Cool Drinks: వాతావరణం రోజు రోజుకూ వేడెక్కుతోంది. ఎండలు పెరుగుతుండటంతో చాలా మంది చల్లగా ఏదైనా తినడానికి, తాగడానికి ఇష్టపడుతుంటారు. అంతే కాకుండా ఈ సీజన్‌లో శరీర వేడిని తగ్గించడానికి కూల్ డ్రింక్స్ తాగే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇలా కూల్ డ్రింక్స్ తాగడం ఆరోగ్యానికి చాలా హానికరం. కూల్ డ్రింక్స్ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కూల్ డ్రింక్స్:
మార్కెట్ లో దొరికే వివిధ రకాల కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మెదడు ప్రభావితం అవుతుంది. రోజుకు ఒకసారి ఏదైనా కూల్ డ్రింక్ వ్యక్తుల్లో ఎపిసోడిక్ జ్ఞాపకశక్తి దెబ్బతినే అవకాశం ఉంది. అంటే గత సంఘటనలను గుర్తుంచుకునే సామర్థ్యం తగ్గవచ్చు. పెప్సి, కోక్ , స్ప్రైట్ వంటివి మెదడుకు హానికరం. వీటి వల్ల మెదడు బలహీనపడటం ప్రారంభమవుతుంది. వీటి తయారీలో కృత్రిమ తీపి పదార్థాలను ఉపయోగిస్తారు. వీటిని తీసుకోవడం వల్ల బరువు పెరుగుతుంది. అంతే కాకుండా మధుమేహం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.
ప్యాక్ చేసిన పండ్ల రసాలు:
ప్యాక్ చేసిన పండ్ల రసంలో విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని అనుకుంటే పొరపాటే. వీటిలో చక్కెర తప్ప మరేమీ ఉండదు. చాలా ప్యాక్ చేసిన జ్యూస్‌లు డబ్బాల రూపంలో అమ్ముతుంటారు. వీటిలో అధిక మొత్తంలో స్వీటెనర్లు, నీరు ఉంటాయి. అందుకే ఇవి కడుపు సంబంధిత సమస్యలను కూడా ప్రోత్సహిస్తాయి. ముఖ్యంగా పిల్లలకు ఇలాంటి డ్రింక్స్ అస్సలు ఇవ్వకూడదు. దీన్ని క్రమం తప్పకుండా తీసుకునే వ్యక్తులు మెదడు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు.
సోడా:
కొంత మంది సోడా తాగడానికి ఇష్టపడుతుంటారు. డైట్ సోడా ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఇది మెదడుకు చాలా ప్రమాదకరమైనది. కొన్ని పరిశోధనల ప్రకారం, డైట్ సోడా అధికంగా తీసుకునే వారిలో గుండెపోటు ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుంది.
ఎనర్జీ డ్రింక్స్:
గత కొన్ని సంవత్సరాలుగా ఎనర్జీ డ్రింక్స్ ట్రెండ్ బాగా పెరిగింది. ఎనర్జీ డ్రింక్స్ కూడా ఆరోగ్యానికి చాలా హానికరం. ఇవ గుండె జబ్బులు మరియు అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతాయి. అంతే కాకుండా మెదడు నరాలను విశ్రాంతి లేకుండా, మందగించేలా చేస్తాయి. అందుకే ఎనర్జీ డ్రింక్స్ తాగడం తగ్గించాలి. ఇవే కాకుండా అనారోగ్య సమస్యలకు కూడా ఇవి కారణం అవుతాయి.
Also Read: ఈ సూపర్ ఫుడ్స్‌తో తెల్ల జుట్టు మాయం !
ఐస్ టీ:
వేసవి కాలంలో ఐస్డ్ టీ చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. చాలా మంది దీన్ని తాగడానికి ఇష్టపడతారు. మీరు కూడా దీన్ని ఎక్కువగా తీసుకుంటే జాగ్రత్తగా ఉండండి. చక్కెర కలిపిన ఐస్‌డ్ టీ తయారు చేయడం చాలా సులభం. కాబట్టి మనం దాని దుష్ప్రభావాల గురించి మరచిపోతాము. మెదడును ప్రభావితం చేసే ఐస్డ్ టీ తయారీలో చక్కెరతో పాటు మరికొన్ని పదార్థాలను ఉపయోగిస్తారు. ఐస్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా గొంతు నొప్పి వస్తుంది.