Hair Colour 1: ప్రస్తుతం చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. జుట్టును నల్లగా మార్చుకోవడానికి రకరకాల హెయిర్ కలర్స్ వాడుతుంటారు. కానీ రసాయనాలతో తయారు చేసిన హెయిర్ కలర్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇలాంటి సమయంలో ఇంట్లోనే హెయిర్ కలర్ తయారు చేసుకుని వాడటం మంచిది. ఇవి జుట్టును తక్కువ సమయంలోనే నల్లగా మారుస్తాయి. అంతే కాకుండా మనం వీటికి డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంతకీ ఇంట్లోనే హెయిర్ కలర్ ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నేచురల్ హెయిర్ కలర్:
కావాల్సిన పదార్థాలు:
ఇండిగో పౌడర్- ½ కప్పు
ఉల్లిపాయ రసం- 3 టేబుల్ స్పూన్లు
నల్ల నువ్వుల పేస్ట్- 2 టేబుల్ స్పూన్లు
విటమిన్ ఇ క్యాప్యూల్స్- 2
నీరు- తగినంత
టేబుల్ స్పూన్ కొబ్బరి లేదా బాదం నూనె- 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం:
నల్ల నువ్వులను రాత్రంతా నానబెట్టి.. ఉదయం వాటిని రుబ్బుకుని పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయను తురుము నుండి దాని జ్యూస్ తీయండి. ఒక గిన్నెలో ఇండిగో పౌడర్, నువ్వుల పేస్ట్ వేసి.. దానికి కొద్దిగా నీరు కలిపి పేస్ట్ లా చేయండి. ఇప్పుడు దానికి ఉల్లిపాయ రసం కలపండి. తర్వాత ఒక చెంచా కొబ్బరి లేదా బాదం నూనెను కలపండి.
ఈ పేస్ట్ ని 10-15 నిమిషాలు అలాగే ఉంచండి.
జుట్టుకు ఎలా అప్లై చేయాలి:
ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసే ముందు.. మీ జుట్టు శుభ్రంగా ఉండాలని గుర్తుంచుకోండి. తర్వాత మీరు తయారు చేసుకున్నమిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు హెయిర్ బ్రష్ లేదా చేతులతో బాగా అప్లై చేయండి. తర్వాత జుట్టును షవర్ క్యాప్ లేదా క్లిప్ తో కప్పి ఉంచండి. ఈ హెయిర్ కలర్‌ను కనీసం 2-3 గంటలు అలాగే వదిలేయండి. తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును వాష్ చేయండి. తలస్నానం చేయడానికి ఎలాంటి రసాయన షాంపూలను ఉపయోగించకూడదు. హెర్బల్ షాంపూ లేదా సాధారణ నీటిని మాత్రమే ఉపయోగించడం మంచిది.
Also Read: ఈ హెయిర్ మాస్క్ వాడితే.. సిల్కీ హెయిర్ మీ సొంతం
ఈ నేచురల్ హెయిర్ కలర్ ఎంతకాలం ఉంటుంది ?
ఈ సహజ జుట్టు రంగు ప్రభావం 3 వారాల పాటు ఉంటుంది.
మీ జుట్టు చాలా త్వరగా నెరిసిపోతే.. మీరు ప్రతి 15-20 రోజులకు ఒకసారి దీనిని అప్లై చేయవచ్చు. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి..నల్ల నువ్వులు, ఉల్లిపాయ రసాన్ని వారానికి 2-3 సార్లు వాడటం ప్రయోజనకరంగా ఉంటుంది.
Also Read: మందార పూలను ఇలా వాడితే.. జుట్టు జెట్ స్పీడ్‌లో పెరుగుతుంది
రసాయనాలతో తయారు చేసిన హెయిర్ కలర్ వాడటానికి బదులుగా నేచురల్ హెయిర్ కలర్స్ వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఇది జుట్టుకు మేలు చేస్తుంది. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది. తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడే వారు ఇంట్లోనే ఈ హెయిర్ కలర్ తయారు చేసుకుని వాడటం చాలా మంచిది.