BigTV English

Belly Fat: వీటితో.. బెల్లీ ఫ్యాట్‌కు చెక్

Belly Fat: వీటితో.. బెల్లీ ఫ్యాట్‌కు చెక్

Belly Fat: అధిక బరువు సమస్యతో ప్రస్తుతం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ సమస్య చలికాలంలో మరింత పెరుగుతుంది. శరీరంలో పెరిగిన కొవ్వును తగ్గించుకోవడానికి అనేక పద్ధతులను ప్రయత్నిస్తుంటారు. రక రకాల వ్యాయామాలు కూడా చేస్తుంటారు. మీరు కూడా బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతుంటే, సరైన జీవనశైలి, వ్యాయామంతో పాటు కొన్ని హోం రెమెడీస్ పాటించండి. వీటి సహాయంతో అధిక బురువు సమస్యను ఈజీగా తగ్గించుకోవచ్చు.


హోం రెమెడీస్ బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. అవి మరే విధంగానూ శరీరంపై ఎలాంటి దుష్ప్రభావాలను కలిగించవు. అధిక మొత్తంలో చక్కెర తీసుకోవడం కూడా బెల్లీ ఫ్యాట్‌కు కారణం అని రుజువైంది. ఆహారంలో కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ మొదలైన వాటిని ఎక్కువగా చేర్చుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు.

బరువు తగ్గడానికి హోం రెమెడీస్:


గ్రీన్ టీ: గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచుతాయి. అంతే కాకుండా బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడంలో ఉపయోగపడతాయి. రోజుకు 2-3 కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి.

అల్లం, తేనె: బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడంలో సహాయపడే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అల్లంలో ఉన్నాయి. తేనె దాని రుచిని మెరుగుపరచడానికి పనిచేస్తుంది. మీరు ఒక కప్పు వేడి నీటిలో అర టీస్పూన్ అల్లం రసం, ఒక టీస్పూన్ తేనె కలుపుకుని తాగడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చు.

నిమ్మకాయ నీరు: నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. అంతే కాకుండా శరీరం నుండి వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. తరుచుగా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకుని తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ ఈజీగా తగ్గుతుంది.

పెరుగు: పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి.ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. ప్రతిరోజు పెరుగు తినడం వల్ల అధిక బరువు తగ్గేందుకు అవకాశాలు కూడా ఉంటాయి.

తులసి నీరు: తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు , యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి బరువు తగ్గడంలో సహాయపడతాయి. తులసి ఆకులను మరిగించిన నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గుతారు.

ఇవే కాకుండా బెల్లీ ఫ్యాట్ తగ్గించే చిట్కాలు:

సమతుల్య ఆహారం: పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి.

ప్రోటీన్ తీసుకోవడం: ప్రోటీన్ మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. అంతే కాకుండా కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది.

Also Read: ఇవి తింటే.. జుట్టు రాలమన్నా రాలదు

శారీరక శ్రమ: నడక, పరుగు, యోగా వంటి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.

తగినంత నిద్ర: బరువు తగ్గడానికి తగినంత నిద్ర పొందడం చాలా ముఖ్యం.

ఒత్తిడిని తగ్గించండి: ఒత్తిడి బరువు పెరగడానికి కారణమయ్యే హార్మోన్లను పెంచుతుంది.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×