BigTV English

Summer Foods : వేసవి వచ్చేసింది.. మీ ఆహారంలో ఈ మార్పులు చేయండి..!

Summer Foods : వేసవి వచ్చేసింది.. మీ ఆహారంలో ఈ మార్పులు చేయండి..!
summer health tips
Summer diet

Changes In Your Diet : వేసవి వచ్చేసింది. ఈ కాలంలో శరీరంలో అనేక సమస్యలు మొదలవుతాయి. ఎక్కువ వేడి కారణంగా శరీరం నీటి కొరతకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా కాళ్లు బిగుసుకుపోవడం, సిరల్లో ఒత్తిడి సమస్యలు వంటివి కూడా వస్తాయి. ఈ సమస్యల నుండి మిమ్మల్ని రక్షించగల వాటిని మీ ఆహారంలో చేర్చుకోవాలి. వేసవిలో మీ ఆరోగ్యం విషయంలో అత్యంత కీలకమైనది మనం తీసుకునే ఆహారం.


జీర్ణవ్యస్థకు మేలు చేసే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. ఈ వేసవి మీ ప్రేగు ఆరోగ్యాన్ని దెబ్బతీసే అనేక అంశాలను కలిగి ఉంది. వేడిని తట్టుకోలేక చాలా మంది చల్లని పదార్థాలు ,చక్కెర పానీయాలు, చల్లటి బీర్లు వంటి వాటికోసం ఆరాటపడతారు. ఇవి తీసుకునేటప్పుడు బాగానే అనిపిస్తుంది కానీ, కడుపులోకి వెళ్లిన తర్వాత అనేక అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి. కాబట్టి వేసవిలో తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో తెలుసుకుందాం.

Read More : ఏడాదికి ఒక్కసారి ఈ రక్త పరీక్షలు తప్పనిసరి..!


వేసవిలో మన శరీరానికి అనుకూలమైన ఆహారాన్ని తీసుకోవాలి. మీరు తీసుకునే ఆహారంలో సరైన ప్రోబయోటిక్స్, మజ్జిగ, సత్తు వంటివి అదనంగా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల మీ పేగు ఆరోగ్యం బాగుంటుంది. ఇది మిమ్మల్ని చల్లగా ఉంచడంతో పాటు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది.

పెరుగు అన్నం

వేసవిలో ఏదైనా ఒకపూట పెరుగన్నం తినడం అలవాటు చేసుకోండి. వేసవి వేడిని తట్టుకోవాలన్నా, మీ కడుపు ఆరోగ్యంగా ఉండాలన్నా పెరుగఅన్నం చాలా మంచిది. పెరుగు ప్రోబయోటిక్స్‌తో నిండి ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా పెరుగన్నంలో కాల్షియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల మీ ఎముకలు , కండరాలను ఆరోగ్యంగా ఉంటాయి. ఈ వేసవిలో మధ్యాహ్నం పూట ఒక గిన్నె పెరుగు అన్నం తినండి.

తృణధాన్యాలు

వేసవిలో వేడిని అధిగమించగల ఆహారాన్ని మీరు తినాలి. తృణధాన్యాలు మీకు చాలా అవసరమైన పోషణను అందిస్తాయి. పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మెరుగ్గా పనిచేస్తాయి. కాబట్టి తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోండి. సాధారణ దాల్ రైస్‌తో పాటుగా బార్లీ, రాగి వంటివి తీసుకోండి. తృణధాన్యాలు మంచి బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహిస్తాయి.

Read More : త్వరగా తింటే ఏమోతుందో తెలుసా..?

మజ్జిగ

వేసవిలో మీ పేగును ఆరోగ్యంగా, చల్లగా ఉంచుకోవాలంటే మజ్జిగ తాగండి. మజ్జిగలో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియ మెరుగుపరచడంతో పాటు మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. మజ్జిగలో కేలరీలు తక్కువగా.. అవసరమైన ఖనిజాలు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.

అరటిపండ్లు

వేసవిలో అరటిపండ్లకు మించినవి మరొకటి లేదు. ఈ పండు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కడుపు నొప్పి వంటి సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. నీరసంగా మారిన మీ శరీరాలకు తక్షణమే శక్తిని అందిచడంలో అరటిపండ్లు సహాయపడతాయి.

Disclaimer : ఈ కథనం పలు వైద్య అధ్యాయనాల ఆధారంగా సేకరించిన సమాచారం మాత్రమే.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×