Tan Removal Tips: సమ్మర్‌లో ఎండలో తిరగడం వల్ల చేతులు, కాళ్ళు త్వరగా నల్లగా మారతాయి. దీంతో టానింగ్ సమస్య చాలా ఇబ్బంది పెడుతుంది. శరీరాన్ని సరిగ్గా కవర్ చేసుకోకపోతే.. ఎండలో బయటకు వెళ్ళిన వెంటనే చేతులు , కాళ్ళు నల్లగా మారడం ప్రారంభిస్తాయి. టానింగ్ కారణంగా స్లీవ్ లెస్ వంటివి వేసుకోవడం కష్టం అవుతుంది. ఇలాంటి పరిస్థితిలో.. ట్యాన్ రిమూవల్ కోసం ఖరీదైన క్రీములు వాడకుండా ఇంట్లో తయారు చేసిన పదార్థాలతో చేతులు, కాళ్ళపై ఉన్న నల్లదనాన్ని తొలగించుకోవచ్చు.
చేతులు , కాళ్ళు ఎందుకు నల్లగా ఉంటాయి ?
చేతులు, కాళ్ళు నల్లబడటానికి అనేక కారణాలు ఉంటాయి. తరచుగా, మెలనిన్ ఉత్పత్తి పెరగడం, సన్ టానింగ్, కాలుష్యం , సరైన చర్మ సంరక్షణ లేకపోవడం వల్ల, శరీరంపై నల్లటి మచ్చలు కనిపించడం ప్రారంభిస్తాయి. అంతే కాకుండా శరీరాన్ని సరిగ్గా శుభ్రం చేయకపోతే, చేతులు, కాళ్ళు నల్లబడతాయి.
చేతులు, కాళ్ళ నల్లదనాన్ని ఎలా తొలగించాలి ?
చేతులపై ఉన్న నలుపును తొలగించడానికి.. మీకు నిమ్మకాయ అవసరం అవుతుంది. మీకు కావాలంటే.. మీరు ఉపయోగించిన నిమ్మ తొక్కలతో కూడా నల్లదనాన్ని తొలగించవచ్చు. దీని కోసం.. మీ చేతులు, కాళ్ళు, మోకాళ్ల వంటి నల్లటి ప్రాంతాలపై నిమ్మ తొక్కలను రుద్దాలి. ఇలా తరచుగా చేయడం వల్ల నలుపు పూర్తిగా తగ్గిపోతుంది.
కాళ్లపై నల్లదనాన్ని ఎలా వదిలించుకోవాలి ?
మీ కాళ్ళు చాలా టాన్ అయి, ఈ కారణంగా మీరు పొట్టి బట్టలు ధరించలేకపోతే.. ఒక బకెట్ వేడి నీటిని తీసుకోండి. తర్వాత ఈ వేడి నీటిలో షాంపూ, బేకింగ్ సోడా , ఉప్పు వేసి బాగా కలపండి. ఈ లిక్విడ్‌లో మీ కాళ్లను అరగంట పాటు నానబెట్టండి. తరువాత మీ పాదాలను సాధారణ నీటితో కడిగి, టవల్ తో బాగా ఆరబెట్టండి. దీని తర్వాత పాదాలకు మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఈ రెమెడీని వారానికి రెండు రోజులు ప్రయత్నించండి. ఇలా చేయడం ద్వారా.. క్రమంగా మీ కాళ్ల నుండి వచ్చే నలుపు అంతా పోతుంది.
Also Read: సమ్మర్‌లో ఎండ వేడిని తట్టుకుని.. రిఫ్రెష్ అవ్వాలంటే ?
తేనె , బొప్పాయి:
మీ శరీరంలోని వివిధ భాగాలలో ట్యాన్ పేరుకుపోయి ఉంటే.. దానిని తగ్గించడానికి మీరు బొప్పాయి, తేనెను కూడా ఉపయోగించవచ్చు. బొప్పాయిని మెత్తగా చేసి అందులో కాస్త బియ్యం పిండి కలపాలి. ఇప్పుడు అందులో 1 చెంచా తేనె వేసి కలపండి. అన్ని పదార్థాలను బాగా కలిపిన తర్వాత, మీ టాన్ రిమూవల్ ప్యాక్ సిద్ధంగా ఉంటుంది. అనంతరం దీన్ని మీ చేతులు , కాళ్ళపై 30 అప్లై చేయండి. ఆరిన తర్వాత.. దానిని స్క్రబ్ చేసి నీటితో కడగాలి. దీనిని వారానికి 3 సార్లు ఉపయోగిస్తే మీరే తేడాను చూస్తారు.
హోం రెమెడీస్ వాడటం వల్ల ముఖం, కాళ్లు, చేతులపై ఉన్న నలుపును తొలగించుకోవచ్చు. అంతే కాకుండా ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే హోం రెమెడీస్ తయారు చేసుకుని వాడటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.