Broccoli benefits: తరచుగా తీసుకునే ఆహారంలో బ్రోకలిని చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక పోషకాలు అందుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా దీన్ని ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయని అంటున్నారు. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఫైబర్‌తో పాటు యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. బ్రోకలి అనేక శారీరక సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందట.
విటమిన్స్
బ్రోకలీలో విటమిన్-C, విటమిన్-K, విటమిన్-A వంటివి అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్-C ఇమ్యూన్ వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుందట. అలాగే శరీరానికి పోషకాలు అందించే ప్రక్రియలను మెరుగుపరుస్తుంది. విటమిన్-K రక్తం గడ్డకట్టడాన్ని సులభం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మినరల్స్
బ్రోకలీలో పొటాషియం, కాల్షియం, ఐరన్, మాంగనీస్ వంటి మినరల్స్ కూడా ఉన్నాయి. ఈ ఇవి ఎముకల ఆరోగ్యానికి, రక్త ప్రసరణకు, ఆందోళనల నివారణకు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఫైబర్
బ్రోకలీలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందట. ఇది జీర్ణవ్యవస్థను శక్తివంతం చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కేవలం అలసటను తగ్గించడమే కాకుండా, బ్రోకలీ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుందని అంటున్నారు.
యాంటీ ఆక్సిడెంట్లు
బ్రోకలీలో అనేక యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయట. ఇవి శరీరంలోని హానికరమైన రాడికల్స్‌ను తొలగించడంలో ఇవి సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బ్రోకలీ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
బ్రోకలీలో ఉన్న విటమిన్-K,కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తాయి. ఇది ఎముకలు, జాయింట్స్ స్ట్రాంగ్‌గా ఉండేలా చేస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. అంతేకాకుండా రక్తం గడ్డకట్టడం కూడా సులభతరం అవుతుందట. తద్వారా రక్తస్రావ సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
బ్రోకలీలో ఉన్న ఫైబర్, పొటాషియం,యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటివల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు క్రమం తప్పకుండా పెరగకుండా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇది గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుందట.
బ్రోకలీలో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా సల్ఫోరాఫేన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు, క్యాన్సర్ కణాలను నివారించేందుకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో అనేక రకాల క్యాన్సర్లు రాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని అంటున్నారు.
బ్రోకలీలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుందట. దీన్ని తీసుకోవడం వల్ల మలబద్ధకం, గ్యాస్ సమస్యలు తగ్గిపోతాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇది శరీరానికి మరింత శక్తిని అందిస్తుందట.
ALSO READ: సోరియాసిస్‌ను సహజంగా తగ్గించడం సాధ్యమేనా?
బ్రోకలీలో ఉన్న మాంగనీస్, అనేక ఇతర పోషకాలు రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది డయాబెటిక్ వ్యాధి ఉన్న వ్యక్తులకు దివ్యౌషధంలా పని చేస్తుందని అంటున్నారు.
బ్రోకలీ తినడం ద్వారా బరువు తగ్గించడం కూడా సాధ్యమవుతుందట. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయట. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.