OTT Movie : అమ్మాయిలు అమాయకంగా కన్పిస్తే చాలు, ప్రేమగా మాట్లాడి కొంపలు ముంచే కేటుగాళ్లు ఎక్కడికక్కడ ఎదురు పడుతూనే ఉంటారు. ఇలాంటి వాడొకడు ఇద్దరు అక్కా చెల్లెళ్లకు తగులుతాడు. వాడిని గుడ్డిగా నమ్మిన అక్కకు చుక్కలు చూపిస్తాడు. ఈ మూవీ పేరేంటి ? ఏ ఓటీటీలో ఉందంటే?
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
‘వానిష్డ్ ఇన్ యోస్మైట్’ (Vanished in Yosemite) అనే ఈ మూవీ 2023లో విడుదలైన టీవీ థ్రిల్లర్. దీనికి డగ్ క్యాంప్‌బెల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం యోస్మైట్ నేషనల్ పార్క్‌లో సెలవులు గడపడానికి వెళ్లిన ఇద్దరు సిస్టర్స్ కత్రినా, జెన్నిఫర్ ల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా నిజ జీవిత సంఘటనల నుండి ప్రేరణ పొందినప్పటికీ, పూర్తిగా కల్పిత కథ. స్కై కోయిన్ (జెన్నిఫర్), కెల్సీ స్ట్రానహాన్ (కత్రినా), జాసన్ టోబియాస్ (రిక్), రాబ్ లాకోల్లా జూనియర్ (వాలీ) ఇందులో నటించారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అందుబాటులో ఉంది.
కథలోకి వెళ్తే…
కత్రినా, జెన్నిఫర్ అనే ఇద్దరు సిస్టర్స్ యోస్మైట్ నేషనల్ పార్క్‌లో సెలవులు గడపడానికి వెళతారు. కత్రినా ఆనందంగా, సరదాగా ఉండే అమ్మాయి. జెన్నిఫర్ జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా ఉంటుంది. అక్కడ రిక్ (జాసన్ టోబియాస్) అనే హ్యాండ్సమ్ అబ్బాయిని కలుస్తారు ఈ సిస్టర్స్. అతను కత్రినాతో ఫ్లర్ట్ చేస్తాడు. కత్రినా ఆకర్షితురాలై, అతన్ని నమ్మేస్తుంది. జెన్నిఫర్ మాత్రం రిక్ పై అనుమాన పడుతుంది.
తరువాత కత్రినా, రిక్‌తో కలిసి హైకింగ్‌కు వెళ్తుంది. ఆ టైమ్ లో రిక్ ఆమె వాటర్ బాటిల్ లో సీక్రెట్ గా డ్రగ్స్ కలుపుతాడు. కత్రినా మత్తులోకి జారిపోగానే, రిక్ ఆమెను ఒక ట్రక్‌లో వేసి తీసుకెళతాడు. ఈ క్రమంలో ఆమె ఫోన్, రిక్ బ్రాస్‌లెట్ అక్కడే పడిపోతాయి. కత్రినా ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో జెన్నిఫర్ టెన్షన్ పడుతుంది. ఆమె తన సోదరి ఫోన్ లొకేషన్‌ను ట్రాక్ చేస్తూ అడవిలోకి వెళ్తుంది. అలాగే సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ సహాయం కోరుతుంది. జెన్నిఫర్‌తో పాటు ఆమె బాయ్‌ఫ్రెండ్ వాలీ కూడా కత్రినాను వెతకడానికి హెల్ప్ చేస్తాడు.
Read Also : శ్రీముఖి చెప్పమంటే చెప్పా.. నా వెనుక ఉన్నది మంగ్లీ అక్కనే.. సింగర్ ప్రవస్తి
కత్రినాను ఒక రిమోట్ క్యాబిన్‌లో బంధిస్తారు రిక్, అతని సోదరి మెలిస్సా. ఇద్దరూ సైకోలే. అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి, వారిని బాణాలతో వేటాడి చంపే వికృత ఆట అంటే వీళ్ళకు చాలా ఇష్టం. కత్రినా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఒక హైకర్/బర్డ్ వాచర్ ఆమె అరుపులను విని సహాయం చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ రిక్ అతన్ని చంపేస్తాడు. ఇంతటి క్రూరమైన రిక్ వలలో చిక్కుకున్న కత్రినా చివరకు తప్పించుకుందా? జెన్నిఫర్ తన సిస్టర్ ను కాపాడిందా లేదంటే మళ్ళీ వాడి వలలోనే చిక్కుకుందా? అనే ప్రశ్నలకు ఆన్సర్ కావాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.