BigTV English

Planetary parade: ఆకాశంలో అద్భుతం.. లాభమా? నష్టమా?

Planetary parade: ఆకాశంలో  అద్భుతం.. లాభమా? నష్టమా?

Planetary parade: శుక్రవారం రాత్రి ఓ మహాద్భుతం సాక్షాత్కారం కానుంది. సౌర వ్యవస్థలో ఏడు గ్రహాలు ఒకే సరళ రేఖపై దర్శనం ఇవ్వనున్నాయి. ఖగోళ శాస్త్రంలో ప్లానెట్​ పరేడ్‌గా పిలుస్తారు శాస్త్రవేత్తలు. మహా శివరాత్రి తర్వాత రోజు అంతరిక్షంలో గ్రహాలు కనువిందు చేయనుండడంతో మంచి జరగుతుందా? ఏమైనా అనర్థాలు ఉంటాయా అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


గ్రహాల పరేడ్

బుధుడు, శని, బృహస్పతి, అంగారకుడు, శుక్రుడు, నెప్ట్యూన్‌, యురేనస్ గ్రహాలు ఆకాశంలో కవాతు చేయనున్నాయి. ఆ సమయంలో  శని, బృహస్పతి, అంగారకుడు, శుక్ర గ్రహాలను మన కళ్లతో స్పష్టంగా చూడొచ్చు. అయితే నెప్ట్యూన్‌, యురేనస్ గ్రహాలను కేవలం టెలిస్కోప్ ద్వారానే సాధ్యమవుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు.


గ్రహాల పరేడ్‌ మన దేశంలో శుక్రవారం (ఫిబ్రవరి 28) రాత్రి ఎనిమిదిన్నర గంటలకు దర్శనం ఇవ్వనుంది. ఆకాశం మేఘావృతం కాకుండా ఉండాలి. అలాగే కాలుష్యం తక్కువగా ఉండాలి. అప్పుడే ప్లానెట్ పరేడ్ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కొన్ని యాప్‌ల ద్వారా పరేడ్‌ను చూడవచ్చని అంటున్నారు నిపుణులు.

మరో 15 ఏళ్ల తర్వాత 

సప్త గ్రహాల పరేడ్ మళ్లీ 2040లో మాత్రమే చూడగలుగుతామని అంటున్నారు. అందుకే శుక్రవారం రాత్రి ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దని చెబుతున్నారు ఖగోళ శాస్త్రజ్ఞులు. స్టార్‌ వాక్‌-2, స్టెల్లారియం యాప్‌లలో వీటిని చూడవచ్చు. ఆకాశంలో సప్త గ్రహ కూటమి వల్ల ప్రకృతి విపత్తులు తప్పవన్నది కొందరు జ్యోతిష్యులు మాట. దీనివల్ల కొన్ని రాశులకు మంచి జరుగుతుందని, కొందరికి దోషాలు ఉంటాయని అంటున్నారు.

ALSO READ: విలాసవంతమైన గాజా జీవితం

ఆకాశంలో చూడాల్సిందే

నార్మల్‌గా అయితే సౌర కుటుంబంలో గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. కాకపోతే వాటి కక్ష్య వేగం వేర్వేరుగా ఉంటాయి. అరుదుగా మాత్రమే అవన్నీ ఒకే వరుసలో కనిపిస్తాయి. ఈ అరుదైన సందర్భాన్ని ఖగోళశాస్త్ర పరిభాషలో ప్లానెటరీ పరేడ్ కూడా చెబుతారు. కోట్ల దూరంలో ఉన్న ఈ గ్రహాలు వరుస కనిపించే దృశ్యాన్ని మాటల్లో వర్ణించలేమని అంటున్నారు. ఆకాశంలో అత్యంత కాంతి వంతంగా కనిపించేవి వీనస్, జూపిటర్ గ్రహాలు. ఎర్రని వర్ణంలో అంగారకుడిని సులభంగా గుర్తించవచ్చు. కాకపోతే శని గ్రహాన్ని వీక్షించడం కష్టంగా ఉంటుందని చెబుతున్నారు.

ఏయే రాశులవారికి శుభం

అయితే గ్రహాల పరేడ్ వల్ల ముఖ్యంగా సింహం, మేషం, ధనస్సురాశి వారికి పెరుగుతుందని అంటున్నారు చాలా మంది జ్యోతిష్యులు. కన్యా, వృషభం, మకరరాశిలకు స్థిరత్వం పెరుగుతుందన్నది వారి మాట. కర్కాటక, మీనా, వృశ్చికరాశిలో భావోద్వేగాలు క్రమంగా పెరుగుతాయని అంటున్నారు. వీరిలో అత్యంత మార్పులు చూస్తారని అంటున్నారు.

విపరీతమైన హీట్ క్రియేట్ ఖాయమా?

మొన్నటికి మొన్నఅష్టమి కూటమి వచ్చిందన్నారు ఆధ్యాత్మిక వేత్త రాజన్. ఇప్పుడు సప్త కూటమి వస్తుందన్నారు. త్రేతా యుగం, ద్వాపర యుగంలో ఇవన్నీ ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే మంచి- చెడు అనేది ఉంటుందని అంటున్నారు. సృష్టికి ఏమైనా ప్రమాదం అనే అనుమానాలు లేకపోలేదు. దీనివల్ల హీట్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇటీవల కాలంలో సంక్రాంతి తర్వాత విపరీతమైన వేడి వచ్చిందన్నారు.

Related News

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Big Stories

×