BigTV English

Alcohol and Weight Gain: బీర్ తాగితే బరువు పెరుగుతారా ? నిపుణులు ఏం చెబుతున్నారంటే ..

Alcohol and Weight Gain: బీర్ తాగితే బరువు పెరుగుతారా ? నిపుణులు ఏం చెబుతున్నారంటే ..

Alcohol and Weight Gain: ప్రసుతం బీర్ తాగడం అనేది చాలా కామన్. చిన్నాపెద్దా తేడా లేకుండా ఆల్కహాల్ తెగ తాగుతుంటారు. అకేషన్ ఏదైనా సరే ఆల్కహాల్ ఉండాల్సిందే. వీకెండ్ వస్తే చాలు బ్యాచిలర్స్‌కి పండగే. అయితే బీర్‌ కార్బోహైడ్రేట్స్, ఆల్కహాల్‌తో పాటు ఫ్యాట్స్ శరీరంలో కేలరీల సంఖ్యను పెంచుతుంది. కాకపోతే బీర్ రకాన్ని బట్టి ఆల్కహాల్ కంటెంట్‌‌తో పాటు కేలరీల సంఖ్య కూడా మారుతూ ఉంటుంది. 355 మిల్లీ లీటర్ల బీరు తాగితే 150 కేలరీల శక్తి లభిస్తుంది. ఇదిలా ఉంటే బీర్ తాగడం వల్ల బరువు పెరుగుతారని చెబుతుంటారు. కానీ ఇది అవాస్తవం అని నిపుణులు అంటున్నారు.


బీర్ తాగే వారు సాధారణంగా తినే ఆహారంలో, డైట్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. దీని కారణంగానే బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.అయితే ఎక్కువగా బీర్ తాగడం వల్ల మెటబాలిజంపై ప్రభావం పడుతుంది. వాటిలో ఉండే కేలరీలతో పాటు అదనంగా తీసుకునే ఆహారం.. శరీరంలో కొవ్వును పెంచుతుంది. ఇదంతా పొట్ట భాగంలో పేరుకుపోవడం వల్ల బరువు పెరిగినట్లు కనిపిస్తారు.

ఈ సమస్య రాకుండా ఉండాలి అంటే హైడ్రేట్‌గా ఉండడం ఎంతైనా అవసరం. బీర్ తాగే అలవాటు ఉన్న వారు నీరు కూడా ఎక్కువగా తాగడం అలవాటు చేసుకోండి. అంతే కాకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇదిలా ఉంటే సాధారణంగా బరువు పెరగడానికి అనేక కారణాలు ఉంటాయి. కానీ ఆల్కహాల్ తీసుకుని, బద్ధకం ఉండే వారిలో శారిరక శ్రమ తగ్గడం వల్ల బరువు కాస్త పెరుగుతుంది. ఫలితంగా మెటబాలిజం దెబ్బతిని క్రమంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. అలా జరగకుండా ఉండాలి అంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం.


Related News

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Big Stories

×