Palms: సమ్మర్ సీజన్లో దొరికే తాటి ముంజల వలన అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. తాటి ముంజలు చూడటానికి జెల్లీలా, మృదువుగా ఉంటాయి. వేసవికాలం ప్రారంభం నుంచి మేన నెల చివరి వరకు తాటి ముంజలు మనకు పుష్కలంగా దొరుకుతాయి. మార్కెట్‌లో కల్తీలేని ఆహారం, ప్రకృతి వరప్రసాదం ఏదైనా ఉంది అంటే అది ఈ ఒక్క తాటి ముంజలే..
శరీరాన్ని చల్లబరుస్తుంది:
తాటి ముంజలలో అధిక నీటి శాతం ఉండటం వల్ల, శరీరంను వేడి నుండి కాపాడుతుంది. శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. వేసవిలో చెమటతో బాడీ డీహైడ్రేషన్ అవుతుంది. అప్పుడు తాటి ముంజలు తీసుకోవడం ద్వారా శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. ప్రస్తుత కాలంలో వారి రోజూ వారి పనుల వల్ల నీరు సరిగ్గా తాగకపోవడం వల్ల కిడ్నీలలో రాళ్లు ఏర్పడతాయంటున్నారు. ఈ సమస్య ఉన్న వారు తాటి ముంజలు తీసుకోవడం ద్వారా సమస్యను నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
నేటి కాలంలో చాలిమంది సరైన ఆహారం తీసుకోకపోవడం మరియు సరైన సమయానికి తినకపోవడం వల్ల డయాబెటిస్, అసిడిటీ, జీర్ణక్రియ సమస్యలు వస్తున్నాయి. వీరు తాటి ముంజలు తీసుకోవడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే అనేక జీర్ణ సమ్యలకు ఉపశమనం కలిగిస్తుంది. దీనిలో ఉండే పొటాషియం మన శరీరంలో ఉండే విషపదార్ధాలను తొలగిస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
శరీరానికి చలువ చేసే తాటి ముంజలు మన శరీరానికి కావాల్సిన శక్తిని ఇచ్చి అలసటను తగ్గి్స్తాయింటున్నారు. మనం వేసవిలో బయటకు వెళ్లి ఇంటికి వచ్చే వరకు చాలా శక్తిని కోల్పోతాము.. అలాంటి సమయంలో విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉన్న వీటిని తీసకోవడం వల్ల శరీరానికి అవసరమయ్యే పోషకాలును అందిస్తుందని తెలిపారు. శరీరానికి అనేక పోషకాలను అందించే ఈ తాటి ముంజలను ఐస్ యాపిల్ అని కూడా పిలుస్తారు.
Also Read: రాగి పాత్రలు నిజంగా ఆరోగ్యానికి మంచివేనా..?
చర్మ సంబంధిత సమస్యలు దూరం:
తాటి ముంజలు చర్మం మృదువుగా మరియు మెరిసేలా చేస్తుంది. అలాగే మెుటిమలు మరియు ఇతర చర్మ సమ్యలను ఉపశమనం కలిగిస్తుందని అంటున్నారు. తాటి ముంజల్లో అధిక నీరు మరియు తక్కువ కేలరీలు ఉండటం వల్ల బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. కడుపులో మంట, మూత్ర విసర్జన సమయంలో పొత్తికడుపులో భరించలేని నొప్పితో బాద పడేవారు క్రమం తప్పకుండా ఒక ఇరవై రోజుల పాటు లేత ముంజలను తినడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇక తాటి ముంజలలో శరీరానికి కావాల్సిన ఏ, బీ, సి విటమిన్లు, ఐరన్, జింక్, ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
ఇతర ప్రయోజనాలు:
ఇవి క్యాన్సర్ మరియు డయాబెటిస్ వంటి వ్యాధులను నివారిస్తుంది. దీనిలో క్యాలరీలు తక్కువగా, శరీరానికి మేలు చేసే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వేసవిలో శరీరంలోని పోషకాలు చెమట రూపంలో బయటకు పోతాయి. వాటిని భర్తీ చేయడానికి తాటి ముంజలు చాలా అవసరం.. అలాగే వివిధ రకాల ట్యూమర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేసే ఫైటోకెమికల్స్, ఆంథోసయనిన్ లాంటి వాటిని తాటి ముంజలు నిర్మూలిస్తాయని పరిశోధనల్లో తేలింది. గర్భిణులు తాటి ముంజలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తద్వారా జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుందని, మలబద్ధకం, ఎసిడిటీ లాంటి ఆరోగ్య సమస్యల్ని ఈ పండ్లు దూరం చేస్తాయని తెలిపారు. చాలామంది ముంజలపై గోధుమ రంగులో ఉండే పొట్టు తీసేసి తింటారు. కానీ ఆ పొట్టులోనే ఎన్నో రకాల పోషకాలుంటాయని, ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు.