Turmeric Curd Face Pack: వంటగదిలో ఉండే కొన్ని రకాల పదార్థాలు చర్మ సౌందర్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అంతే కాకుండా ఇవి గ్లోయింగ్ స్కిన్ కోసం సహాయపడతాయి. ముఖ్యంగా కిచెన్‌లో ఉండే పెరుగు, పసుపు ముఖానికి కొత్త మెరుపును అందిస్తాయి. ఈ రెండు పదార్థాలను కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవచ్చు. పెరుగులో లాక్టిక్ ఆమ్లం, ప్రోటీన్లు ఉండగా పసుపులో యాంటీ బాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి ముఖాన్ని తెల్లగా మార్చడంలో కూడా ఉపయోగపడతాయి.
ఈ ఫేస్ ప్యాక్ వల్ల కలిగే ప్రయోజనాలు:
కాంతివంతమైన ముఖం:
పెరుగు, పసుపు మిశ్రమం మృత చర్మ కణాలను తొలగించి కొత్త కణాల పెరుగుదలకు ఉపయోగపడతాయి. ఇది ముఖం యొక్క రంగును మెరుగుపరుస్తుంది. దీనిని వాడటం వల్ల చర్మం మెరుస్తూ ఉంటుంది. పసుపులో కర్కుమిన్ అనే మూలకం ఉంటుంది. ఇది పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా పెరుగు లాక్టిక్ ఆమ్లం ద్వారా చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది.
మొటిమలు, మచ్చల నుండి ఉపశమనం:
పసుపులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చర్మంపై ఉన్న క్రిములను చంపి మొటిమలను నివారిస్తాయి. పెరుగులో ఉండే జింక్ ,లాక్టిక్ ఆమ్లం చర్మాన్ని చల్లబరుస్తాయి. అంతే కాకుండా ఇవి ముఖంపై ఎరుపు, మంటను తగ్గిస్తాయి. ఈ మాస్క్‌ను క్రమం తప్పకుండా అప్లై చేయడం వల్ల మచ్చలు కూడా తొలగిపోతాయి.
చర్మంలో తేమను నిలుపుకుంటుంది:
మీ చర్మం పొడిబారి, నిర్జీవంగా మారితే.. పెరుగు-పసుపు మాస్క్ దానికి అవసరమైన తేమను అందిస్తుంది. పెరుగు సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. అంతే కాకుండా చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోయి హైడ్రేట్ చేస్తుంది. ఇది చర్మంపై పగుళ్లు రాకుండా నిరోధిస్తుంది. ముఖ్యంగా శీతా కాలంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.
ముడతలు, వృద్ధాప్య సంకేతాలు తగ్గిస్తుంది:
ఈ ఫేస్ మాస్క్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. తద్వారా ముడతలు , ఫైన్ లైన్లను తగ్గిస్తాయి. పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణం చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయ పడుతుంది. తరచుగా ఈ ఫేస్ ప్యాక్ వాడటం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ముడతల సమస్య తొలగిపోవాలంటే పెరుగు, పసుపు తో తయారు చేసిన ఫేస్ ప్యాక్ వాడటం అలవాటు చేసుకోవాలి. ఇది చర్మానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది.
Also Read: ఇలా చేస్తే.. క్షణాల్లోనే తెల్లజుట్టు నల్లగా మారుతుంది తెలుసా ?
సన్ ట్యాన్ తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది:
ఎండలో రంగు మారిన చర్మానికి పెరుగు-పసుపు ఫేస్ మాస్క్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. పెరుగు చర్మాన్ని చల్లబరుస్తుంది. అంతే కాకుండా పసుపు మెలనిన్‌ను నియంత్రిస్తుంది. ఇది క్రమంగా చర్మం యొక్క టాన్‌ను తగ్గిస్తుంది. అంతే కాకుండా చర్మం యొక్క సహజ రంగును తిరిగి తెస్తుంది. ముఖం తెల్లగా మెరిసి పోవాలంటే కొన్ని రకాల టిప్స్ పాటించడం చాలా ముఖ్యం. హోం రెమెడీస్ వాడటం వల్ల కూడా గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.