Dhanashree Verma: టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ – ధన శ్రీ వర్మ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. చాలాకాలంగా దూరంగా ఉంటున్న ఈ జంట.. ఈ ఏడాది ఫిబ్రవరి 5న తమ విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో కేసు వేశారు. కానీ హిందూ వివాహ చట్టం ప్రకారం సర్దుబాటు కోసం ప్రయత్నించేందుకు వీలుగా కనీసం ఆరు నెలల సమయాన్ని కేటాయిస్తారు. దీన్నే కూలింగ్ ఆఫ్ పీరియడ్ గా చెబుతారు.
అయితే ఈ రెండున్నర ఏళ్లకు పైగా తాము విడిగానే ఉంటున్నామని, పరస్పర అంగీకారంతోనే విడాకులు కోరుతున్నామని, అందువల్ల కూలింగ్ ఆఫ్ పీరియడ్ ని తొలగించి వెంటనే విడాకులు మంజూరు చేయాలని ఈ జంట న్యాయస్థానాన్ని కోరింది. ఈ విజ్ఞప్తిని ఫ్యామిలీ కోర్టు కొట్టి వేయడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు చాహల్ కూడా ఐపీఎల్ కారణంగా తాను మూడు నెలల పాటు అందుబాటులో ఉండలేనని వెల్లడించాడు.
దీనిపై స్పందించిన హైకోర్టు.. ఈ నిబంధన నుండి చాహల్ – ధన శ్రీ కి సడలింపు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటు విడాకులకు సంబంధించి తుది తీర్పు ఇవ్వాలని సూచించింది. దీంతో చాహల్ – ధన శ్రీ జంటకు విడాకులను మంజూరు చేసింది ఫ్యామిలీ కోర్టు. మరోవైపు విడాకుల ప్రక్రియను ముగించే క్రమంలో ధనశ్రీకి.. చాహల్ 4 కోట్ల 75 లక్షల రూపాయలను భరణం రూపంలో చెల్లించాడు. యూట్యూబర్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ తో చాహల్ కి 2020 డిసెంబర్ లో వివాహం జరిగింది.
18 నెలల తర్వాత 2022 జూన్ నుండి వీరిద్దరూ విడిగానే ఉన్నారు. తాజాగా విడాకులు తీసుకున్నారు. చాహల్ తో పెళ్లికి ముందే యూట్యూబ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అలాగే ఇండస్ట్రీలో పాపులర్ నటిగా ఉండేది ధనశ్రీ వర్మ. తన అందం, అభినయంతో పాటు.. తన డాన్స్ తో ఎంతోమంది ఫాలోవర్లను సంపాదించుకుంది. ఇక చాహల్ తో వివాహం అనంతరం ధన శ్రీ వర్మకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.
Also Read: Backfoot No Ball: వివాదంగా మారిన స్టార్క్ నో బాల్…. అంబానీ కుట్రలు చేశాడని ఆరోపణలు
ప్రస్తుతం ఈమెకి ఇన్స్టాగ్రామ్ లో 6.3 మిలియన్ మంది ఫాలోవర్లతో పాటు.. యూట్యూబ్ లో 2.7 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన జిమ్ వర్కౌట్, డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది ధనశ్రీ. అయితే తాజాగా ధనశ్రీ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఏకంగా తన బెడ్ రూమ్ వీడియోని షేర్ చేసింది ధనశ్రీ. ఓ మినీ వ్లోగ్ చేసి షేర్ చేసింది. ఈ వీడియోలో తన రోజువారి దినచర్యను తన అభిమానులతో పంచుకుంది. దీంతో ధనశ్రీ వర్మ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">