Homemade Sunscreen: సమ్మర్‌లో వేడి కారణంగా చర్మంపై సన్‌టాన్, స్కిన్ పొడిబారడం వంటి సమస్యలు పెరుగుతాయి. కాబట్టి ఈ సమయంలో ముఖాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. అంతే కాకుండా ఈ సీజన్‌లో.. చర్మంపై జిగటగా ఉండే క్రీమ్‌లను అప్లై చేయడం వల్ల ముఖం కూడా జిడ్డుగా కనిపిస్తుంది. అందుకే సమ్మర్‌లో సన్‌స్క్రీన్ వాడటం మంచిది.
ప్రస్తుతం చర్మ రకాన్ని బట్టి సన్‌స్క్రీన్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ.. కొన్నిసార్లు అవి చర్మంపై దుష్ప్రభావాలను కూడా కలిగిస్తాయి. ఈ సీజన్‌లో ఇంట్లో తయారుచేసిన సన్‌స్క్రీన్‌లు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. అంతే కాకుండా మీ ముఖంపై ముడతలు, నల్లటి మచ్చలు, నల్లటి వలయాలు తగ్గిస్తాయి. మరి ఇంట్లోనే కలబంద జెల్, కొబ్బరి నూనె , పిప్పరమింట్ ఎసెన్షియల్ ఆయిల్‌తో సన్‌స్క్రీన్ తయారు చేసుకోవచ్చు.
వేసవిలో సన్‌స్క్రీన్ అప్లై చేయడం చాలా ముఖ్యం. ఈ సీజన్‌లో ఎక్కువసేపు ఎండలో ఉండటం వల్ల వడదెబ్బ తగిలే అవకాశం కూడా ఉంటుంది. సహజ సన్‌స్క్రీన్ ముఖంపై మొటిమలు, మచ్చలు, టానింగ్, ముడతల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.
కలబంద జెల్‌తో తయారుచేసిన సన్‌స్క్రీన్ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. అంతే కాకుండా ముఖాన్ని బిగుతుగా చేస్తుంది. పిప్పరమింట్ ఎసెన్షియల్ ఆయిల్‌లో ఉండే విటమిన్ ఇ, బీటా కెరోటిన్ , యాంటీ-ఆక్సిడెంట్లు హానికరమైన సూర్య కిరణాల నుండి రక్షించడంలో సహాయపడతాయి. మరి వీటితో సన్‌స్క్రీన్‌ను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
కావాల్సినవి:
కొబ్బరి నూనె- ఒక టీస్పూన్
పిప్పరమింట్ ఎసెన్షియల్ ఆయిల్- 3 టేబుల్ స్పూన్
అలోవెరా జెల్-2 టీస్పూన్లు
సన్‌స్క్రీన్ ఎలా తయారు చేసుకోవాలి ?
ఒక గిన్నెలో కలబంద జెల్ తీసుకొని దానికి పైన తెలిపిన మోతాదులో కొబ్బరి నూనె కలపండి. ఈ మిశ్రమానికి పిప్పరమింట్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి మందపాటి పేస్ట్ సిద్ధం చేయండి. పేస్ట్ క్రీమీగా మారినప్పుడు.. దానిని ఒక కంటైనర్‌లో నిల్వ చేయండి. ఎండలో బయటకు వెళ్ళే ముందు ఈ పేస్ట్ ని ముఖానికి అప్లై చేయండి. మీరు ఈ సన్‌స్క్రీన్‌ను ఒక నెల వరకు నిల్వ చేయవచ్చు.
నారింజ రసం, రోజ్ వాటర్ :
విటమిన్ సి సమృద్ధిగా ఉండే నారింజ, మీకు సన్‌స్క్రీన్ లోషన్‌గా కూడా పని చేస్తుంది. దీని కోసం.. నారింజ రసంలో 10 చుక్కల రోజ్ వాటర్ కలిపి మిశ్రమాన్ని సిద్ధం చేయండి. ఇప్పుడు మీరు ఈ ద్రావణాన్ని చర్మంపై అప్లై చేయండి. ఇది మీ చర్మాన్ని ఎండ నుండి రక్షించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ ను అందిస్తుంది.
Also Read: మోకాళ్ల నొప్పులా ? ఇలా చేస్తే.. అంతా సెట్ !
అలోవెరా సన్‌స్క్రీన్ లోషన్:
కలబంద మన చర్మానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. సూర్యరశ్మిని నివారించడానికి మీరు దీనిని ఉపయోగించవచ్చు. దీని కోసం.. ఒక గిన్నెలో కలబంద జెల్ తీసుకొని.. అందులో ఒక చెంచా కొబ్బరి నూనె, రోజ్ వాటర్ వేసి బాగా కలపండి. మూడు పదార్థాలు బాగా కలిపిన తర్వాత.. దానిని ఒక సీసాలో నిల్వ చేసి.. ఆపై సన్‌స్క్రీన్‌గా ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.