Plastic Cups: మన రోజువారీ జీవితం అంతా వేగంగా మారిపోతోంది. ఆ వేగమే మన అలవాట్ల మీద కూడా ప్రభావం చూపుతోంది. అలాంటి వేగంలో మనం ఎక్కువగా కలిసే చోట్లలో, కాఫీ, టీ తాగడానికి ఇప్పుడు పేపర్ గ్లాసులు చాలా వినియోగంలో ఉన్నాయి. అవి సులభంగా ముట్టుకునేందుకు, తేలికగా పట్టుకోవడానికి మనం అలావాటైపోయింది. ఎందులో కాఫీ కావాలి అనగానే మనం వెంటనే గాజు గ్లాసు కాకుండా.. పేపర్ గ్లాస్ లో వేసి ఇచ్చేయ్ అంటుంటాం. కానీ, వాటి వల్ల కలిగే హాని మనం గమనించడం లేదు.
పేపర్ గ్లాసులు కేవలం పేపర్‌తోనే తయారవుతాయనుకోకండి. వీటిని నీటిని, చాయ్, కాఫీ లాంటి వేడి ద్రవాలు లీక్ కాకుండా ఉండేందుకు బయట నుండి ప్లాస్టిక్ లేయర్‌తో కప్పి ఉంటాయి. ఈ ప్లాస్టిక్ లేయర్ లో ఉండే రసాయనాలు వేడి పదార్థాలతో కలిశాక మన ఆరోగ్యానికి హానికరంగా మారిపోతాయి. వేడి కాఫీ, టీ పానీయాలతో ఈ రసాయనాలు మన శరీరంలోకి ప్రవేశించి, జీర్ణవ్యవస్థను బాధించడమే కాదు, మన హార్మోన్లలో అనుకోని మార్పులు కలిగించే ప్రమాదం కూడా ఉంది. కేవలం ఇది కాదు, కొన్ని రసాయనాలు కీళ్లను దెబ్బతీస్తూ, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల పుట్టుకకు దారితీస్తాయనే సైంటిఫిక్ అధ్యయనాలు ఉన్నాయి.
ఇప్పుడు మనం పేపర్ గ్లాసులను పర్యావరణ హితమైనవి అని అనుకునే ఈ భావన కూడా సరికాదు. వీటిలో ఉపయోగించే ప్లాస్టిక్ పొర వల్ల అవి నమ్మకమైన రీసైక్లింగ్ కాలేదు. ఫలితంగా, పేపర్ గ్లాసులు విసిరినప్పుడు అవి మట్టి, నీరు చేరే ప్రదేశాలు, ఉదాహరణకు కుంటలు, చెరువులు, నదులు, బావులు, వర్షపు నీటి నిల్వ ప్రాంతాలు — వీటిలో పేపర్ గ్లాసులు పడిపోతే లేదా అక్కడ ప్లాస్టిక్ పొర కరుగితే, ఆ నీరు కలుషితం (contaminated) అవుతుంది. పర్యావరణ కాలుష్యం, నీటి పొదుపు విషయంలో పెద్ద ముప్పు అన్నమాట. ఇప్పటి పరిణామంలో మనం పేపర్ గ్లాసులకు బదులు, సుస్థిరమైన వేరువేరు మార్గాలను ఎంచుకోవాలి. గాజు గ్లాసులు లేదా సిరామిక్ కప్పులు వాడటం ఆరోగ్యానికి మంచిది. అంతేకాదు, అవి పర్యావరణ హితమైనవిగా కూడా పరిగణించబడతాయి. ఎక్కువసార్లు వాడగల కప్పులు మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి, పర్యావరణానికి హాని చేయవు.
మన వ్యక్తిగత అలవాట్లలో ఈ మార్పును తీసుకురావడం ద్వారానే మన ఆరోగ్యం, సహజ వాతావరణాన్ని కాపాడవచ్చు. కాఫీ షాపులకు పోయినపుడు కూడా మీరు మీ స్వంత రీయూసబుల్ కప్పు అంటే(మళ్ళీ మళ్ళీ వాడుకోవడానికి అనువైన కప్పు) తీసుకోవడం ఒక మంచి పద్ధతి. ఇది మన వాతావరణాన్ని కాపాడడంలో సహాయపడుతుంది, అలాగే మన ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. ఇప్పుడు సమాజంలో ఈ విషయంపై అవగాహన పెరుగుతున్నప్పటికీ, ఇంకా చాలామంది ఈ ప్రమాదాల గురించి తెలియకపోవచ్చు. అందుకే మన ఆరోగ్యం కోసం, మన వాతావరణం కోసం చిన్న మార్పులు మన జీవితంలో చేర్పించుకోవడం చాలా ముఖ్యం.