Acidity: నేటి బిజీ లైఫ్‌లో మారిన ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా అసిడిటీ సమస్య చాలా సాధారణం అయిపోయింది. దాదాపు ప్రతి ఇద్దరిలో ఒకరికి కొన్నిసార్లు ఛాతీ, గొంతులో మంట, పుల్లని బర్ప్స్, గ్యాస్ వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. కడుపులోని ఆమ్లం ఆహార వాహిక ద్వారా పైకి తిరిగి వచ్చినప్పుడు ఈ సమస్య ఎదుర్కోవలసి వస్తుంది.
ఇది చాలా కాలం పాటు కొనసాగితే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ఈ సమస్య నుంచి బయటపడటానికి తక్షణ ఉపశమనం పొందడానికి సింపుల్ హోం రెమెడీస్ ఉపయోగించడం మంచిది. ఇవి మీకు మంచి ఫలితాలను అందిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కడుపు సంబంధిత సమస్యలు :
అసిడిటీ సమస్యను అర్థం చేసుకునే ముందు, దాని కారణాలను తెలుసుకోవడం ముఖ్యం. ఇది ప్రధానంగా కడుపులో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఏర్పడటం వల్ల వస్తుంది. దీనికి ప్రధాన కారణాలు కారం, వేయించిన, నూనె వాడిన ఆహారం అధికంగా తీసుకోవడం. ఇవి తిన్న వెంటనే పడుకోవడం, రాత్రి ఆలస్యంగా తినడం, అధికంగా టీ లేదా కాఫీ తాగడం, ఒత్తిడి. ఈ కారణాలను దృష్టిలో ఉంచుకుని, మనం మన లైఫ్ స్టైల్ మెరుగుపరుచుకోవచ్చు. అంతే కాకుండా ఈ సమస్యను తగ్గించుకోవడానికి హోం రెమెడీస్ కూడా వాడవచ్చు.
సోంపు నీరు:
అసిడిటీ నుంచి తక్షణ ఉపశమనం పొందడానికి సోంపు వాడొచ్చు . సోంపు జీర్ణక్రియకు సహాయపడే, కడుపులో గ్యాస్, ఉబ్బరాన్ని తగ్గించే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఇది లాలాజల ఉత్పత్తిని పెంచుతుంది. అంతే కాకుండా మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. అసిడిటీ ఉన్న వారు మీరు ఒక చెంచా సోంపును రోజూ తినాలి. లేదా సోంపు నీరు తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది.
చల్లని పాలు :
చల్లని పాలు కూడా చాలా ప్రభావవంతంగా ఉంటాయి. పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపులోని అదనపు ఆమ్లాన్ని గ్రహించి దానిని తటస్థీకరిస్తుంది. మీకు గుండెల్లో మంటగా ఉంటే.. ఒక గ్లాసు చల్లని, చక్కెర లేని పాలు తాగడం వల్ల తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. కానీ.. మీకు తరచుగా అసిడిటీ సమస్యలు ఉంటే పాలు తాగడం సరైన మార్గం కాదు. వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
Also Read: నెయిల్ పాలిష్ వాడితే.. ఇంతా డేంజరా ?
అరటిపండు:
అసిడిటీని తగ్గించడానికి అరటి పండు సులభమైన, ప్రభావవంతమైన మార్గం. అరటిపండు కడుపులోని ఆమ్లాన్ని శాంతపరచడానికి సహాయపడుతుంది. దీనిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అసిడిటీ సమస్య ఉన్న వారు అరటిపండు తినడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది.