Best Tips White Hair: ప్రస్తుత రోజుల్లో చాలా మంది తెల్లజుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. చిన్న వయసులోనే కొంత మందికి జుట్టు నెరిసిపోతుంటే.. ఏం చేయాలో అర్ధంకాక సతమతమవుతున్నారు. హెయిర్ డై ఆప్షన్ ఉంది కానీ.. వాటిలో ఉండే కెమికల్స్ వల్ల జుట్టు పాడైపోయో ప్రమాదం ఉంది. ఇంకా వీటివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అసలు తెల్ల జుట్టు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొంతమందికి జన్యు పరంగా వస్తే.. మరి కొంతమందికి బయట కాలుష్యం, స్ట్రెస్, పొగ, దుమ్మూ, సరైన పోషకాహారం తినకపోవడం వల్ల తెల్లజుట్టు వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి రిస్క్ లేకుండా తెల్లజుట్టును నివారించేందుకు ఈ నాచురల్ చిట్కా ఉంది. ఇవి ఫాలో అయ్యారంటే.. జీవితంలో వైట్ హెయిర్ సమస్యలు ఉండవు. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
☀ హెయిర్ మాస్క్ కావాల్సిన పదార్ధాలు
⦿ కరివేపాకు
⦿ టీ పొడి
⦿ వాటర్
⦿ మెంతులు
☀ తయారు చేసుకునే విధానం
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని.. అందులో గ్లాసు వాటర్ రెండు టేబుల్ స్పూన్ టీ పొడి, మెంతులు, కరివేపాకు వేసి 10 నిమిషాల పాటు మరిగించాలి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి వడకట్టుకుని.. అందులో గోరింటాకు పొడి వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పెట్టుకుని.. సుమారు గంటపాటు ఉంచి సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి. ఇలా నెలకు రెండు సార్లు చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది. క్రమంగా తెల్లజుట్టును నివారించవచ్చు. పైగా వీటివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రావు.
తెల్లజుట్టు నివారించేందుకు ఈ హెయిర్ మాస్క్ కూడా ట్రై చేయండి. నెలలోపే అద్భుతమైన రిజల్ట్ మీకు కనిపిస్తాయి. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
☀ కావాల్సిన పదార్ధాలు
⦿ గోరింటాకు పొడి
⦿ కాఫీ పొడి
⦿ షీకాకాయ పొడి
⦿ ఉసిరి పొడి
⦿ నిమ్మకాయ
⦿ బ్లాక్ టీ వాటర్
☀ తయారు చేసుకునే విధానం
ముందుగా పెద్ద బౌల్ తీసుకుని అందులో సమపరిమాణంలో గోరింటాకు పొడి, కాఫీ పొడి, షీకాకాయ పొడి, ఉసిరి పొడి, నిమ్మకాయ, బ్లాక్ టీ వాటర్ కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు అప్లై చేసి.. గంట తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా నెలకు రెండు సార్లు పెట్టుకుంటే సరిపోతుంది. క్రమంగా తెల్లజుట్టును నివారిస్తుంది. అంతే కాదు ఈ హెయిర్ మాస్క్ వల్ల జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది కూడా. ఇందులో ఉపయోగించే పదార్దాలలో ఉండే పోషకాలు జుట్టు సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తాయి. పైగా వీటివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రావు. మీ జుట్టు చాలా నల్లగా, సిల్కీగా ఉంటుంది. చుండ్రు సమస్యలను దరిచేరనివ్వవు.
Also Read: ఈ హెయిర్ సీరం వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.