BigTV English

Get rid of Lizards: ఇంట్లో నుంచి బల్లులను సులభంగా ఇలా వదిలించేసుకోండి

Get rid of Lizards: ఇంట్లో నుంచి బల్లులను సులభంగా ఇలా వదిలించేసుకోండి

బల్లులు, మనుషులను ఏమీ చేయలేదు. ఎలాంటి హాని తలపెట్టలేవు. కానీ అవి ఆహారంలో పడితే మాత్రం ఇబ్బంది. అందుకే వంట గదిలోని ప్రతి ఆహార పాత్ర పై మూత ఉండాల్సిందే. ఈ బల్లులు ఎప్పుడూ గోడల పైన, లైట్లు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అవి అలా గోడల మీద నుంచి మీద పడిపోతాయేమోనని చాలామంది భయపడుతూ ఉంటారు. బల్లులని ఇంట్లో నుంచి బయటకు తరిమేయాలనుకుంటారు. కానీ ఆ పని ఎలా చేయాలో చాలామందికి తెలియదు.


ఇంట్లో నుంచి బల్లులను తరమడానికి కఠినమైన రసాయనాలు ఉన్న ఉత్పత్తులను వాడాల్సిన అవసరం లేదు. బల్లులను చాలా సులభంగా ఇంట్లో నుంచి సహజంగానే బయటికి పోయేలా చేసుకోవచ్చు. అసలు బల్లులు ఇంట్లోనే మొదట చేరకుండా చూసుకుంటే ఇంకా మంచిది. ఇందుకోసం మీరు ఏం చేయాలో తెలుసుకోండి.

బల్లులు ఇంట్లో చేరకూడదంటే
బల్లులు ఇంట్లో లేకుండా ఉండాలంటే ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వీటికి ఆహారం దొరికితేనే మీ ఇంట్లో చేరుతాయి. ముఖ్యంగా వంటగదిని ఎంత పరిశుభ్రంగా ఉంచితే బల్లులు అంత తక్కువగా ఉంటాయి. ప్రతిరోజు ఇల్లు తుడుచుకోవడం, వంటగదిలో ఉన్న వస్తువులను క్లీన్ చేసుకోవడం, ఎక్కడ ఎలాంటి ఆహార అవశేషాలను పడేయకుండా చూసుకోవడం వంటివి చేయాలి. అలాగే మురికి పాత్రలు వెంటనే కడుగుతూ ఉండాలి. బల్లులకు ఆహారం దొరకకపోతే అవి ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోతాయి. బల్లులను ఆకర్షించేవి ఎక్కువగా చెత్త, చెదారం మిగిలిపోయిన ఆహార పదార్థాలే. కాబట్టి మీ ఇంట్లో అలాంటి లేకుండా చూసుకోండి.


బల్లులు ఇంట్లోని చిన్నచిన్న సందులు, రంధ్రాల గుండా దూరిపోతూ ఉంటాయి. గోడలలో ఎక్కడైనా పగుళ్లు ఉంటే వాటిని కప్పివేయండి. తలుపుల చుట్టూ తెరిచినట్టు ఖాళీలు కనిపిస్తే వెంటనే ప్లాస్టర్స్ వంటివి వేసేయండి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ లోంచి కూడా ఈ బల్లులు కిచెన్ లోకి వస్తూ ఉంటాయి. అక్కడ మెష్ స్క్రీన్ ఏర్పాటు చేస్తే మంచిది. బల్లులు రాకుండా ఉంటాయి. బల్లులు ఎక్కువగా చీమలు, ఈగలు, దోమలు వంటివి తినేందుకు వస్తాయి. ఈ దోమలు, చీమలు, ఈగలు ఇంట్లో ఎప్పుడు చేరుతాయి? మీరు ఇంట్లో ఆహార పదార్థాలను ఎక్కడపడితే అక్కడ వదిలేసినప్పుడే. కాబట్టి మీ ఇంట్లో నీరు నిలిచి ఉండకుండా, అలాగే ఆహారం ఎక్కడపడితే అక్కడ నిల్వ చేయకుండా చూసుకోండి. అప్పుడు బల్లులు ఉండే అవకాశం కూడా చాలా తక్కువ.

గుడ్డు పెంకులతో
పురాతన కాలం నుంచి బల్లులను వదిలించుకోవడానికి గుడ్లు పెంకులను వాడుతూ ఉంటారు. ముఖ్యంగా గదిలో, మూలల్లో, కిటికీల దగ్గర, తలుపుల దగ్గర ఈ వాడేసిన గుడ్డు పెంకులను పెడితే మంచిది. ఎందుకంటే బల్లులు గుడ్డు పెంకుల నుంచే వచ్చే వాసనకు ఇష్టపడవు. దాన్ని మాంసాహార జంతువుగా భావిస్తాయి. అందుకే అవి తమను తినేస్తాయన్న భయంతో దూరంగా ఉంటాయి. కాబట్టి కోడిగుడ్డు పెంకులను ప్రతి నాలుగు రోజులకు ఒకసారి మారుస్తూ ఉండండి.

కాఫీ, పొడి పొగాకు వంటివి కూడా బల్లులకు నచ్చవు. కాఫీ పొడిని పొగాకును సమాన భాగాలుగా విడదీసి చిన్న బంతులుగా చుట్టండి. ఎక్కడైతే బల్లులు తిరుగుతూ ఉంటాయో అంటే అల్మారాలలో, సింకులలో వీటిని ఉంచండి. వీటి నుంచి వచ్చే వాసన బల్లులను తరిమివేస్తుంది. అయితే మీ ఇంట్లో పెంపుడు జంతువులు చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఈ బంతుల నుండి జాగ్రత్తగా చూసుకోండి.

పెప్పర్ ఫ్రై ద్వారా కూడా బల్లులను తరమవచ్చు. ఇందుకోసం నల్ల మిరియాల పొడి, సాధారణ కారంపొడి నీటిలో వేసి బాగా కలపండి. ఒక బాటిల్లో ఈ ద్రావణాన్ని వేసి బల్లులు ఉండే చోట స్ప్రే చేయండి. ముఖ్యంగా ఫ్రిడ్జ్ చుట్టూ, సింకుల చుట్టూ కిచెన్ క్యాబినెట్ల మీద స్ప్రే చేయండి. ఆ వాసనకి బల్లులు చికాకు పడి దూరంగా వెళ్లిపోతాయి.

వెల్లుల్లి, ఉల్లిపాయల నుంచి వచ్చే ఘాటైన వాసన కూడా బల్లులకు నచ్చదు. వెల్లుల్లి రెబ్బలను విడదీసిన తర్వాత వాటిని చక్రాల్లా కోసి బల్లులు తిరిగే చోట పెట్టండి. అలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా గది మూలల్లో, వంటగది కౌంటర్ల దగ్గర ఉంచడం వల్ల బలులు రాకుండా ఉంటాయి.

Related News

Health Benefits: బిర్యాని ఆకుతో బోలెడు ప్రయోజనాలు.. ఒక్కసారి వాడితే మంచి ఫలితాలు

Skin Glow: నేచురల్‌గానే.. ముఖం మెరిసిపోవాలంటే ?

Curd vs Buttermilk:పెరుగు Vs మజ్జిగ.. రెండిట్లో ఏది బెటర్ ?

Mustard infusion: ఆవాల కషాయం అంత మంచిదా? దీని తయారీ చాలా సింపుల్!

Kidney Disease: కిడ్నీలు పాడయ్యాయని తెలిపే.. సంకేతాలు ఇవే !

Watermelon Seeds: రోజుకో స్పూన్ పుచ్చకాయ గింజలు.. ఇన్ని ప్రయోజనాలా ?

Big Stories

×