Hair Wash Without Shampoo| ఈ రోజుల్లో షాంపూతో తలస్నానం చేయకుండా ఎవరూ ఉండలేరు. మహిళలైతే వారంలో మూడు నుంచి నాలుగు సార్లు హెయిర్ వాష్ చేస్తారు. మరోవైపు పురుషులు అయితే దాదాపు ప్రతిరోజు తలస్నానం చేసేవారున్నారు. అయితే కొందరు మాత్రం సబ్బుతోనే తలస్నానం కానిచ్చేస్తారు. మొత్తంగా చూస్తే షాంపూతో స్నానం చేసేవారి సంఖ్య అత్యధికంగా ఉంది. కానీ షాంపూలో చాలా రకాల కెమికల్స్ ఉండడంతో దాని వల్ల జుట్టు రాలే సమస్య వస్తుంది. దీంతోపాటు షాంపూలు ధర కూడా ఎక్కువే. నిత్యం షాంపూతో తలస్నానం చేసేవారికి ఇది పెద్ద ఖర్చుగా కూడా మారుతుంది. అందుకే షాంపూకీ ప్రత్యామ్నంగా ప్రకృతి పరమైన పదార్థాలు అందుబాటులో ఉన్నాయి.
శనగ పిండి (బేసన్): షాంపూతో హెయిర్ వాష్ చేయడం ఇష్టం లేని వారు ఇంటి కిచెన్ లో అందుబాటులో ఉండే శనగ పిండితో తలంటుకోవచ్చు. శనగ పిండితో జుట్టు బాగా క్లీన్ అయిపోతుంది. అంతే కాదు శనగ పిండి జుట్టుతో పాటు చర్మానికి కూడా ఆరోగ్యకరం. అందుకే శనగ పిండితో ప్రతి రోజు ఉదయం తలస్నానం చేయడం మంచిది. దీని కోసం శనగ పిండి జుట్టు, కుదుళ్లపై బాగా అంటించండి. అరగంట తరువాత, జుట్టుని నీటితో బాగా కడగండి. ఇలా చేయడం వల్ల జుట్టుపై ఉన్న దుమ్ము, నూనె తొలగిపోతుంది. జుట్టు కూడా మృదువుగా, కాంతివంతంగా మెరుస్తుంది.
అలోవేరా: ఇది హెయిర్ వాష్ చేయడానికి అద్బుతంగా ఉపయోగపడుతుంది. ఇంట్లోనే లభిస్తుంది కనుక దీని ఖర్చు కూడా చాలా తక్కువ. ముందుగా అలోవేరా జెల్ తీసుకొని జుట్టు, కుదుళ్లకు అంటించండి. అరగంట తరువాత తలస్నానం చేయండి. అలోవేరా ప్రాకృతిక మాస్చరైజర్ గా పనిచేస్తుంది. దీంతో జుట్టుకు తేమ బాగా అందుతుంది. అలోవేరాతో జుట్టు మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. అయితే అలోవేరాతో వారానికి రెండు నుంచి మూడు సార్లు మాత్రమే స్నానం చేయాలి. డాండ్రఫ్ సమస్య ఉన్నవారు, జుట్టు పొడిబారిపోయే సమస్య ఉన్నవారు అలోవేరా తప్పక ఉపయోగించాలి. మంచి ఫలితాలు కనిపిస్తాయి.
కొబ్బరి పాలు: పొడి జుట్టు సమస్య ఉన్నవారు కొబ్బరి పాలతో హెయిర్ వాష్ చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. కొబ్బరి పాటు ఇంటి వద్దే తయారు చేసుకోవచ్చు. ఈ పాలు మాయశ్చరైజర్ గా పనిచేస్తాయి. ఇందులోని పోషకాలు జుట్టుకు బలం చేకూరుస్తాయి. కొబ్బరి పాలు ఒక గిన్నెలో పోసుకొని జుట్టుకు పట్టించండి. గంట సేపు తరువాత నీటితో శుభ్రంగా జుట్టును కడిగేయండి. వారినికి రెండు సార్లు కొబ్బరి పాలతో తలస్నానం చేస్తే జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది. జుట్టు పొడిబారిపోయే సమస్య ఉండదు.
Also Read: పడకగదిలో ఆ సమస్య.. ఈ పండు తింటే వయాగ్రా లాంటి శక్తి
పెరుగు: జుట్టుకు కావాల్సిన పోషకాలు పెరుగులో పుష్కలంగా ఉంటాయి. దీని కోసం ఒక గిన్నెలో పెరుగు తీసుకొని. జుట్టు, కుదుళ్లకు పట్టించండి. గంట సేపు తరువాత నీటితో జుట్టు కడిగేయండి. పెరుగులో ఉండే తేమ జుట్టుకు బలాన్ని చేకూరుస్తుంది. అంతే కాకుండా కుదుళ్లకు మంచి పోషణ ఇవ్వడంతో పాటు డాండ్రఫ్ సమస్యను పరిష్కరిస్తుంది. వారానికి రెండు మూడు సార్లు పెరుగతో హెయిర్ వాష్ చేయడం మంచిది.
ఉసిరి పౌడర్ (ఆమ్లా)
ఆమ్లా పౌడర్ జుట్టుకు చాలా ఆరోగ్యకరం. జుట్టు బలహీనంగా ఉన్నా, డాండ్రఫ్, పొడిబారి పోవడం లాంటి ఇతర సమస్యలున్నా ఉసిరి పౌడర్ చక్కటి పరిష్కారం. ఈ పౌడర్ తో నిత్యం తలంటు పోసుకుంటే జుట్టు బలంగా ఉంటుంది. ఆమ్లా పౌడర్ జుట్టును ఆరోగ్యకరంగా చేసి జుట్ట రాలిపోయే సమస్యను అరికడుతుంది. ఇందుకోసం 2 లేదా 3 టేబుల్ స్పూన్లు ఒక గిన్నెలో తీసుకోండి. అందులో రోజ్ వాటర్ కలపండి. ఈ పేస్ట్ ని జుట్టకు బాగా పట్టించి, 30 నిమిషాల తరువాత నీటితో కడిగేయండి. ఇలా చేయడం వల్ల జుట్టు సాఫ్ట్ గా తయారవుతుంది. జుట్టుపై పేరుకుపోయిన దుమ్ము ధూళి తొలగిపోతుంది.
Also Read: మధుమేహం ఉన్నవారు ఈ ఫుడ్స్ తింటే ఆరోగ్యానికి ఎంతో లాభం.. ఏవి తినాలంటే?..