E-Paper

మొహ్సిన్ నఖ్వీకి ప్ర‌మోష‌న్‌..ఇక పాకిస్తాన్ క్రికెట్ ను ఆ అల్లాహ్ దిగివ‌చ్చినా కాపాడ‌లేడు

మొహ్సిన్ నఖ్వీకి ప్ర‌మోష‌న్‌..ఇక పాకిస్తాన్ క్రికెట్ ను ఆ అల్లాహ్ దిగివ‌చ్చినా కాపాడ‌లేడు
Advertisement

Mohsin Naqvi  become Foreign Minister: పాకిస్తాన్ క్రికెట్ పరిస్థితి ప్రస్తుతం అత్యంత దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. కీలక టోర్నమెంట్లలో బొక్క బోర్ల పడుతూ, అంతర్జాతీయంగా పరువు తీసుకుంటుంది. మొన్న ఆస్ట్రేలియాపై సొంత గడ్డపై విజయాలను నమోదు చేసుకున్న పాకిస్తాన్… టీమిండియా అలాగే బంగ్లాదేశ్ చేతుల్లో చావు దెబ్బ తిన్నది. ఈ నేప‌థ్యంలో తమ జట్టును బలంగా తయారు చేసుకునేందుకు కొత్త కోచ్ ల కోసం వేట మొదలుపెట్టింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఇలాంటి నేపథ్యంలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి (PCB Chairman Mohsin Naqvi ) బంపర్ ఆఫర్ తగిలింది. ఆయనకు ప్రమోషన్ ఇచ్చేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా ( Foreign Minister) ఆయనకు అదనంగా బాధ్యతలు అప్పగించబోతున్నారట. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.

Also Read: Kumar asangakkara On vaibhav Sooryavanshi fight with Sri Lanka A team: బుడ్డోడు, బుడ్డోడు అంటూ వైభ‌వ్ ను రెచ్చ‌గొట్ట‌ద్దు…లంక ప్లేయ‌ర్ల‌కు సంగ‌క్క‌ర హెచ్చ‌రిక‌

మొహ్సిన్ నఖ్వీకి మ‌రో ప‌ద‌వి

Advertisement

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ గా ఉన్న మొహ్సిన్ నఖ్వీ ఇప్పటికే ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మ‌న్‌ బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్నాడు. ఈ రెండు పదవులు ఉన్న మొహ్సిన్ నఖ్వీకి… మరో బంపర్ ఆఫర్ తగిలింది. మొహ్సిన్ నఖ్వీకి విదేశాంగ మంత్రి పదవి ఇచ్చేందుకు పాకిస్తాన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మరో వారం రోజుల్లో ఈ ప్ర‌మోష‌న్ పై అధికారిక ప్రకటన రావడమే కాకుండా, ఆయన బాధ్యతలు కూడా తీసుకోబోతున్నారట. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. అయితే విదేశాంగ మంత్రిగా మొహ్సిన్ నఖ్వీకి ప్రమోషన్ వచ్చినప్పటికీ… పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ గా ఆయనే కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఈ పదవిని మాత్రం అస్సలు వదిలేది లేదని అంటున్నారట మొహ్సిన్ నఖ్వీ. అందుకే రెండు పదవుల్లో కొనసాగేలా చర్యలు తీసుకునేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం సిద్ధమైందట.

పాకిస్తాన్ క్రికెట్ ను ఆ అల్లాహ్ దిగివ‌చ్చినా కాపాడ‌లేడు

పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ గా ఉన్న మొహ్సిన్ నఖ్వీ పాలనలో క్రికెట్ అస్తవ్యస్తంగా తయారైంది. టీమిండియా తో జరిగే ఏ ఒక్క మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ గెలవలేదు. ప్రతి మ్యాచ్ ఓడిపోతూనే ఉంది. పురుషులతోపాటు మహిళల జట్లు కూడా అధ్వానంగా తయారయ్యాయి. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా మొహ్సిన్ నఖ్వీ బాధ్యతలు తీసుకుంటే.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గా ఉన్న ఆయన, క్రికెట్ గురించి అస్సలు పట్టించుకునే ఛాన్స్ లేదని అంటున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ ప్రమాదకరమైన పరిస్థితిలో ఉండగా…. ఆయన విదేశాంగ మంత్రిగా వెళ్తే, సంక నాకి పోవడం గ్యారెంటీ అంటున్నారు. విదేశాంగ మంత్రిగానే మొహ్సిన్ నఖ్వీ ఎక్కువగా ఫోకస్ చేస్తాడని.. క్రికెట్ ను అస్సలు పట్టించుకోడని అంటున్నారు. ఇది జరిగితే, పాకిస్తాన్ కాస్త ఉగాండాగా మారిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు.

Advertisement

Also Read: vaibhav Sooryavanshi fight with Sri Lanka A team: ఇక చాలు ఫ్లైట్ ఎక్కి ఇంటికి వెళ్లి, ఐపీఎల్ ఆడుకో…వైభ‌వ్ కు లంక మాజీల వార్నింగ్

 

Related News

మైదానంలోనే కుప్ప‌కూలిన‌ శ్రేయాంక పాటిల్..నేరుగా ఇండియా ఫ్లైట్ ఎక్కించిన బీసీసీఐ !

Tanveer Ahmed: మా అల్లా దిగివ‌చ్చినా…టీమిండియాను పాకిస్తాన్ ఓడించ‌లేదు

అందానికే అసూయ తెప్పిస్తోంది, నిద్ర‌కూడా పోనివ్వ‌డం లేదు.. ఎవ‌రీ 17 ఏళ్ల ఇరా ఏరీ ?

Sanjay Manjrekar: నేనే కోచ్ అయితే, వైభవ్ రెండు చెంపలు వాయించేవాడిని

ఇండియా చేతిలో ఓట‌మి..పాకిస్తాన్ ప్లేయర్లకు నరకం చూపిస్తున్న కోచ్‌

బంగ్లాదేశ్ లో దంచికొడుతున్న ఎండ‌లు..మైదానంలోనే కుప్ప‌కూలిన‌ టిమ్ డేవిడ్

మా పాక్ ప్లేయ‌ర్ల‌కు కూడా కాలి బూటు చూపించాడు..వైభ‌వ్ పై ప‌ర్మినెంట్ బ్యాన్ వేయాలి

×