BigTV English

Telangana : కొత్త డీజీపీ.. రేసులో హేమాహేమీలు.. రేవంత్ మార్క్

Telangana : కొత్త డీజీపీ.. రేసులో హేమాహేమీలు.. రేవంత్ మార్క్

Telangana : ఇప్పటికే సీఎస్ శాంతికుమారి టర్న్ పూర్తి అయింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు ఎంపికయ్యారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో డీజీపీ జితేందర్ రిటైర్ కానున్నారు. ఆయన స్థానంలో కొత్త పోలీస్ బాస్ కోసం ప్రభుత్వం కసరత్తు కంప్లీట్ చేసింది.


డీజీపీ రేసులో ఎవరెవరంటే..

డీజీపీ రేసులో 8 మంది సీనియర్ ఐపీఎస్‌లు ఉన్నారు. ఎనిమిది మంది అధికారుల పేర్లతో కూడిన జాబితాను యూపీఎస్సీకి పంపించింది తెలంగాణ ప్రభుత్వం. రవి గుప్తా, సీవీ ఆనంద్, జితేందర్, సౌమ్య మిశ్రా, ఆప్టే వినాయక్ ప్రభాకర్, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, శివధర్ రెడ్డి, శిఖా గోయల్‌ పేర్లు జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. అర్హత ఆధారంగా వీరిలోంచి ముగ్గురి పేర్లను సూచిస్తూ యూపీఎస్సీ తిరిగి పంపనుంది. ఆ ముగ్గురిలో ఒకరిని కొత్త డీజీపీగా ఎంచుకుంటుంది సర్కార్.


రవి గుప్తాకు మరో ఛాన్స్?

ఎలక్షన్ టైమ్‌లో మోడల్ కోడ్ ఆఫ్ కండెక్ట్ ను అతిక్రమించారనే ఆరోపణలతో అప్పటి డీజీపీ అంజనీ కుమార్‌‌పై ఈసీ వేటు వేసింది. ఆయన స్థానంలో రవి గుప్తాను డీజీపీగా నియమించింది. ఆ తర్వాత డా. జితేందర్‌ను డీజీపీగా ఎంపిక చేసింది సర్కార్. ఆ రవి గుప్తా మళ్లీ ఇప్పుడు డీజీపీ రేసులో ఉన్నారు.

సీపీ టు డీజీపీ?

సీవీ ఆనంద్, కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి. వీరిలో శ్రీనివాస్‌రెడ్డి గతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పని చేశారు. పవర్‌ఫుల్ అధికారిగా గుర్తింపు ఉంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న సిబ్బంది అందరినీ.. మొత్తానికి మొత్తంగా ఒకేసారి బదిలీ చేసి సంచలనం సృష్టించారు. కొన్ని నెలలు మాత్రమే ఆయన సీపీ పదవిలో కొనసాగారు. అనంతరం విజిలెన్స్ హెడ్‌గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ నియమితులై.. ప్రస్తుతం కొనసాగుతున్నారు. వినాయక్ ప్రభాకర్ ఆప్టే, శివధర్ రెడ్డి, శిఖా గోయల్, సౌమ్య మిశ్రా ఇలా డీజీపీ రేసులో ఉన్న వారంతా హేమాహేమీలే. ఇందులో ఎవరు కొత్త డీజీపీగా ఎంపికైనా.. తెలంగాణకు సూపర్ పోలీస్ బాస్ వచ్చినట్టే. సీఎం రేవంత్ మార్క్ కనిపించినట్టే.

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×