Slumdog Teaser : పూరి జగన్నాథ్…టాలీవుడ్ లో ఈ పేరు ఒకప్పుడు సెన్సేషన్.తనదైన మాటల తూటాలతో బాక్సాఫీస్ ని చీల్చి చెండాడిన ఈ స్టార్ డైరెక్టర్ గత కొన్నేళ్లుగా సక్సెస్ ట్రాక్ ఎక్కలేకపోతున్నాడు.ఇక ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాల్సిందే అంటూ పట్టాలెక్కించిన సినిమా స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’ .మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మెయిన్ లీడ్ గా తెరకెక్కిన ఈ సినిమా అనౌన్స్ అయినప్పుడే ట్రేడ్ వర్గాల్లో భారీ హైప్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఆ అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తూ ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’ అనే టైటిల్‌తో వస్తున్న ఈ పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్ మూవీ సరికొత్త సంచలనాలకు తెరలేపుతోంది. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్‌కు సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్ రాగా, తాజాగా చిత్రయూనిట్ విడుదల చేసిన పవర్‌ఫుల్ “టీజర్ మేకింగ్ వీడియో” ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
సాధారణంగా పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరోల యాటిట్యూడ్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. గతంలో వచ్చిన ‘పోకిరి’, ‘బిజినెస్‌మెన్’ రీసెంట్‌గా వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి చిత్రాల్లో హీరోల బాడీ లాంగ్వేజ్ ఎంత ఊరమాస్‌గా ఉంటుందో చూశాం. అయితే ఈసారి విజయ్ సేతుపతి కోసం పూరి మరింత క్రేజీగా ఇంతకూ ముందెప్పుడూ చూడని పాత్రను డిజైన్ చేసినట్లు ఈ మేకింగ్ వీడియో చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ఒక బిచ్చగాడి పాత్రలో కనిపించబోతున్నారు.
ఒక స్టార్ ఇమేజ్ ఉన్న నటుడు ఇలాంటి డీగ్లామరైజ్డ్ రోల్ చేయడం విశేషం కాగా, ఆ గెటప్ కోసం ఆయన పడ్డ కష్టం, విభిన్నమైన డైలాగ్ డెలివరీ, మరియు యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రాణం పెట్టి చేసిన ఫైట్స్ ఈ మేకింగ్ వీడియోలో ప్రధాన హైలైట్‌గా నిలిచాయి. సొసైటీలో మనం ప్రతిరోజూ చూసే బిచ్చగాళ్ళ జీవితాల వెనుక ఉండే కొన్ని ఊహించని నిజమైన సంఘటనలు మరియు బలమైన ఎమోషన్స్ ఆధారంగా పూరి ఈ కథను రాసుకున్నట్లు తెలుస్తోంది.
also read :కోలీవుడ్‌లో మరో మైండ్ బ్లోయింగ్ కాంబో.. ఆ స్టార్ డైరెక్టర్‌కు ధనుష్ గ్రీన్ సిగ్నల్!
ఈ క్రేజీ ప్రాజెక్టులో కాస్టింగ్ పరంగా కూడా పూరి జగన్నాథ్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని వీడియో చూస్తేనే అర్థం అవుతుంది. బాలీవుడ్ సీనియర్ స్టార్ నటి టబు ఈ చిత్రంలో ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత టబు మళ్ళీ తెలుగు తెరపై కనిపిస్తుండటం విశేషం. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా సంయుక్త నటిస్తుండగా, కన్నడ ఇండస్ట్రీలో తన యాక్షన్ పవర్‌తో మెప్పించిన ప్రముఖ నటుడు దునియా విజయ్ ఈ చిత్రంలో మెయిన్ విలన్ రోల్‌లో కనిపించబోతున్నారు. పూరి సినిమాల్లో విలన్ పాత్రలు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో ‘టెంపర్’ వంటి సినిమాలు నిరూపించాయి, కాబట్టి దునియా విజయ్ క్యారెక్టర్ కూడా అంతే వైల్డ్‌గా ఉండబోతోందని టాక్.
గత కొన్నేళ్లుగా సరైన సాలిడ్ హిట్ కోసం చూస్తున్న పూరి జగన్నాథ్, ఈ ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద గట్టి కంబ్యాక్ ఇవ్వబోతున్నాడని మేకింగ్ చూస్తేనే అర్థమవుతుంది.ఇక చార్మీ కౌర్, పూరి జగన్నాథ్ సంయుక్తంగా పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా తెలుగు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మేకింగ్ వీడియో విడుదలైన కొద్ది నిమిషాల్లోనే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లడం విశేషం. చూడాలి మరి ఈ సినిమా అయినా పూరి ని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందో లేదో !
also read :రుక్మిణి వసంత్ నెక్స్ట్ లెవెల్ ప్లాన్.. నాని బ్యానర్‌లో సాలిడ్ ఛాన్స్!