యుపరమైన కారణాల వల్ల జుట్టు రాలిపోతుంది. కానీ తాజాగా శాస్త్రవేత్తలు చేసిన ఒక పరిశోధన కొత్త కోణాన్ని చూపిస్తోంది. అది ఏమిటంటే కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం కూడా జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణమని.


3500 మిల్లీ లీటర్లకంటే ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగితే!

పోర్చుగల్‌లోని యూనివర్సిటీ ఆఫ్ పోర్టో శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. వారానికి పదకొండు బాటిళ్లు లేదా 3500 మిల్లీ లీటర్లకంటే ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగేవారిలో జుట్టు అధికంగా రాలిపోతుందని వారు గుర్తించారు. ఈ పరిశోధనలో పాల్గొన్నవారి ఆరోగ్య పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, జుట్టు స్థితిని పరిశీలించి ఈ నిర్ణయానికి వచ్చారు.


కూల్ డ్రింక్స్‌ తాగితే తల మీద సిబమ్‌ అనే చమురు

కూల్ డ్రింక్స్‌లో ప్రధానంగా చక్కెరలు, ఆర్టిఫీషియల్ ఫ్లేవర్స్, కార్బోనేషన్ ఉంటుంది. ఇవి శరీరానికి ఎలాంటి ఉపయోగం చేయకపోగా పలు సమస్యలకు దారితీస్తాయి. శాస్త్రవేత్తల వివరాల ప్రకారం, అధికంగా చక్కెరలు కలిగిన ఈ డ్రింక్స్ తాగితే శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా తల మీద సిబమ్‌ (Sebum) అనే చమురు పదార్థం అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఇది కుదుళ్లను బలహీనపరచి జుట్టు క్రమంగా రాలిపోవడానికి కారణమవుతుంది.

Also Read: Shraddha Kapoor: లేట్ వయసులో రిలేషన్షిప్… కన్ఫర్మ్ చేసిన శ్రద్ధా.. పోస్ట్ వైరల్

జుట్టు బలహీనకు కారణం

ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ డ్రింక్స్‌లో ఉన్న రసాయనాలు శరీరానికి అవసరమైన క్యాల్షియం, ఐరన్ వంటి ఖనిజాల శోషణను అడ్డుకుంటాయి. వీటే జుట్టు బలంగా పెరగడానికి అవసరమైన పోషకాలు. అవి అందకపోవడంతో జుట్టు బలహీనమై రాలిపోవడం సహజం.

అధికంగా తాగేవారిలో 70 శాతం జుట్టు రాలిపోతుంది

పరిశోధనలో మరో ఆసక్తికరమైన అంశం బయటపడింది. రోజువారీగా ఒక బాటిల్‌ లేదా రెండు బాటిల్స్ మాత్రమే తాగేవారిలో పెద్దగా ప్రభావం కనిపించకపోయినా, అలవాటుగా అధికంగా తాగేవారిలో జుట్టు రాలిపోవడం 70 శాతం వరకు ఎక్కువగా కనిపించిందని చెబుతున్నారు. అంటే పరిమితికి మించి తాగితేనే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అర్థం.

 షాక్ లో వినియోగదారులు

ఇప్పటికే మనం గమనిస్తున్నాం పిల్లలు, యువతలో కూల్ డ్రింక్స్ అలవాటు ఎక్కువవుతోంది. ప్రతి వేడుకలోనూ, బయటకు వెళ్ళినా, సినిమా చూసినా, భోజనం చేసినా కూల్ డ్రింక్ తాగే అలవాటు భాగమైపోయింది. కానీ దీని వెనుక దాగి ఉన్న ఆరోగ్య సమస్యలను చాలా మంది పట్టించుకోవడం లేదు. శాస్త్రవేత్తలు చెబుతున్న ఈ కొత్త విషయం, జుట్టు రాలిపోవడానికి కారణమవుతుందని వినిపించగానే చాలా మందికి షాక్ తగలడం ఖాయం.

కూల్ డ్రింక్ బదులు నిమ్మరసం మేలు

ఈ సందర్భంలో నిపుణులు సూచిస్తున్నది ఏమిటంటే, కూల్ డ్రింక్స్ స్థానంలో సహజమైన పానీయాలను వాడాలని. ఉదాహరణకు నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు, పండ్ల రసాలు శరీరానికి పోషకాలు అందించడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడతాయి. ముఖ్యంగా జుట్టు బలంగా ఉండాలంటే ప్రోటీన్లు, ఐరన్, విటమిన్ బి, జింక్, ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లాంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తినాలని వైద్యులు చెబుతున్నారు. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగే అలవాటు మనం నియంత్రించకపోతే కేవలం జుట్టే కాదు, ఆరోగ్యానికి కూడా పెద్ద సమస్యలు వస్తాయి. అందుకే శాస్త్రవేత్తలు ఇచ్చిన హెచ్చరికను గమనించి, సహజమైన పానీయాలను అలవాటు చేసుకుంటే మంచిది.

Related News

Dark Tourism: చీకటి అధ్యాయాలపై ఉత్సుకత.. నాణేనికి మరో వైపే డార్క్ టూరిజం!

Zumba Dance: బోరింగ్ వర్కౌట్స్‌తో విసుగొస్తుందా.. అయితే మ్యూజిక్ వింటూ స్టెప్పులేయండి!

Karivepaku Rice: కరివేపాకు రైస్ పావు గంటలో చేసేయొచ్చు, రెసిపీ చాలా సులువు

Trial Separation: విడాకులు తీసుకునే ముందు.. ఒక్కసారి ‘ట్రయల్ సెపరేషన్’ ప్రయత్నించండి!

Wasting Money: విలాసవంతమైన కోరికలకు కళ్లెం వేయకుంటే.. మిమ్మల్ని చుట్టుముట్టే సమస్యలివే!

Food noise: నెక్ట్స్ ఏం తినాలో ముందే ప్లాన్ చేస్తున్నారా.. అయితే అది ఫుడ్ నాయిసే!

Crocs: క్రాక్స్ ఎందుకంత ఫేమస్?.. దీని వెనుకున్న ముగ్గురి స్నేహితుల కథేంటి?

Mumbai Style Vada Pav: ముంబై స్టైల్ వడా పావ్ రెసిపీ.. క్షణాల్లోనే రెడీ చేసుకోవచ్చు !

Big Stories

×