E-Paper
Advertisement

రోజంతా ఆఫీసులో అలసటగా ఉందా? పనిచేస్తూ ఈ ప్రొటీన్ స్నాక్స్ తింటే గంటల తరబడి ఫుల్ ఎనర్జీ

రోజంతా ఆఫీసులో అలసటగా ఉందా? పనిచేస్తూ ఈ ప్రొటీన్ స్నాక్స్ తింటే గంటల తరబడి ఫుల్ ఎనర్జీ
Advertisement

ఆఫీస్‌లో ఎక్కువసేపు పనిచేస్తే ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది. చాలామంది రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పని చేస్తుంటారు. మీటింగ్‌లు, డెడ్‌లైన్‌లు, పనిభారం కారణంగా ఒత్తిడి కూడా పెరుగుతుంది. అందుకే సాయంత్రం సమయానికి ఆకలి వేయడం సహజం. ఆ సమయంలో చాలా మంది చిప్స్, బిస్కెట్లు లేదా ఇతర ప్యాకెట్ స్నాక్స్ తింటారు. అయితే ఇవి కొద్దిసేపు మాత్రమే తృప్తినిస్తాయి. తర్వాత మళ్లీ ఆకలి వేయడంతో పాటు ఎనర్జీ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. అందుకే హై ప్రోటీన్ స్నాక్స్‌ను ఎంచుకోవడం మంచిది.

ప్యాకెట్ స్నాక్స్ ఎందుకు తగ్గించాలి?

ప్యాకెట్‌లో లభించే చాలా స్నాక్స్‌లో అధిక ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు, మైదా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తినిచ్చినప్పటికీ త్వరగా తగ్గిపోతుంది. దీంతో మళ్లీ ఆకలి వేయడం ప్రారంభమవుతుంది. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు మాత్రం నెమ్మదిగా జీర్ణమవుతాయి. అందువల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది.

పనీర్ క్యూబ్స్ మంచి ఎంపిక

Advertisement

పనీర్‌లో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలపై కొద్దిగా చాట్ మసాలా లేదా మిరియాల పొడి చల్లవచ్చు. పనీర్ తయారు చేయడం చాలా సులభం. ఆఫీస్‌లో ఫ్రిజ్ ఉంటే నిల్వ చేసి పెట్టుకోవచ్చు.

ఆకలిని తగ్గించే రోస్టెడ్ శనగలు

వేయించిన శనగలు ఆరోగ్యకరమైన స్నాక్‌గా ఉపయోగపడతాయి. వాటిని ఫ్రిజ్‌లో ఉంచాల్సిన అవసరం ఉండదు. ఒక చిన్న డబ్బాలో ఆఫీస్ డెస్క్‌పై ఉంచుకుని అవసరమైనప్పుడు తినవచ్చు. వీటిలో ప్రోటీన్‌తో పాటు ఫైబర్‌ కూడా ఉంటుంది.

పోషకాల నిలయం మొలకెత్తిన పెసర చాట్

Advertisement

మొలకెత్తిన పెసరలో ప్రోటీన్, ఫైబర్, ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. ఇందులో ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, నిమ్మరసం కలిపి చాట్ తయారు చేసుకోవచ్చు. ఇది తేలికగా ఉండటంతో పాటు రుచికరమైన ఆహారం కూడా.

రుచికరమైన స్నాక్ పల్లీ చాట్

ఉడికించిన లేదా వేయించిన పల్లీల (వేరు శెనగ గింజలు) తో చాట్ తయారు చేసుకోవచ్చు. ఇందులో దోసకాయ, టమాటా, ఉల్లిపాయ, నిమ్మరసం కలిపితే మరింత రుచిగా ఉంటుంది. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్‌ ఉంటాయి.

ఉడికించిన గుడ్లు ఎక్కువసేపు తృప్తినిస్తాయి

ఉడికించిన గుడ్లు ఎప్పటికీ మంచి స్నాక్ ఆప్షన్. వాటిపై కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు చల్లి తింటే మరింత రుచికరంగా ఉంటాయి. ఇవి ఎక్కువసేపు ఆకలి వేయకుండా సహాయపడతాయి. అలాగే కండరాల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

Also Read: రోజుకు ఎన్ని పుష్ అప్స్ చేస్తే ఆరోగ్యానికి మంచిది? దీనికి సమాధానం మీ వయసు

గ్రీక్ యోగర్ట్, పండ్లు

షుగర్ లేకుండా ఉండే గ్రీక్ యోగర్ట్ (ప్రత్యేక పెరుగు) ఆరోగ్యకరమైన ఎంపిక. ఈ పెరుగులో ఆపిల్ లేదా అరటి ముక్కలు కలిపి తినవచ్చు. ఇది తీపి తినాలనే కోరికను సహజంగా తగ్గిస్తుంది. ఈ స్నాక్ ప్రోటీన్, కాల్షియంను అందిస్తుంది.

శనగ పిండి దోశ రోల్స్

ఉదయం శనగ పిండి దోశ తయారు చేసి అందులో కూరగాయలు లేదా పనీర్ వేసి రోల్‌గా చేసుకోవచ్చు. ఇవి రుచిగా ఉండటంతో పాటు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి.

ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను ఎంచుకోవడం వల్ల ఏకాగ్రత, పనితీరు మెరుగుపడతాయి. హై ప్రోటీన్ ఆహారాలు శరీరంలో ఎక్కువ సేపు ఎనర్జీ నిలబెట్టడంలో సహాయపడతాయి. కాబట్టి జంక్ ఫుడ్‌కు బదులుగా పోషకాలు అధికంగా ఉండే స్నాక్స్‌ను ఎంచుకోవడం మంచిది.

Related News

సూర్యాస్తమయం చూస్తే నిజంగానే ఒత్తిడి తగ్గుతుందా? నిద్ర, మూడ్ మెరుగవుతాయా?

స్టైలిష్ లుక్,సూపర్ ఫీచర్లు..బెస్ట్ స్మార్ట్‌వాచ్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్!

మోకాళ్ల సమస్యలతో బాధపడుతున్నారా? ఈ తప్పుడు అలవాట్లే కారణం

మలవిసర్జన సమయంలో రక్తం వస్తోందా? అది పైల్స్ అనకుంటే మీరు పొరబడునడినట్లే

చిన్న వయసులోనే పేరు, గుర్తింపు పొందుతారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి అతిత్వరగా విజయాలు సాధిస్తారు

మంచి వ్యక్తుల ఈ అలవాట్లే వారి బలహీనతలు.. మీరు కూడా ఈ తప్పులు చేస్తున్నారా?

ఆఫీస్ డెడ్‌లైన్లు, మీటింగ్‌లతో సతమతమవుతున్నారా? స్ట్రెస్ తగ్గేందుకు 5 నిమిషాలు ఇలా చేయండి!

వాడిన టీ బ్యాగ్స్ పారేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే.. వాటివల్ల ఎన్ని లాభాలో తెలుసా?

Big Stories

Advertisement
×