Bangladesh Attack India| ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్ని వేళ పొరుగు దేశం బంగ్లాదేశ్.. పాకిస్తాన్ వైపు మొగ్గు చూపుతోంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ మాజీ సైనిక మేజర్ జెనెరల్ ఎఎల్ఎం ఫజ లుర్ రెహ్మాన్ భారత దేశాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత దేశం ఒక వేళ పాకిస్తాన్ పై దాడి చేస్తే బంగ్లాదేశ్ వెంటనే భారత దేశంపై దాడి చేయాలని సూచించారు.
భారత దేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాలపై దండయాత్రి చేయాలని వాటిని బంగ్లాదేశ్ స్వాధీనం చేసుకోవాలని అన్నారు. ప్రస్తుతం భారత వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బంగ్లాదేశ్.. గత కొంత కాలంగా భారత శత్రవు పాకిస్తాన్, చైనా దేశాలకు అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మొహమ్మద్ యూనుస్ కు సన్నిహితుడైన బంగ్లాదేశ్ రైఫిల్స్ మాజీ చీఫ్ ఫజలుర్ రెహ్మాన్ భారత దేశంపై విషం చిమ్ముతూ వ్యాఖ్యలు చేశారు.
“ఒకవేళ ఇండియా.. పాకిస్తాన్ పై దాడి చేస్తే.. బంగ్లాదేశ్ వెంటనే భారత ఈశాన్య భూభాగంలోని ఏడు రాష్ట్రాలను స్వాధీనం చేసుకోవాలి. ఇందుకోసం చైనాలో మిలిటరీ ఒప్పందం చేసుకోవడం అవసరం. చైనాతో జాయింట్ మిలిటరీ డీల్ కోసం వెంటనే చర్చలు ప్రారంభించాలి.” అని రహ్మాన్ అన్నారు. ప్రస్తతం బంగ్లా నేషనల్ కమిషన్ చైర్ పర్సన్ గా రహ్మాన్ వ్యవహరిస్తున్నారు. ఆ కమిషన్ తరపున అధికారికంగా రహ్మాన్ ఈ విధంగా బంగ్లాలో ప్రకటన చేశారు.
Also Read: పాక్ గూఢచారి అరెస్ట్.. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక ఉన్నది వారే
గత సంవత్సరం బంగ్లాదేశ్ లో మిలిటరీ సాయంతో అక్కడి ప్రతిపక్ష పార్టీ, ఇస్లామిస్ట్ పార్టీలు స్థిరంగా ఉన్న షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చేశాయి. అక్కడ హిందూ, ఇతర మైనారిటీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీంతో భారత్ కు అనుకూలంగా వ్యవహరించే షేక్ హసీనా భారత దేశంలో ప్రస్తుతం తలదాచుకుంటున్నారు. ఆ తరువాత మిలిటరీ తాత్కాలికంగా నియమించిన మహమ్మద్ యూనుస్ ప్రభుత్వం ఇండియా వ్యతిరేక విధానాలతో ముందుకెళుతోంది. కొన్ని నెలల క్రితమే యూనుస్ చైనా వెళ్లి అక్కడ భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లేందుకు చైనాకు బంగ్లాదేశ్ మార్గం కల్పిస్తుందని వివాాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అయితే ఆ తరువాత థాయ్ ల్యాండ్ సదస్సులో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆయనకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. బంగ్లాదేశ్ ను కట్టడి చేసేందుకు భారత భూభాగం ద్వారా ఉచితంగా ఇతర దేశాలకు బంగ్లాదేశ్ చేసే ఎగుమతులపై నిషేధం విధించారు. ఆ దెబ్బతో బంగ్లాదేశ్ ప్రస్తుతం కాస్త వెనుకడుగు వేసింది.
బంగ్లాదేశ్ మాజీ జెనెరల్ ఫజలుర్ రెహ్మాన్ చేసిన వ్యాఖ్యలను భారతదేశంలో అధికార పార్టీ అయిన బిజేపీ నాయకులు మండిపడ్డారు.