BigTV English

Okra Water Benefits: ఈ వాటర్ డైలీ ఒక గ్లాస్ తాగితే.. అద్భుతాలు జరుగుతాయ్ !

Okra Water Benefits: ఈ వాటర్ డైలీ ఒక గ్లాస్ తాగితే.. అద్భుతాలు జరుగుతాయ్ !

Okra Water Benefits: బెండకాయలను వంటకాల తయారీలో ఉపయోగిస్తాం. కానీ బెండకాయ కూరల తయారీకే కాదు. మరెన్నో రకాలుగా శరీర ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. బెండకాయ వాటర్ వల్ల కూడా అనేక అనేక ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా 30 సంవత్సరాలు పైబడిన వారు ఈ వాటర్ తాగితే ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. బెండకాయ వాటర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి ? దీనిని ఎలా తయారు చేసుకోవాలనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది:
సాధారణంగా వయసు పెరిగే కొద్దీ రకరకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి . ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు డైలీ ఉదయం ఖాళీ కడుపుతో బెండకాయ వాటర్ తాగడం వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయి. బెండకాయలో పుష్కలంగా ఫైబర్, జిగట పదార్థం ఉంటుంది. ఇది పేగు కదలికలను ప్రోత్సహించి జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా అజీర్తి, మలబద్ధకం వంటి వాటిని కూడా దూరం చేస్తుంది.

ఇమ్యూనిటీ బూస్టర్:


బెండకాయలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. 30 సంవత్సరాల దాటిన వారు తెలిసి డైలీ మార్నింగ్ బెండకాయ వాటర్ తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఫలితంగా జలుబుతో పాటు ఇతర వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు.

డయాబెటిస్:
మనసుతో సంబంధం లేకుండా ప్రస్తుతం చాలా మంది డయాబెటిస్ దారిన పడుతున్నారు. డైలీ పడిగడుపున బెండకాయ వాటర్ తాగడం వల్ల డయాబెటిస్ రాకుండా ఉంటుంది. ఓక్రా గింజలు యాంటీబయోటిక్ లక్షణాలు కలిగి ఉంటాయి. అందుకే ఇవి టైప్ -2 డయాబెటిస్ రోగుల్లో చక్కర స్థాయిలను సమర్థవంతంగా తగ్గిస్తాయి. 30 ఏళ్ల పైబడిన పురుషులు ఈ వాటర్ తాగడం వల్ల ఆరోగ్యకరమైన షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేయవచ్చు. అంతేకాకుండా డయాబెటిస్ ఉన్నవారికి కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

గుండె ఆరోగ్యానికి మేలు:
బెండకాయలో ఉండే అధిక ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను గణనీయంగా తగ్గిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది అంతే కాకుండా ఓక్రాలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు కొలస్ట్రాల్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. గుండె ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరుచుగా  ఓక్రా నీరు తాగితే రక్తపోటు వచ్చే అవకాశాలు ఉండవని అంటున్నారు.

Also Read: ఇమ్యూనిటీని పెంచే బెస్ట్ జ్యూస్ ఇదే !

ఎముకలు బలంగా మారతాయి:
బెండకాయలో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ కె వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజు పడిన బెండకాయ వాటర్ తాగడం మంచిది. దీని వల్ల ఎముకలు స్ట్రాంగ్‌గా మారతాయి. ఎముకలకు సంబంధించిన రుగ్మతల కూడా రాకుండా ఉంటాయి.

బెండకాయ వాటర్ తయారీ:
నాలుగైదు ఫ్రెష్గా ఉండే బెండకాయలను తీసుకొని శుభ్రంగా కడగాలి. ఆపై వాటిని కాస్త చిన్న సైజు నిలువు ముక్కలుగా చేసుకోవాలి. వాటిని గ్లాస్ వాటర్ తీసుకుని అందులో వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపున ఈ నీటిని తాగాలి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×