BigTV English

Padmanabham: స్టార్ కమెడియన్.. చిల్లర కోసం అంధుడి కంచంలో డబ్బులు దొంగిలించి.. నరకం అనుభవించి

Padmanabham: స్టార్ కమెడియన్.. చిల్లర కోసం అంధుడి కంచంలో డబ్బులు దొంగిలించి.. నరకం అనుభవించి

Padmanabham: స్టార్ కమెడియన్ పద్మనాభం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడంటే..  కమెడియన్ అనగానే వై బ్రహ్మానందం మొదలుకొని వెన్నెల కిషోర్ వరకు పేర్లు చెప్పుకొస్తారు. బ్రహ్మానందం కన్నా ముందు కమెడియన్స్ ఎవరు అంటే.. టక్కున రాజబాబు, రేలంగి,  పద్మనాభం అని చెప్పుకొచ్చేస్తారు. ఇప్పుడైనా వల్గర్ పదాలతో కామెడీ చేస్తున్నారు కానీ.. అప్పట్లో ఎలాంటి అసభ్యకరమైన పదాలను వాడకుండా.. వారి హావభావాలతోనే ఎక్కువ నవ్వించేవారు. అలా నవ్వించే కమెడియన్స్ లో బసవరాజు వెంకట పద్మనాభ రావు ఒకరు. ఇప్పటి జనరేషన్ కు ఈయన ఎవరో తెలియకపోవచ్చు. కానీ, ఒకప్పటి జనరేషన్ కు ఈయనొక స్టార్ కమెడియన్.


ఐదేళ్ల వయస్సు నుంచే నాటకాలాలో ఆరితేరిన పద్మనాభం.. గాయకుడిగా కూడా మంచి ఫేమస్. చదువుకుంటున్న రోజుల్లోనే  నటి కన్నాంబ దగ్గరకు వెళ్లి తమ గానకళతో ఆమెను మెప్పించి రాజరాజేశ్వరీ వారి కంపెనీలో సెటిల్  అయ్యాడు. అక్కడ ఎన్నో నాటకాల్లో నటిస్తూ ఒకపక్క.. గాయకుడిగా కోరస్ ఇస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా అలా నెమ్మదిగా సినిమాల్లో  కమెడియన్ గా మారాడు. చిన్న చిన్న పాత్రల్లో కనిపించే పద్మనాభం జీవితం విజయాసంస్థలో చేరడంతో  మలుపు తిరిగింది. పాతాళ భైరవి సినిమాలో సదాజపుడి పాత్రలో పద్మనాభం నటనకు ఫిదా అయిన విజయా సంస్థ అధినేతలు.. ఆయనను  పర్మనెంటు ఆర్టిస్టులుగా మూడేళ్ళ అగ్రిమెంటు రాయించుకున్నారు.

ఇక ఆ సంస్థ నుంచి వచ్చిన ప్రతి సినిమాలో పద్మనాభం కమెడియన్ గా నటిస్తూ వచ్చాడు. ఇక  రాజనాల, రేలంగి తరువాత పద్మనాభం అనేంతగా ఆయన పేరు తెచ్చుకున్నాడు. స్టార్ హోదా అందుకున్నాక నిర్మాతగా కూడా మారాడు. 1964 సంవత్సరంలో రేఖా అండ్ మురళి ఆర్ట్స్ పేర చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి దేవత, పొట్టి ప్లీడర్, శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న నిర్మించాడు. మర్యాద రామన్నతోనే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గాయకుడిగా తొలిసారి పరిచయం చేశారు. 1968లో శ్రీరామకథ నిర్మించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు. 1970లో కథానాయిక మొల్ల తీసి బంగారు నంది అవార్డు పొందాడు.


Tollywood Hero: ఈ గ్రూప్ ఫొటోలో ఉన్న స్టార్ హీరోను గుర్తుపట్టండి చూద్దాం.. మీ వల్ల కాదంతే.. ?

అయితే ఇప్పటి నటుల్లా.. అప్పట్లో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేది ఎవరిలో కూడా లేదు. ఆస్తి సంపాదించడం.. సినిమాలు తీయడం.. ఇదే అందరికీ తెల్సింది. అలా సినిమాలమీద ఉన్న ఆస్తి మొత్తం పెట్టేసి చివరి రోజుల్లో నరకం అనుభవించి మృతి చెందిన నటుల్లో పద్మనాభం కూడా ఒకరు. స్టార్ హోదాను అనుభవిస్తున్న సమయంలోనే పద్మనాభం ఆస్తి హారతి కర్పూరం అయ్యింది. మంచితనం వలన అడిగినవారికి లేదనకుండా ఇచ్చి చివరిరోజుల్లో పేదరికంతో చనిపోయిన వారిలో పద్మనాభం కూడా ఉన్నాడు.

1975లో  సినిమా వైభవం కోసం ఒక వ్యక్తి వద్ద రూ. 60 వేలు అప్పు చేశారట పద్మనాభం. ఇక ఆ అప్పుకు తాకట్టు కింద తనవద్ద ఉన్న దేవత, పొట్టి ప్లీడర్, శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్నసినిమా నెగిటివ్ లను పెట్టాడు. ఆరు నెలల్లోగా అప్పు తీర్చకుంటే.. ఆ సినిమా పూర్తి హక్కులు వారివే అని పేపర్ పై సంతకం పెట్టాడు. 6 నెలలు గడిచినా ఆయన అప్పు తీర్చలేకపోయాడు. దీంతో సదురు వ్యక్తి ఆ సినిమాలు ఆంధ్రా, నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్లకు అమ్ముకొని రూ. 2. 75 లక్షలు సొమ్ము చేసుకున్నాడు. తన అప్పు తీసుకొని మిగతా డబ్బు కానీ, నెగిటివ్స్ కానీ పద్మనాభంకు ఇవ్వకుండా మోసం చేశాడు.

చివరిరోజుల్లో పద్మనాభం డబ్బులేక ఎంతో నరకం అనుభవించాడు. చిన్నతనంలో ఒక అంధుడు కంచంలో రాయి వేసి.. అందులో డబ్బులు దొంగతనం చేసాడట. అలా చేశాను అని ఆయన స్టార్ గా  మారేవరకు మనసులో ఉండిపోయిందట.  తప్పు చేశాను అనే భావనతో జాతకరత్న మిడతం భొట్లు సినిమాలో అంధుడుకు డబ్బులు వేసే సీన్ ఆయనే రాసి.. నిజమైన అంధుడును తీసుకొచ్చి ఆ సన్నివేశం పూర్తిచేసి ఆ తరువాత ఆయనకు కొంత డబ్బు ఇచ్చి పంపించేసారట. ఇక ఆ తప్పుతోనే ఆయన లిటిల్ బ్లైండ్ అండ్ డెఫ్ సంస్థకు అప్పట్లో రూ. 5 వేలు విరాళంగా ఇచ్చి ప్రాయశ్చితం చేసుకున్నాడు.

ఇక ఇన్ని మంచి పనులు చేసినా పద్మనాభం చివరిరోజుల్లో కటిక పేదరికాన్ని అనుభవించి చనిపోయేవరకు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. భద్ర, చక్రం, వీరభద్ర లాంటి సినిమాల్లో  తాత రోల్స్ లో కనిపించి మెప్పించాడు. ఇక చివరగా ఆయన నటించిన చిత్రం టాటా బిర్లా మధ్యలో లైలా. 2010లో పద్మనాభం గుండెపోటుతో మరణించారు.

Tags

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×