Big Tv Live Originals: మార్కెట్‌లో యాపిల్స్ కొనుక్కొని ఇంటికి వెళ్లి చూస్తే అవి పైకి బాగానే కనిపించినా లోపల మాత్రం పాడైపోయిన సందర్భాలు చాలానే ఉంటాయి. దీంతో వందలకు వందలు ఖర్చు చేసి కొన్నా తినే అవకాశం లేకుండా పోతుంది. ఒకవేళ అలా పాడైపోయిన పండ్లను తిన్నా అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. అందుకే కొనేటప్పుడే ఏవి మంచి పండ్లు ఏవి కాదనేవి గుర్తించడం చాలా అవసరం. కొనేటప్పుడే తాజా యపిల్స్‌నిన ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ముడతలు పడి లేదా ముడతలు పడిపోయిన యాపిల్స్ తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని యాపిల్స్ పొడిగా, ముడతలు పడిన చర్మం కలిగి ఉంటాయి. చూస్తేనే వాడిపోయినట్లుగా కనిపిస్తాయి. అవి ప్రమాదకరమైనవి కావు, కానీ అవి రుచిగా ఉండవు. అందుకే వీటిని కొనకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
కొన్ని యాపిల్స్ చాలా మెత్తగా ఉంటాయి. యాపిల్స్ లోపలి నుంచి కుళ్లిపోవడం వల్ల పండ్లు చాలా మెత్తగా అనిపిస్తాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే ఛాన్స్ ఉంటుంది. అందుకే కొనేటప్పుడే యాపిల్స్‌ని నొక్కి చూడడం మంచిది.
ALSO READ: ఆరోగ్యవంతమైన జుట్టు కోసం ఇలా చేయండి
కొన్ని యాపిల్స్‌పై నల్లటి మచ్చలు, గాయాలు కనిపిస్తాయి. యాపిల్స్ కింద పడ్డప్పుడు ఇలాంటి దెబ్బలు తగులుతాయి. మచ్చలు ఎక్కువగా ఉండే యాపిల్స్ త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో పండ్లు బూజు పట్టే ఛాన్స్ కూడా ఉంటుందట. అందుకే ఇటువంటి పండ్లను తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
కొన్ని యాపిల్ పండ్లకు పైభాగంలో బ్లూ కలర్‌లో బూజు పట్టినట్లుగా కనిపిస్తుంది. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. బూజు పట్టిన ఆపిల్స్ తినడానికి సురక్షితం కాదు. అందుకే కొనేటప్పుడే కాస్త జాగ్రత్తగా చూసి పండ్లు తీసుకోవడం ఉత్తమం.
కట్ అయిన యాపిల్స్ కొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం అవసరం. చిన్నదే కదా అని తీసుకుంటే ఆరోగ్యానికి హాని చేసే క్రిమ్ములు శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంది. అందుకే చిన్న గీత పడినా తినకపోవడమే మంచిది.
ఏది మంచిదంటే..?
వీలైనంత వరకు గట్టిగా బరువుగా ఉంగే యాపిల్స్‌ని తీసుకోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. యాపిల్స్ పొట్టు మృదువుగా, శుభ్రంగా ఉండాలి. మచ్చలు, గాయాలు ఉండకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా తాజాగా ఉండే యాపిల్స్ కాండం దగ్గర తీపి వాసన వస్తుంది. అలాంటి యాపిల్‌ని నిస్సందేహంగా తినొచ్చు.
కొన్ని ఆపిల్స్ మెరిసే పూతను కలిగి ఉంటాయి. వీటిని తాజాగా కనిపించేలా చేయడానికి తరచుగా మైనం కలుపుతారు. ఎక్కువగా మైనం ఉన్న పండ్లను తిన్నా ఆరోగ్యానికి పెద్దగా హాని కలగదు. కానీ, చాలా మంది ఇలాంటి పండ్లను ఎక్కువగా ఇష్టపడరు. అందుకే అతిగా మైనం ఉండే పండ్లను కొనకూడదు. ఒకవేళ కొన్నా.. వాటిని బాగా కడిగి తినడం మంచిది.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.