BigTV English

Jayam Ravi – Arthi : సింగర్ తో దొరికిన హీరో.. భార్య ఎమోషల్ పోస్ట్..

Jayam Ravi – Arthi : సింగర్ తో దొరికిన హీరో.. భార్య ఎమోషల్ పోస్ట్..

Jayam Ravi – Arthi : కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈమధ్య ఎక్కువగా విడాకుల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే కొందరు జంటలు మనస్పర్ధలు కారణంగా విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ హీరో జీవి ప్రకాష్ తన భార్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.. అరే దారిలో మరో హీరో నడిచారు. కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి తన భార్యతో విడిపోతున్నట్లు ఆ మధ్య సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టారు. అధి కాస్త నెట్టింట చర్చనీయాంశంగా మారింది. గత కొద్దినెలలుగా వ్యక్తిగత జీవితంలో జయం రవి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తన భార్య ఆర్తితో ఆయన విడాకులు తీసుకున్నారు.. అయితే ఇప్పుడు తన భార్య ఆర్తి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అందులో ఆమె ఏం రాసిందంటే..


భార్యతో హీరో విడాకులు..?

హీరో జయం రవి భార్య ఆర్తి పోస్ట్ ప్రస్తుతం కొలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయంటూ మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ కొద్ది రోజుల నుంచి సైలెంట్ గా ఉన్న ఈ జంట తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. సింగర్ కేనిషా – జయం రవిలు జంటగా ఓ కార్యక్రమంలో కనిపించారు. వేల్స్ యూనివర్సిటీ ఛైర్మన్ గణేష్ కుమార్ కుమార్తె పెళ్లి వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రవితో కలిసి కేనిషా ఫ్రాన్సిస్ హాజరై ఒకే సోఫాలో కనిపించడంతో కోలీవుడ్‌లో వీరి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది.. ఈ క్రమంలో ఆర్తి పోస్ట్ చెయ్యడం ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లు అయ్యింది..


కన్నీళ్లు పెట్టిస్తున్న పోస్ట్.. 

ఆర్తి తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ చేసింది. గత ఏడాదిగా నేను ఏం మాట్లాడడం లేదు. నా కంటే నా కుమారుల ప్రశాంతతే ముఖ్యం అనుకున్నా. ఆరోపణలు భరించా. అంతమాత్రాన నా వైపు నిజం లేదని కాదు. ఈ రోజు ప్రపంచమంతా ఫొటోలను చూసింది. మా విడాకుల ప్రాసెస్‌ ఇంకా కొనసాగుతోంది. కానీ, 18 ఏళ్లపాటు నాకు తోడుగా ఉన్న వ్యక్తి అలా చేశారు. కొన్ని నెలలుగా వారి బాధ్యత నాదే. ఆయన్నుంచి ఆర్థికంగానే కాదు నైతికంగానూ సపోర్ట్‌ లేదు. వాటికితోడు ఇప్పుడు ఇంటి విషయంలో బ్యాంకు నుంచి సమస్య ఎదురైంది. అప్పుడు నేను లెక్కల కంటే ప్రేమకే విలువిచ్చా.. ఇప్పుడు నా బాధంతా నా పిల్లల గురించే.. చట్టపరమైన అంశాలు వాళ్ళకి తెలియకపోయినా ఏం జరుగుతుందో అనే అవగాహన వాళ్లకైతే ఉంటుంది. నేను ఈరోజు ఓ భార్యగా, అన్యాయానికి గురైన మహిళగా కాదు పిల్లల శ్రేయస్సే లక్ష్యంగా ఉన్న తల్లిగా మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను మాట్లాడకపోతే.. వారికి భవిష్యత్తు లేనట్టే. మీరు నిజాన్ని మార్చలేరు. తండ్రి అంటే టైటిల్‌ మాత్రమే కాదు అదో బాధ్యత. విడాకుల విషయంలో తుది తీర్పు వెలువడే వరకూ నా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా పేరు ఆర్తి రవి అనే ఉంటుంది. నన్ను వదిలేసినందుకు నేను ఎప్పుడు ఏడవలేదు, అంతకన్నా బాధ కూడా పడడం లేదు. ఇంత జరుగుతున్నా కూడా నిన్ను నాన్న అని పిలుస్తున్న నా బిడ్డల కోసమే నేను నిలబడుతున్న అని ఆమె ఆ పోస్టులో పేర్కొన్నారు.. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై ఆయన ఎలా రియాక్ట్ అవుతారు అన్నది ఆసక్తిగా మారింది.

Also Read :

ఇక జయం రవి విషయానికొస్తే.. కొలీవుడ్ నిర్మాత, దర్శకుడు ఎడిటర్ మోహన్ కుమారుడే జయం రవి. తండ్రి నిర్మాత కావడంతో చిన్న వయసులోనే బాలనటుడిగా బావబావమరిది, పల్నాటి పౌరుషం వంటి చిత్రాల్లో నటించారు.. ఆ తర్వాత హీరోగా వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయ్యాడు. సినిమాల పరంగా సక్సెస్ అయిన ఈ హీరో పర్సనల్ లైఫ్ విషయంలో అంత బాగోలేదని చెప్పాలి. భార్యతో సడన్గా విడాకులు అనౌన్స్ కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.. హీరోగా సక్సెస్ అయిన ఈయన పర్సనల్ లైఫ్ లో ఎందుకు రాంగ్ స్టెప్ తీసుకున్నారనే వార్తలు ఆయన అభిమానుల్లో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం భార్య పెట్టిన పోస్ట్ పై హీరో ఎలా రియాక్ట్ అవుతారని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఇక సినిమాలను చూస్తే..బ్రదర్ సినిమాతో పలకరించిన జయం రవి.. ప్రస్తుతం కరాటే బాబు, పరాశక్తి, జినీ, తనీఓరువన్ 2 చిత్రాలలో నటిస్తున్నారు…

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×