BigTV English

Earthen Pots : మట్టిపాత్రల్లో వంట ఎంత మేలు?

Earthen Pots : మట్టిపాత్రల్లో వంట ఎంత మేలు?
Earthen Pots

Earthen Pots : ఎప్పుడో అమ్మమ్మల కాలంలో చూశాం. మళ్లీ ఇప్పుడు కనిపిస్తున్నాయి మట్టి పాత్రలు. కట్టెల పొయ్యి మీద సన్నటి మంటతో నిదానంగా వంట చేసేవాళ్లు పూర్వీకులు. ఆధునికతో, విధ్వంసమో తెలియదు కానీ.. మట్టి కుండలు/పాత్రల స్థానాన్ని అల్యూమినియం, స్టీల్ గిన్నెలు ఆక్రమించేశాయి. ఇన్నేళ్ల తర్వాత మట్టిపాత్రలకు మళ్లీ ఆదరణ పెరుగుతోంది.


మట్టి గిన్నెల్లో వంట రుచిగా ఉండటమే కాదు.. మరెన్నో లాభాలున్నాయి. ఆరోగ్యపరంగా, పర్యావరణపరంగా మంచిది కూడా. నేచురల్ కూలింగ్ అనేది మట్టి పాత్రల్లోనే లభిస్తుంది. ఉపరితలం నీరు ఆవిరయ్యే క్రమంలో వేడిని కూడా తీసేస్తుంది. వేడి వాతావరణంలో నీళ్లు, ఇతర ద్రవపదార్థాలను నిల్వ చేసేందుకు ఇదే అత్యుత్తమ మార్గం.

మట్టి పాత్రల్లో వంట చేయడం వల్ల ఆహారంలోని పోషకాలను కోల్పోయేది లేదు. సన్నటి సెగపై నిదానంగా ఉడికిస్తే అవి ఆవిరి రూపంలో బయటకు వెళ్లే అవకాశం ఉండదు. పైగా ఆహారపదార్థాలు చెడిపోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంచొచ్చు.


మట్టిపాత్రలు క్షారగుణాన్ని కలిగి ఉంటాయి. అల్కలీన్ ఉన్న ఈ పాత్రల్లో వండితే ఆహారం pH (potential of hydrogen) విలువ పెరుగుతుంది. దీని వల్ల ఆరోగ్యానికి మేలు. ఆల్కలీన్ ఫుడ్ వల్ల శరీరంలో పీహెచ్ స్థాయులు సమతుల్యంగా ఉంటాయి.

మట్టికుండలో ఎక్కువ నూనెతో వండాల్సిన అవసరం ఉండదు. పోరస్‌(సూక్ష్మరంధ్రాలు)గా ఉండే మట్టిపాత్రల్లో వండే ఆహారానికి మరింత రుచి చేరుతుంది. మట్టిపాత్రల్లో మెగ్నీషియం, కాల్షియం, పాస్పరస్ లాంటి ఖనిజాలు ఉంటాయి. అవి మనకు అవసరం. ఆ పాత్రల్లో వండటం ద్వారా అవి ఎక్కువగా లభిస్తాయి.

మట్టి పాత్రలను సహజంగా లభ్యమయ్యే మట్టితో చేస్తారు. అంటే ఇవి ఎకో-ఫ్రెండ్లీ అన్నమాట. బయోడీగ్రేడబుల్ కూడా. హానికారక రసాయనాలేవీ వీటి నుంచి వెలువడవు. నాన్ స్టిక్, స్టీల్ పాత్రల కంటే మట్టిపాత్రలు చౌక కూడా.

Related News

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Fenugreek Seeds Sprouts: మొలకెత్తిన మెంతులు తింటే.. ఈ సమస్యలు దూరం !

Avocado For Hair: అవకాడోతో మ్యాజిక్.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×