BigTV English

Heart Attack: ఈ ఇంజెక్షన్ తీసుకుంటే హార్ట్ ఎటాక్ దరిచేరదు..ఆ ఇంజెక్షన్ పేరేంటో తెలుసా?

Heart Attack: ఈ ఇంజెక్షన్ తీసుకుంటే హార్ట్ ఎటాక్ దరిచేరదు..ఆ ఇంజెక్షన్ పేరేంటో తెలుసా?

Heart Attack Inclisiran Injection: ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ వస్తుంది. అయితే ఏ సమస్య వచ్చినా పర్లేదు కానీ సడెన్‌గా వచ్చే హార్ట్ ఎటాక్ వస్తే మాత్రం డెంజర్‌గా పరిగణిస్తారు. కొన్ని రకాల సమస్యలకు వస్తే చికిత్స తీసుకునేందుకు సమయం ఉంటుంది. కానీ ఇలాంటి సమస్యపై అప్రమత్తంగా ఉండాలి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


హార్ట్ ఎటాక్ రాకుండా మార్కెట్‌లోకి కొత్త ఇంజెక్షన్ వచ్చిన సంగతి తెలిసిందే. అదేనండీ ఇంక్లిసిరాన్. అయితే ఇప్పటికీ ఈ ఇంజక్షన్‌పై అవగాహన లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ ఇంజక్షన్ కు అనుమతులు కూడా రావడంతో ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి.

ఈ హార్ట్ ఎటాక్ గుండెలోని రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ చేరడంతో రక్త ప్రవాహం నిలిచి హార్ట్ ఎటాక్ రావడానికి దారితీస్తుంది. అయితే కొత్తగా వచ్చిన ఈ ఇంజెక్షన్ రక్తనాళాల్లో పెరిగే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందని అంటున్నారు. అయితే చెడు కొలెస్టరాల్ స్థాయిని తగ్గించేందుకు ప్రస్తుతం స్టాటిన్స్ డ్రగ్స్ ఉపయోగిస్తున్నారు. అయితే దీనికంటే ఇంక్లిసిరాన్ ఇంజెక్షన్ బాగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


హార్ట్ ఎటాక్ దరిచేరకుండా ఉండాలంటే ప్రతీ ఆరు నెలలకోసారి ఈ ఇంజెక్షన్ తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. ఇది ప్రధానంగా ప్లాస్మాలో తక్కువ సాంద్రత గల కొవ్వును నియంత్రిస్తుంది.అలాగే చెడు కొలెస్ట్రాల్ ను కాలేయం గ్రహించేలా చేయడంతో హార్ట్ ఎటాక్ రాకుండా చేస్తుందని అంటున్నారు.

ఇప్పటికే ఈ ఇంజెక్షన్ సమర్థంగా పనిచేస్తోందని లాన్సెట్ నివేదిక చకెప్పింది. కాగా, ఐదు దేశాల్లో నిర్వహించిన ట్రయల్స్ కు సంబంధించిన నివేదికను లాన్సెట్ జనరల్ గతేడాది విడుదల చేసింది. కొవ్వు 50 శాతం పైగా తగ్గిస్తుందని జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజీ ఆఫ్ కార్డియాలజీ రిపోర్ట్ ఇచ్చింది. ఏది ఏమైనా చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో ట్రయల్స్ లో తేలడంతో ఈ డ్రగ్ వినియోగించేందుకు యూకే నేషనల్ హెల్త్ సర్వీసెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Also Read: బీర్ తాగితే బరువు పెరుగుతారా ? నిపుణులు ఏం చెబుతున్నారంటే ..

ఇదిలా ఉండగా, యూకేలో ఈ ఇంజెక్షన్ తీసుకున్న కొంతమందిలో చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లు గుర్తించారు. ముక్కుతో పాటు గొంతు వాపు వంటి లక్షణాలు బయటపడ్డాయి. ప్రతీ ఐదుగురిలో ఒకరికి ఈ సమస్య కనిపించగా.. ఈ ఇంజెక్షన్ తీసుకున్న చోట దద్దుర్లు, చర్మం ఎరుపు రంగులోకి మారినట్లు బయటపడింది. అయితే ఇండియాలో ఎక్కువగా హార్ట్ ఎటాక్ వస్తున్న నేపథ్యంలో ఈ ఇంజెక్షన్ ఓ వరమని వైద్యులు చెబుతున్నారు.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×