Money Plant: మనీ ప్లాంట్ ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా వాస్తు , ఫెంగ్ షుయ్ ప్రకారం శ్రేయస్సు, సానుకూల శక్తిని కూడా అందిస్తుంది. కానీ మనీ ప్లాంట్ ఎండిపోవడం ప్రారంభమయితే.. ఆకులు పసుపు లేదా గోధుమ రంగులోకి మారతాయి. మొక్క పెరగడం ఆగిపోయినా కూడా మనలో ఆందోళన పెరుగుతుంది. కానీ ఇలావటి సమయంలోనే ఎండిన మనీ ప్లాంట్‌ను మళ్ళీ పచ్చగా, సజీవంగా మార్చగల కొన్ని హోం రెమెడీస్ కూడా మీ వంటగదిలోనే ఉన్నాయి. వీటిని వాడటం వల్ల మొక్క పచ్చగా, ఆరోగ్యంగా ఉంటుంది. దీనివల్ల ఆకర్షణీయంగా కూడా కనిపిస్తుంది.
డికాషన్ ( టీ పౌడర్ ):
మనలో చాలామంది ప్రతిరోజూ టీ తయారు చేసుకుని.. ఆ తర్వాత వడకట్టిన టీ పౌడర్ బయట పారేస్తారు. కానీ దానిని మీ మనీ ప్లాంట్‌కు అద్భుతమైన సహజ ఎరువుగా కూడా ఉపయోగించవచ్చు. ఇందులో టానిన్, భాస్వరం, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మొక్కల వేర్లను బలోపేతం చేస్తాయి. అంతే కాకుండా మొక్కలను కూడా పచ్చగా ఉంచుతాయి. ఉపయోగించిన టీ పౌడర్‌ను ముందుగా బాగా కడగాలి. తద్వారా దానిని మనీ ప్లాంట్ ఉన్న చోట మట్టిలో కలపండి. వారానికి ఒకసారి ఇలా చేయడం ద్వారా, మొక్క యొక్క నేల సారవంతంగా మారుతుంది. అంతే కాకుండా మొక్క త్వరగా పెరుగుతుంది. ఎండిపోతున్న మొక్కలకు కూడా టీ పౌడర్ వాడితే మంచి ప్రయోజనం ఉంటుంది.
బియ్యం పిండి:
బియ్యం వండేటప్పుడు వచ్చే తెల్లటి నీరు ( గంజి) సాధారణంగా పారబోస్తాము. కానీ ఈ పిండి పదార్ధంలో కార్బోహైడ్రేట్లు, విటమిన్ బి , అనేక ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొక్కల వేర్లకు శక్తిని అందిస్తాయి. అంతే కాకుండా వాడిపోయిన ఆకులను పునరుజ్జీవింపజేస్తాయి. ముందుగా.. బియ్యం ఉడికిన తర్వాత, మిగిలిన స్టార్చ్‌ను చల్లబరిచి, నేరుగా కాస్త మనీ ప్లాంట్ వేర్ల దగ్గర పోయాలి. ఈ నీరు నేలలో పోషకాలను పెంచుతుంది. అంతే కాకుండా మొక్కల పెరుగుదలను వేగంగా మెరుగుపరుస్తుంది. ఉప్పు మొక్కలకు హానికరం కాబట్టి, అందులో ఉప్పు ఉండకుండా జాగ్రత్త వహించండి. ఈ పిండి పదార్ధం మొక్కకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మొక్కను ఆరోగ్యంగా , దృఢంగా ఉంచుతుంది.
మరికొన్ని చిట్కాలు:
మనీ ప్లాంట్ కి అతిగా నీరు పోయడం మానుకోండి. పైన నేల ఎండిపోయినప్పుడు మాత్రమే నీరు పెట్టండి. పరోక్ష సూర్యకాంతి పడే ప్రదేశంలో మొక్కలను ఉంచండి. మొక్క కొత్త ఆకులు పెరిగినా కూడా సరిసడా ప్రదేశం ఉండేలా చూడండి. అంతే కాకుండా ఆకులు , బలహీనమైన కాండాలను ఎప్పటికప్పుడు కత్తిరిస్తే.. ఉండండి.
మనీ ప్లాంట్‌ను గాజు సీసాలో నీరు పోసి కూడా పెంచవచ్చు కానీ ప్రతి వారం నీటిని మారుస్తూ ఉండండి. కొన్నిసార్లు మొక్కల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఖరీదైన ఎరువులు వాడనవసరం లేదు. మన కిచెన్ లో లభించే హోం రెమెడీస్ టీ ఆకులు, బియ్యం పిండి వంటివి సహజమైన , ప్రభావవంతమైన నివారణలు కూడా ఉపయోగించవచ్చు. మీరు వీటిని క్రమం తప్పకుండా ఉపయోగిస్తూ, మొక్కకు కొంత సమయం ఇస్తే.. మనీ ప్లాంట్ కూడా కొన్ని రోజుల్లో పచ్చగా , అందంగా కనిపించడం ప్రారంభిస్తుంది.