Pimple Problem: మొటిమలు యుక్తవయస్కులలో వచ్చే ఒక సాధారణ చర్మ సమస్య. ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, కాలుష్యం వంటి అంశాలు మొటిమలను ప్రోత్సహిస్తాయి. వాటిని నయం చేయడానికి మార్కెట్లో అనేక రసాయన ఉత్పత్తులు అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని స్కిన్ కేర్ హెర్బ్స్ ఉపయోగించడం సురక్షితమైనది. అంతే కాకుండా ఇవి మొటిమలను తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తాయి.
ముఖంపై మొటిమలు సమస్య చాలా కలవరపెడుతుంది. వీటి వల్ల ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది.మొటిమల కారణంగా మీ చర్మంపై మచ్చలు కూడా కనిపిస్తాయి. చర్మ రంధ్రాల అడ్డుపడటం వల్ల మొటిమలు వస్తాయి. ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి వేపతో పాటు పసుపు,అలోవెరా, తులసి వంటి వాటిని వాడవచ్చు. వీటిని వాడటం వల్ల తక్కువ సమయంలో మొటిమలు తగ్గుతాయి.
వేప: వేప ఆకులలో యాంటీ బాక్టీరియల్ తో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను చంపడంలో ఉపయోగపడతాయి. అంతే కాకుండా వాపును తగ్గించడంలో సహాయపడతాయి. వేప పేస్ట్ లేదా వేప నూనెను నేరుగా మొటిమల మీద అప్లై చేయవచ్చు.
పసుపు : పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ ,యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో సమృద్ధిగా ఉంటుంది. పసుపు మొటిమలను తగ్గించడంలో , చర్మాన్ని క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా పసుపు పేస్ట్‌ను పెరుగు లేదా తేనెతో కలిపి కూడా మొటిమలపై అప్లై చేయవచ్చు. ఇలా తరుచుగాచేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి. అంతే కాకుండా ముఖం కాంతివంతగా కూడా మారుతుంది.
తులసి: తులసిలో యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇది మొటిమల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. తులసి ఆకుల రసం లేదా పేస్ట్ మొటిమల మీద అప్లై చేయవచ్చు.
అలోవెరా: అలోవెరాలో యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది మొటిమల నుండి ఉపశమనం కలిగించడానికి అంతే కాకుండా చర్మాన్ని తేమగా మార్చడానికి సహాయపడుతుంది . అలోవెరా జెల్ ను నేరుగా మొటిమల మీద అప్లై చేయవచ్చు.
చందనం: గంధంలో శీతలీకరణ గుణాలు ఉన్నాయి. ఇది మొటిమల వల్ల కలిగే మంటను తగ్గించి, చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది. చందనం పేస్ట్‌ని రోజ్ వాటర్‌లో కలిపి అప్లై చేయడం వల్ల కూడా మొటిమలు తగ్గుతాయి.
మెంతులు : మెంతికూరలో యాంటీ ఆక్సిడెంట్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది మొటిమల మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా మెంతి గింజలను పేస్టులా చేసి మొటిమల మీద అప్లై చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి.
మూలికలను ఉపయోగించే మార్గాలు:
నూనెలు – కొన్ని మూలికా నూనెలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వీటిని కొబ్బరి నూనె వంటి క్యారియర్ ఆయిల్‌తో కలిపి మొటిమలకు అప్లై చేయవచ్చు.
టీ- కొన్ని మూలికలతో తయారు చేసిన టీ తాగడం వల్ల చర్మం లోపల నుండి శుభ్రపరచడంలో సహాయపడుతుంది.
Also Read: ఈ ఆయిల్ వాడితే చాలు.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది
ఈ విషయాలను గుర్తుంచుకోండి:
ఏదైనా మూలికను ఉపయోగించే ముందు, ప్యాచ్ టెస్ట్ చేయండి.
మీకు ఏదైనా మూలికల వల్ల అలెర్జీ ఉంటే దానిని ఉపయోగించవద్దు.
గర్భిణీ లేదా పాలిచ్చే స్త్రీలు ఏదైనా మూలికను ఉపయోగించే ముందు తప్పక వైద్యుడిని సంప్రదించాలి.
మీ మొటిమల సమస్య తీవ్రంగా ఉంటే, చర్మ నిపుణుడిని సంప్రదించండి.