Makhana With Milk: మఖానాను ఫాక్స్ నట్స్ అని కూడా పిలుస్తారు. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో ప్రోటీన్, కాల్షియం, ఫైబర్ , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇదిలా ఉంటే పాలు కూడా కాల్షియం, విటమిన్ డి కి మంచి మూలం. ఈ రెండింటినీ కలిపి తీసుకున్నప్పుడు అది గొప్ప ఆరోగ్యకరమైన డ్రింక్‌గా మారుతుంది. ఇది శరీరానికి అనేక విధాలుగా ప్రయోనాలు అందిస్తుంది. మఖానాను పాలలో మరిగించి, పడుకునే ముందు తాగితే అది మీ ఆరోగ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా, మీకు మంచిగా నిద్ర పట్టేలా చేస్తుంది. మరి మఖానాను పాలలో వేసి మరిగించి తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మఖానా, పాలు కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాలు:
నిద్రలేమి:
మీకు నిద్రలేమి సమస్య ఉంటే గనక మీరు మఖానా పాలు తాగడం మంచిది. నిజానికి, మఖానాలో సెరోటోనిన్ , యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా పాలలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం నిద్రను మెరుగుపరుస్తుంది. పడుకునే ముందు దీనిని తాగడం వల్ల నిద్రలేమి సమస్య తొలగిపోయి మంచిగా నిద్ర వస్తుంది.
ఎముకలను బలంగా చేయండి:
మఖానా, పాలు రెండింటిలోనూ కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి అవసరం. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది కాబట్టి, పిల్లలకు , వృద్ధులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. తామర గింజల్లో ఉండే భాస్వరం , మెగ్నీషియం ఎముకల అభివృద్ధికి సహాయపడతాయి.
జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది:
మీకు గ్యాస్, అజీర్ణం లేదా మలబద్ధకం సమస్యలు ఉంటే, ఖచ్చితంగా మఖానా పాలు తాగండి. తామర గింజల్లో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పాలలో ఉండే లాక్టోస్ పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. రాత్రిపూట దీనిని తాగడం వల్ల కడుపు తేలికగా ఉంటుంది. అంతే కాకుండా ఉదయం కడుపు పూర్తిగా శుభ్రం అవుతుంది.
గుండె ఆరోగ్యం:
మఖానా , పాల కలయిక మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మఖానాల్లో తక్కువ మొత్తంలో సోడియం, అధిక మొత్తంలో పొటాషియం ఉంటాయి. ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. పాలలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు కొలెస్ట్రాల్‌ను సమతుల్యం చేస్తాయి. అంతే కాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోండి:
మీ చర్మం , జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే ఖచ్చితంగా మఖానా పాలు తాగండి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ప్రకాశవంతంగా, యవ్వనంగా ఉంచుతాయి. మఖానాలో ఉండే కొల్లాజెన్ బూస్టింగ్ గుణం ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది జుట్టు మూలాలను బలోపేతం చేస్తుంది. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
మఖానా పాలు ఎలా తయారు చేయాలి ?
మఖానా పాలు తయారు చేయడానికి, ముందుగా పాలను ప్యాన్‌లో మరిగించాలి. ఇప్పుడు అందులో మఖానా వేసి 5-7 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి. మఖానా మృదువుగా మారినప్పుడు, గ్యాస్‌ను ఆపివేయండి. తర్వాత దానికి తేనె, ఏలకుల పొడి కలపండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే త్రాగండి.
Also Read: కొబ్బరి నీళ్లు తాగితే.. ఈ వ్యాధులు రమ్మన్నా రావు !
మఖానా పాలు ఆరోగ్యానికి అమృతం కంటే తక్కువ కాదు. పడుకునే ముందు దీనిని తాగడం వల్ల నిద్ర మెరుగుపడుతుంది. అంతే కాకుండా ఎముకలు కూడా బలపడతాయి. మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతే కాకుండా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది చర్మం , జుట్టుకు కూడా చాలా ఉపయోగకరంగా పని చేస్తుంది. మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవాలనుకుంటే ఈ డ్రింక్‌ను ఈరోజు నుండే మీ ఆహారంలో చేర్చుకోండి.