Kiwi Benefits: కివీ ఫ్రూట్ తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. వీటిని విటమిన్ సి కి పవర్‌హౌస్ అని కూడా పిలుస్తారు. కివీ ఫ్రూట్ లో విటమిన్ కె, విటమిన్ ఇ, ఫోలేట్, పొటాషియం , యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ ఒక కివీ ఫ్రూట్ తినడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో కివీ ఫ్రూట్ తినడం మంచిదని డాక్టర్లు చెబుతుంటారు.
కివీ ఫ్రూట్‌లోని పోషక విలువలు:
విటమిన్ E: 1 mg
విటమిన్ సి: 64 మి. గ్రా
ఫోలేట్: 17 mcg
పొటాషియం: 215 మి.గ్రా
విటమిన్ : 27 ఎంసిజి
ఫైబర్: 2 గ్రాములు
రాగి: 0.1 మి.గ్రా
కివీలో కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే ఫొలేట్ పిండం అభివృద్ధికి చాలా అవసరం. కివీలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలోని ప్రతి దశలో తల్లి ఆరోగ్యం , పిండం అభివృద్ధికి కివీ ఫ్రూట్ చాలా బాగా ఉపయోగపడుతుంది.మొదటి మూడు నెలల్లో కివీ ఫ్రూట్ తినడం వల్ల శిశువు మెదడు బాగా అభివృద్ధి చెందుతుంది. అంతే కాకుండా 3-6 నెలల్లో ఏర్పడే జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గించడంలో మేలు చేస్తుంది. 6-9 నెలల సమయంలో కివీ ఫ్రూట్ తినడం వల్ల రక్త పోటు నియంత్రణలో ఉంటుంది.
మొదటి మూడు నెలలు:
ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలల్లో తగినంత ఫొలేట్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఫొలేట్ న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది శిశువు మెదడు అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఒక కివీ ఫ్రూట్ రోజు అవసరమైన ఫొలేట్ అవసరంలో 4 శాతం అందిస్తుంది. కివీవిటమిన్ సి, ఐరన్ శోషణకు కూడా చాలా మేలు చేస్తుంది.
3-6 నెలలు:
గర్భం పెరిగే కొద్దీ మలబద్దకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు పెరుగుతాయి. కివీలోని ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా శిశువు పెరుగుతున్నప్పుడు రోగ నిరోధక శక్తి బలంగా ఉండటానికి కివీలోని విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉపయోగపడతాయి.
6-9 నెలలు:
గర్భదారణ సమయంలో మీ శరీరానికి అదనపు సంరక్షణతో పాటు పోషణ కూడా అవసరం.ఇలాంటి సమయంలో మీరు కివీ తినడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. కివీలను స్మూతీ, సలాడ్ల రూపంలో కూడా తినవచ్చు. రోజుకు 2-3 కివీ ఫ్రూట్స్ తినడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. కివీలో విటమిన్ కె కూడా ఉంటుంది. ఇది తల్లి, బిడ్డ ఇద్దరి ఎముకల ఆరోగ్యానికి, రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడుతుంది.
Also Read: ఇంట్లోనే ఇలా నేచురల్ హెయిర్ కలర్స్ తయారు చేసుకుని వాడితే.. తెల్ల జుట్టు మాయం
రక్తపోటును నియంత్రిస్తుంది:
కివి ఫ్రూట్ లో ఉండే పొటాషియం.. సోడియం ప్రభావాలను సమతుల్యం చేయడం ద్వారా గర్భధారణ సమయంలో రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రీక్లాంప్సియా వంటి సమస్యలను నివారించడానికి ఆరోగ్యకరమైన రక్తపోటును నిర్వహించడం చాలా ముఖ్యం.