BigTV English

Rishabh Pant: ఐపీఎల్ లో ఆడలేదు..కానీ ఇప్పుడు స్టేడియం పైకప్పులే పగులగొడుతున్నాడు

Rishabh Pant: ఐపీఎల్ లో ఆడలేదు..కానీ ఇప్పుడు స్టేడియం పైకప్పులే పగులగొడుతున్నాడు

Rishabh Pant:     టీమిండియా స్టార్ ఆటగాడు, లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్… ఇంగ్లాండ్ గడ్డపై దుమ్ము లేపుతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో పెద్దగా రాణించని టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్… ఇప్పుడు మాత్రం చుక్కలు చూపిస్తున్నాడు. తాజాగా రిషబ్ పంత్ కొట్టిన భారీ షాట్ దెబ్బకు… స్టేడియంలోని రూఫ్ కూడా… బ్రేక్ అయిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు… షాక్ అవుతున్నారు. ఐపీఎల్ 2025 టోర్నమెంట్లు ఆడలేదు కానీ ప్రాక్టీస్ మ్యాచ్ లో… మనోడు అదరగొడుతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.


Also Read: Luckiest Batter: అదృష్టమంటే ఇదే…వికెట్లను తాకినా నాటౌటే.. అది కూడా 98 పరుగుల వద్ద

ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా కసరత్తులు


టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య అతి త్వరలోనే ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. మొన్నటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో అన్ని దేశాల క్రికెట్ సభ్యులు మెలిసి ఆడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు… ఏ దేశం తరఫున ఆ దేశ క్రికెటర్ మాత్రమే ఆడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గిల్ నాయకత్వంలో టీమిండియా…. ఇంగ్లాండ్ వెళ్లడం జరిగింది. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అలాగే రవిచంద్రన్ అశ్విన్ లాంటి స్టార్ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో… గిల్ నాయకత్వంలో టీమిండియా ఇంగ్లాండ్ వెళ్లడం జరిగింది. అయితే గిల్ నాయకత్వంలో… ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. జూన్ 20వ తేదీ అంటే మరో పది రోజుల్లోనే ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభం అవుతుంది. ఇందులో వరుసగా మ్యాచులు గెలిస్తేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఎడిషన్ కు.. టీమిండియా వెళ్లడం జరుగుతుంది. లేకపోతే టీమిండియా కు కష్టాలు తప్పవు.

స్టేడియం పైకప్పులు పగలగొడుతున్న పంత్

ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మరో 10 రోజుల్లో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ దుమ్ము లేపుతున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్లో ప్రాక్టీస్ చేస్తున్న టీం ఇండియా సభ్యులు… గంటల తరబడి నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాక్టీస్ సెషన్ లో టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ భారీ సిక్సర్స్ తో రెచ్చిపోయాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన ఓ బంతిని నేరుగా స్టేడియం పైకప్పు పైకి కొట్టాడు స్టార్ ఆటగాడు రిషబ్ పంత్. అయితే అతడు కొట్టిన బంతి నేరుగా స్టేడియంలోని రూఫ్ ను బ్రేక్ చేసేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోని చూసిన క్రికెట్ అభిమానులు… ప్రాక్టీస్ మ్యాచ్ లో కాదు నిజమైన మ్యాచ్ లో రిషబ్ పంత్ ఇలా ఆడితే టీమిండియా గెలుస్తుందని కామెంట్ చేస్తున్నారు.

Also Read:Rohit’s Lamborghini: రోహిత్ శర్మకు అవమానం…గిఫ్ట్ గా ఇచ్చిన కారును అమ్ముకున్న ఫ్యాన్ June 9,2 

 

 

Related News

IND VS PAK: అభిషేక్‌ దుమ్ములేపాడు… సూప‌ర్ 4 లోనూ టీమిండియా విజ‌యం.. షేక్ హ్యాండ్ మళ్ళీ లేదు

IND Vs PAK : Ak 47 గ‌న్స్ పేల్చుతూ పాకిస్థాన్ సెల‌బ్రేష‌న్స్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

Rohith Sharma : టీమిండియా కోచ్ గా రోహిత్ శర్మ… త్వరలోనే రిటైర్మెంట్?

IND Vs PAK : సీన్ రిపీట్… పాకిస్తాన్ పరువు తీసిన సూర్య కుమార్ యాదవ్

Asia Cup 2025 : బంగ్లా, శ్రీలంక మ్యాచ్ లో నాగిని డ్యాన్స్‌.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

IND Vs PAK : ఆసియా కప్ లో కలకలం… టీమిండియా ప్లేయర్లు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!

IND Vs PAK : టీమిండియా ఫ్యాన్స్ కు పాకిస్థాన్ ఆట‌గాడు ఆటోగ్రాఫ్‌…!

BCCI : బీసీసీఐలో ప్ర‌క్షాళ‌న‌..కొత్త అధ్య‌క్షుడు ఇత‌నే.. ఐపీఎల్ కు కొత్త బాస్

Big Stories

×