Happy Independence Day Wishes 2025: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఈ పవిత్ర రోజున, మన దేశభక్తిని చాటి చెప్పేలా కొన్ని స్వాతంత్ర్య దినోత్సవానికి సంబంధించిన మెసేజ్‌లు, కోట్స్ స్నేహితులు, బంధువులతో పంచుకోవచ్చు.
1. భారతమాత మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన మహనీయుల త్యాగం మరచిపోలేనిది. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !
2. స్వేచ్ఛను మనకు బహుమతిగా ఇచ్చిన అమరవీరుల త్యాగాలను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈ పవిత్ర దినాన వారిని స్మరించుకుంటూ, వారసత్వాన్ని గౌరవిద్దాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
3. సారె జహా సే అచ్ఛా, హిందుస్తాన్ హమారా అని గర్వంగా పాడుదాం. దేశభక్తితో నిండిన ఈ రోజున, మన దేశ ఔన్నత్యాన్ని చాటుకుందాం. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!
4. ప్రతి భారతీయుడి గుండెలో నిండిన దేశభక్తికి ఈ మువ్వన్నెల జెండా ప్రతీక. ఈ జెండా ఎప్పటికీ సగర్వంగా ఎగురుతూనే ఉండాలి. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
5. గతంలో మనకు స్వేచ్ఛను సాధించి పెట్టిన త్యాగమూర్తులను గౌరవిస్తూ.. భవిష్యత్తులో మన దేశాన్ని మరింత గొప్పగా తీర్చిదిద్దడానికి ప్రతిజ్ఞ చేద్దాం. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!
6. జై జై జై భారతమాత,
సెల్యూట్ కొడదాం మన జాతీయ పతాకానికి,
ఈ స్వేచ్ఛకు కారణమైన మహనీయులకు!
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!
7. ఎందరో వీరుల త్యాగఫలం,
మన ఈ మువ్వన్నెల జెండా !
ఈ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుందాం,
దేశం కోసం పాటుపడదాం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!
8. మన స్వేచ్ఛకు కారణమైన మహనీయులకు వందనాలు.
వారి త్యాగాలను ఎన్నటికీ మరువలేం.
జై హింద్!
9. మువ్వన్నెల జెండా మన ఆత్మగౌరవం.
భిన్నత్వంలో ఏకత్వం మన దేశ గొప్పతనం.
అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!
10. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరులకు నివాళి.
వారి కలలను సాకారం చేయడానికి ప్రతిజ్ఞ చేద్దాం.
వందేమాతరం !
11. స్వాతంత్ర్యం అనేది ఒక అందమైన కల,
దీన్ని నిజం చేయడానికి ఎందరో పోరాడారు.
ఆ స్వేచ్ఛను మనం గౌరవిద్దాం.
12. స్వాతంత్ర్య దినోత్సవం మనందరి పండుగ.
ఈ శుభసందర్భంగా, దేశభక్తితో ఉప్పొంగుదాం.
భారత్ మాతా కీ జై!
13. మన దేశం ఎప్పటికీ శాంతి, సామరస్యాలతో వర్ధిల్లాలి.
ప్రతి భారతీయుడి గుండెలో దేశభక్తి ఎప్పటికీ నిలిచి ఉండాలి.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!
14. ఈ రోజున మనం పడుతున్న ప్రతి శ్వాస,
ఎందరో అమరవీరుల త్యాగఫలం.
ఆ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుందాం.
Also Read: స్వాతంత్ర్య దినోత్సవం.. ఆగస్ట్ 15న జరుపుకోవడానికి వెనక ఇంత కథ ఉందా ?