Janu Lyri Missing :ప్రముఖ ఫోక్ డాన్సర్ జాను (Janu) కనిపించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం రోజు ఇన్స్టా లో ఏడుస్తూ వీడియో పెట్టిన ఈమె.. ఈ వీడియో తర్వాత ఎవరికీ అందుబాటులోకి కూడా రావట్లేదు. నిన్న ఏడుస్తూ పెట్టిన వీడియోలను కూడా ఆమె ఇన్ స్టా నుంచి డిలీట్ చేసింది. తనపై విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారని, ఇలా అయితే తాను ఆత్మహత్య చేసుకుంటాను అంటూ వీడియోలు పోస్ట్ పెట్టింది. ఇక అప్పటినుంచి ఆమెను సంప్రదించేందుకు అనేకమంది ప్రయత్నం చేస్తుండగా.. ఇప్పటివరకు జాను ఎవరికీ అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. ఇకపోతే ఫోక్ డాన్సర్ గా భారీ పాపులారిటీ సంపాదించుకున్న జానూ అనూహ్యంగా ట్రోలర్స్ బారిన పడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందేమో అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం జాను ఎక్కడుంది? ఏం చేస్తోంది? ఇలా ఆమె వివరాలు తెలియక అభిమానులు సైతం కలవరపాటుకు గురి అవుతున్నారు.
ఫోక్ డాన్సర్ జానూ పై విపరీతమైన ట్రోల్స్..
జాను గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ క్రేజీ డాన్సర్ సోషల్ మీడియాలో కూడా ఒక సెన్సేషన్ అని చెప్పాలి. తన డాన్స్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఈ క్రేజీ డాన్సర్ చేసిన సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేశాయి. పాన్ ఇండియా రేంజ్ లో ఈమె పాటలకు పాపులారిటీ కూడా లభించింది. ఇకపోతే ఈమె వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. చిన్న వయసులోనే పెళ్లయింది.ఒక కుమారుడు కూడా ఉన్నాడు. మనస్పర్ధలు రావడంతో భర్త నుంచి విడిపోయిన ఈమె.. అప్పటినుంచి కొడుకు బాగోగులు చూసుకుంటూ జీవిస్తోంది. ఇక రోజు రోజుకి ఎంతో పాపులర్ అవుతూ వచ్చిన ఈమె.. మంచి పొజిషన్ కి వెళ్తుందని అందరూ అనుకున్నారు. అయితే ఈమెను ఈ మధ్య కొంతమంది బాగా ట్రోల్స్ చేస్తున్నారు. కారణం మంచి వ్యక్తి దొరికితే రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమని చెప్పడమే.. దీంతో కొంతమంది దానిని ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ట్రోల్స్ ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఓపిక నశించింది అని, అటు భరించలేక చచ్చిపోవాలని ఉంది అంటూ బోరున ఏడ్చేసింది జాను లిరి.
ALSO READ:Janu Lyri: మళ్లీ పెళ్లి.. మరో వీడియో వదిలిన జాను లిరీ, ఈ సారి..!
చనిపోవాలని ఉంది.. వెక్కివెక్కి ఏడ్చిన జాను..
ఈ ట్రోల్స్ పై ఒక వీడియో రిలీజ్ చేస్తూ.. ఆ వీడియోలో..” నాపై సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తున్నాయి. నా మాటలను ఎడిట్ చేసి చాలా గలీజ్ గా ట్రోల్స్ చేస్తున్నారు. ఆ వీడియోలు నా కొడుకు చూడడా ..? మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డున పడేస్తున్నారు.. నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నన్ను ఒక్క మాట కూడా అనలేదు. కానీ ఇప్పుడు ప్రతి అడ్డమైన వెధవ మాటలు పడాల్సి వస్తోంది. ఎక్కడికైనా వెళ్లి చనిపోవాలనిపిస్తోంది. ఒకవేళ నేను చచ్చిపోతే నిజంగా దానికి మాత్రం బాధ్యులు మీరే అంటూ బోరున ఏడ్చింది. నా కొడుకు మంచిగా ఎదగాలని, మంచి స్థాయిలో ఉంటే చూడాలని అనుకున్నాను. అయితే మీ మాటల వల్ల అప్పటివరకు బ్రతికి ఉంటానో లేదో అనిపిస్తుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ఆ వీడియో వదిలిన మరుసటి క్షణం నుంచి ఆమె కనిపించడం లేదు. పైగా ఆ వీడియోని కూడా డిలీట్ చేయడం గమనార్హం. మరి ఇప్పుడు జాను ఎక్కడ ఉందో ఏం చేస్తుందో తెలియాల్సి ఉంది.