Pro Kabaddi Final: ప్రో కబడ్డీ లీగ్ ( పీకేఎల్) 11వ సీజన్ చివరి అంకానికి చేరుకుంది. హర్యానా స్టీలర్స్ వరుసగా రెండవసారి ఫైనల్ కి దూసుకెళ్ళింది. శుక్రవారం రోజు జరిగిన తొలి సెమీ ఫైనల్ లో హర్యానా స్టీలర్స్ 28 – 25 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్ ని ఓడించింది. మొదటి నుంచి చివరి వరకు ఆసక్తికరంగా జరిగిన ఈ మ్యాచ్ లో రెండు జట్లు పాయింట్ల కోసం పోటీపడ్డాయి. అయితే హర్యానా జట్టు స్వల్ప ఆదిక్యాన్ని కాపాడుకుంటూ వస్తూ ప్రత్యర్థిని కట్టడి చేయడంలో సఫలమైంది.
Also Read: IND vs AUS: మైదానంలో కండోమ్ బెలూన్ కలకలం.. వీడియో వైరల్
ఈ సీజన్ లో తిరుగులేని ఆదిపత్యంతో గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచింది హర్యానా స్టీలర్స్. ఇక సెమిస్ లోను అదే జోరు కొనసాగించి 12-11 తో ముందంజలో నిలిచింది. సెమీస్ లో ప్రత్యర్థిని ఆల్ అవుట్ చేసి ఒత్తిడిలోకి నెట్టి చివరి వరకు దాన్ని కొనసాగించి హర్యానా ఫైనల్స్ కి చేరింది. హర్యానా జట్టులో శివమ్ పతారే ఏడు పాయింట్లతో రాణించగా.. వినయ్ ఆరు, డిఫండర్ రాహుల్ 5 పాయింట్లతో రాణించారు. ఇక యూపీ రైడర్ గగన్ గౌడ పది పాయింట్లతో ఆకట్టుకున్నా ఫలితం దక్కలేదు.
అనంతరం జరిగిన మరో సెమి ఫైనల్ లో పాట్నా జట్టు 32-28 తేడాతో దబాంగ్ ఢిల్లీ పై గెలుపొందింది. ఆదిత్యం చేతులు మారుతూ సాగిన పోరులో ఆఖరిలో ఒత్తిడిని అధిగమించిన పాట్నా పైరేట్స్ విజయ తీరానికి చేరుకుంది. పాట్నా జట్టులో రైడర్ దేవాంక్, అయాన్ చెరో ఎనిమిది పాయింట్లతో సత్తా చాటారు. అలాగే శుభమ్ షిండే 5, అంకిత్ నాలుగు పాయింట్లతో రాణించారు. ఇక ఢిల్లీ జట్టు తరపున అశు మాలిక్ 9 పాయింట్లు, మోహిత్ దేశ్వాల్ ఏడు పాయింట్లతో రాణించినప్పటికీ ఫలితం దక్కలేదు.
దీంతో ఆదివారం టైటిల్ కోసం హర్యానా స్టీలర్స్ తో పాట్నా పైరేట్స్ పోటీ పడనుంది. అయితే పాట్నా జట్టు టైటిల్ పోరుకు అర్హత సాధించడం ఇది ఐదోసారి. హర్యానా తొలి టైటిల్ నిరీక్షణకు ఈసారైనా తెర దించుతుందో..? లేదో..? వేచి చూడాలి. ఇప్పటికే మూడుసార్లు విజేతగా నిలిచిన పాట్నా జట్టు మరోసారి ఛాంపియన్ గా గెలిచేందుకు ఉవ్విళ్ళూరుతుంది.
ఇక ఈ పీకేఎల్ సీజన్ 11 ప్లే ఆఫ్స్ రేసు నుంచి తెలుగు టైటాన్స్ ఇప్పటికే తప్పుకున్న విషయం తెలిసిందే. ప్లే ఆఫ్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో బెంగాల్ వారియర్స్ పై యూముంబా అద్భుత విజయాన్ని సాధించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్ లో యూముంబా 36 – 27 తేడాతో బెంగాల్ వారియర్స్ ని చిత్తు చేసింది. ఈ గెలుపుతో యూ ముంబా 22 మ్యాచుల్లో 12 విజయాలు రెండు టైలతో ఆరవ స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ చేరింది.
Also Read: Kohli – Rohit: విరాట్ కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్..ముహుర్తం ఫిక్స్ ?
మరోవైపు తెలుగు టైటాన్స్ కూడా 22 మ్యాచుల్లో 12 విజయాలు సాధించింది. కానీ తెలుగు టైటాన్స్ కి ఒక్క టై కూడా లేకపోవడంతో.. పాయింట్స్ కూడా తక్కువగా ఉండడంతో ప్లే ఆఫ్స్ చేయలేకపోయింది. ఒకవేళ బెంగాల్ వారియర్స్ చేతిలో ఏడు పాయింట్స్ తేడాతో ఓడిపోయి ఉంటే తెలుగు టైటాన్స్ కి అవకాశం ఉండేది. ఇక పాట్నా – హర్యానా మధ్య జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ ని అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ తో పాటు డిజిటల్ స్ట్రీమింగ్ యాప్ కం వెబ్ సైట్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రాత్రి 8 గంటల నుండి ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.
Our Finalists are Set!🔥
Haryana Steelers and Patna Pirates to clash in the Pro Kabaddi Final on 29th December.💙💚#ProKabaddi #SKIndianSports pic.twitter.com/y1WI1GzHiH
— Sportskeeda (@Sportskeeda) December 27, 2024