చల్లగా ఉండే శీతాకాలం నుంచి వేసవికాలంలో అడుగుపెట్టేసాము. ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. ఆ ఎండలను తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. అయితే వేసవికాలంలో జుట్టు రాలిపోయే సమస్య ఎక్కువ మందిలో కనిపిస్తుంది. ఇలా జుట్టు వేసవి కాలంలో ఎక్కువగా ఎందుకు రాలుతుందో అవగాహన చాలా తక్కువ మందికే ఉంది. జుట్టు రాలడానికి కొన్ని ప్రధానమైన కారణాలు ఉన్నాయి. వీటిని తెలుసుకుంటే మీరు జుట్టు రాలకుండా జాగ్రత్త పడొచ్చు.
వేడి వల్ల వచ్చే తేమ
వేసవి వేడికి శరీరం నుంచి చెమట అధికంగా బయటికి వస్తుంది. అలాగే నెత్తి మీద కూడా ఎక్కువ చెమట పట్టి తేమగా మారిపోతుంది. ఇది వెంట్రుకల రంద్రాలకు అడ్డుపడుతుంది. అలాగే హెయిర్ ఫోలికల్స్ ను బలహీన పరుస్తుంది. దీని వల్లే వెంట్రుకలు త్వరగా రాలిపోతాయి.
సూర్యరశ్మి
ఎక్కువసేపు ఎండలో ఉండడం వల్ల ఆ సూర్యకిరణాల నుంచి వచ్చే వేడి… హెయిర్ ఫోలికల్స్ ను దెబ్బతీస్తాయి. అవి పెళుసుగా అయిపోతాయి. వెంట్రుకలు కూడా విచ్ఛిన్నమవుతాయి. కొన్ని రోజులకు ఆ జుట్టు రాలిపోతుంది. ముఖ్యంగా దువ్వుతున్నప్పుడు లేదా తలస్నానం చేసినప్పుడు ఈ జుట్టు రాలిపోవడం ఎక్కువగా కనిపిస్తుంది.
అధిక చెమట
వేసవిలో చెమట అధికంగా పడుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇలా చెమట ఎక్కువ పట్టడం వల్ల చర్మంపై జుట్టు పెరుగుతుంది. తలపై చుండ్రు లేదా దురద వంటివి పెరిగిపోతాయి. ఇవన్నీ కూడా జుట్టు సమస్యలకు కారణం అవుతాయి. నెత్తిమీద చర్మం ఎర్రబడి, దురద పెడుతూ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను ఎంతో ప్రభావితం చేస్తుంది. వెంట్రుకలను రాలిపోయేలా చేస్తుంది.
స్విమ్మింగ్ వల్ల కూడా..
వేసవిలోనే ఎక్కువగా జుట్టు రాలే సమస్య ఉంటుంది. కాలానగుణ మార్పుల వల్ల జుట్టు బలహీనపడుతుంది. అలాగే ఈత కొలనులకు వెళ్లే వారి సంఖ్య వేసవిలో అధికంగానే ఉంటుంది. అయితే స్విమ్మింగ్ పూల్స్ లో క్లోరిన్ కూడా ఎండిపోతుంది. అందుకే తరచూ స్విమ్మింగ్ చేసే వారిలో జుట్టు రాలే సమస్య వేసవిలో ఎక్కువగా ఉంటుంది. వెంట్రుకలు విచ్ఛిన్నమై బలహీనంగా మారిపోతాయి. దువ్వుతుంటే ఎక్కువ జుట్టే దువ్వెనతో పాటు బయటికి వచ్చేస్తుంది. అయితే ఎండాకాలం తగ్గాక మళ్ళీ జుట్టు పెరగడం ఆరంభం అవుతుంది.
Also Read: ఉదయం పూట గోరువెచ్చని నీళ్లు తాగితే.. మతిపోయే లాభాలు !
అలాగే వేసవిలో సాధారణంగా జుట్టు రాలడమే కాకుండా, ప్యాచుల్లా రాలి వచ్చేస్తుంది. ఎక్కువ జుట్టు చేతికి వచ్చేస్తుంటే జాగ్రత్త పడండి. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అలాగే పోషక లోపాలు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోండి. పోషక లోపాల వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతాయి. అలాగే తీవ్ర ఒత్తిడి బారిన పడడం వల్ల కూడా జుట్టు రాలిపోయే సమస్య అధికంగా ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యత కూడా జుట్టు రాలడానికి కారణమే. కాబట్టి వెంట్రుకలు మరీ అతిగా ఊడిపోతూ ఉంటే వెంటనే డెర్మటాలజిస్ట్ ను కలిసి తగిన కారణాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.