Uttar Pradesh: దేనినైనా లిమిట్‌గా ఉపయోగించాలి. లేకుంటే అనర్థాలు తప్పవన్న సంగతి మరోసారి నిరూపించింది. అందుకు ఎగ్జాంఫుల్ కారు ఘటన. వాహనంలో మ్యాప్‌ని చూస్తూ ఫాలో అయిపోయారు అందులో వ్యక్తులు. చివరకు సినిమా షూటింగ్ మాదిరిగా వంతెన పైనుంచి కింద పడింది ఆ కారు. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
ఆన్‌లైన్‌లో మ్యాప్ చూసే టెక్నాలజీ వచ్చిన తర్వాత కొత్త ప్రదేశంలో దారులు వెతుక్కునే శ్రమ వాహనదారులకు తప్పింది. ఒకవిధంగా ఇదొక రిలీఫ్. కాకపోతే ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతున్నా యి. అలాంటి ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కారులో మ్యాప్‌ను గుడ్డిగా నమ్మి బోల్తాపడ్డారు. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ను మ్యాప్ గుర్తించకపోవడంతో ఈ ఘటన జరిగింది.
మహారాజ్‌గంజ్ జిల్లాలో జాతీయ రహదారి 24 లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ అంచున ఆదివారం రాత్రి నేపాల్ నుండి గోరఖ్‌పూర్ వైపు వెళుతున్న కారు గాల్లోనే వేలాడుతూ కనిపించింది. ఈ ఘటన నుంచి కారులో ప్రయాణిస్తున్నవారు సురక్షింగా బయటపడ్డారు. లేకుంటే ఆ నష్టాన్ని అస్సలు ఊహించలేము.
యూపీలోని గోరఖ్‌పూర్-సోనౌలి మార్గం భారత్- నేపాల్‌లను కలిపే రహదారి అది. ప్రస్తుతం ఫరెండాలోని భయ్యా సమీపంలో ఆ రహదారికి చెందిన ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది. సోనౌలి నుండి గోరఖ్‌పూర్‌కు వెళ్తున్న ఓ కారు, ఫ్లైఓవర్ పైనుంచి కింద పడిపోయింది. ఈ ఘటన తెల్లవారుజామున ఒంటి గంటకు జరిగింది.
ALSO READ: రాపిడో డ్రైవర్ ను దోచుకున్న కస్టమర్, క్యూఆర్ కోడ్ చూపించి మోసం
ఫ్లైఓవర్ అకస్మాత్తుగా ముగిసిపోవడాన్ని గుర్తించిన డ్రైవర్, సడన్‌గా బ్రేక్‌లు వేశాడు. కాసేపు గాల్లో తేలుగా గిర్రున తిరుగుతూ చివరకు ఫైఓవర్ చివర వేలాడుతూ కిందపడింది. వంతెన సమీపంలో పెద్ద శబ్దం విన్నవారు వెంటనే తమ ఇళ్ల నుండి బయటకు వచ్చారు. గాల్లోనే కారు వేలాడుతూ కనిపించింది.
వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చేలోపు కారులో ఉన్నవారు మెల్లగా బయటపడ్డారు. పోలీసుల వచ్చిన తర్వాత క్రేన్ ద్వారా కారుని తొలగించారు. కారు డ్రైవర్ మ్యాప్ సూచనలను ఫాలో కావడం ప్రమాదానికి కారణమని అంటున్నారు బాధితులు. గతేడాది ఇలాంటి ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఆ ఘటన విషాదంగా ముగిసింది.
గూగుల్ మ్యాప్‌ని కారు డ్రైవర్ ఫాలో అయ్యాడు. అది ఏకంగా నదిలోకి తీసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కారులో తెలియని ప్రాంతాలకు వెళ్లేవారు గుడ్డిగా ఆన్‌లైన్ మ్యాప్‌ను ఫాలోకావద్దు సుమా. లేకుంటే కష్టాలు తప్పవు.
गुगल मैप का मतलब आपका जीवन भगवान भरोसे
मोबाइल पर मैप लगाकर दौड़ रही कार एक निर्माणाधीन फ्लाईओवर पर रास्ता खत्म होने की वजह से लटक गई। @maharajganjpol #GoogleMaps pic.twitter.com/EDEHeNQaF3
— VIVEK YADAV (@vivek4news) June 10, 2025