Black Pan: ఇంటి పనులు చాలా ఈజీగా చేసుకునేవారికి కూడా అత్యంత కష్టమైన పని వంటగదిలో పాత్రలు కడగడం అని చెప్పవచ్చు. చాలా సార్లు.. అజాగ్రత్త కారణంగా వంట చేసేటప్పుడు గిన్నెలు మాడిపోతుంటాయి. ఇలాంటి కాలిన పాత్రలను శుభ్రం చేయడంలో ఇంకా కష్టమైన పని.
కొన్ని సమయాల్లో రెండు నుండి మూడు సార్లు నల్లగా మారిన పాత్రలను శుభ్రం చేసినా కూడా ఫలితం ఉండదు. కానీ ఒకే సారికే నల్లటి పాత్రలు తెల్లగా మారాలంటే కొన్ని రకాల టిప్స్ పాటించడం చాలా ముఖ్యం మరి ఎలాంటి టిప్స్ పాటించడం వల్ల నల్లటి పాత్రలు క్షణాల్లోనే తెల్లగా మారిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు పూరీలు లేదా పకోడీలను హై-ఫ్లేమ్ మీద వేయించినప్పుడు అది పాత్రలపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల పాత్రలు కాలి నల్లగా మారుతాయి. కొన్నిసార్లు మన అజాగ్రత్త కారణంగా నల్లగా మారుతాయి.
వెనిగర్ తో పాత్రలను శుభ్రం చేయండి:
పాత్రల నుండి మరకలను తొలగించడానికి మీరు వెనిగర్ ఉపయోగించవచ్చు. దీని కోసం.. వెనిగర్ , ఉప్పు కలిపి ఒక ద్రావణాన్ని తయారు చేయండి. తర్వాత దీనిని కాలిన పాత్రలలో పోసి 4-5 గంటలు అలాగే ఉంచండి. అనంతరం స్పాంజి సహాయంతో శుభ్రం చేయండి.
బేకింగ్ సోడాతో పాత్రలు కడగడం:
పాత్రలను మెరుస్తూ ఉండటానికి మీరు బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు. బేకింగ్ సోడా, నీటిని కలిపి పేస్ట్ లా చేసి.. పాత్రలపై ఉన్న మరకలపై రుద్దండి. అనంతరం 20-30 నిమిషాల తర్వాత.. స్క్రబ్ సహాయంతో శుభ్రం చేసి, నీటితో వాష్ చేయండి.
ఉల్లిపాయతో మరకలను తొలగించండి:
పాత్రలను మెరిపించడానికి మీరు ఉల్లిపాయను కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం కాలిన పాత్రలలో నీళ్లు పోయాలి. తర్వాత అందులో తరిగిన ఉల్లిపాయలు వేయండి. అనంతరం ఈ నీటిని మరిగించండి. ఇలా చేయడం వల్ల మీరు పాత్రలపై ఉన్న మరకలను ఈజీగా వదిలించుకోవచ్చు.
కోక్ తో పాత్రలను శుభ్రం చేయండి:
కాలిన పాత్రలను శుభ్రం చేయడానికి మరొక ప్రభావవంతమైన మార్గం కోక్. దీని కోసం మీరు ఒక పాత్రలో కోక్ పోసి తక్కువ మంట మీద వేడి చేయడానికి ఉంచాలి. అది బుడగలు రావడం ఆగిపోయిన వెంటనే.. గ్యాస్ పై నుండి తీసివేసి.. కాలిన పాచెస్‌ను స్క్రబ్ చేయండి. ఇందుకోసం ప్లాస్టిక్ బ్రష్ లేదా డిష్ సోప్‌ని ఉపయోగించండి.
Also Read: ఇంట్లోనే పెరుగుతో.. ఫేషియల్ చేసుకోండిలా !
నిమ్మరసం వాడండి:
నిమ్మకాయ శుభ్రపరిచే ఏజెంట్‌గా ప్రసిద్ధి చెందింది. చాలా డిష్ వాషింగ్ సబ్బులలో నిమ్మ రసం ఉంటుంది. ఇది మురికి తొలగించడంలో చాలా బాగా పనిచేస్తుంది. అంతే కాకుండా మురికి పాత్రలు, బట్టల నుండి మరకలను తొలగించడంలో సహాయపడుతుంది. పాత్రలపై ఉన్న కాలిన గుర్తులు, మరకలను శుభ్రం చేయడానికి నిమ్మరసం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
వైన్ వాడండి:
మీ ఇంట్లో వైన్ లేదా ఆల్కహాల్ అందుబాటులో ఉంటే.. కాలిన పాత్రలను దానితో శుభ్రం చేయవచ్చు. పాత్రలో వైన్ పోసి కొంతసేపు అలాగే ఉంచండి. దాదాపు గంట తర్వాత.. ఈ పాత్రను ప్లాస్టిక్ స్క్రబ్ తో శుభ్రం చేయండి. పాత్ర యొక్క మెరుపు దాని మునుపటి రూపానికి తిరిగి వస్తుంది.