Viral News: పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. కానీ, ఓ పండు ఆర్టీసీ డ్రైవర్ ను చిక్కుల్లో పడేసింది. కాసేపు అతడిని ఓ రేంజ్ లో టెన్షన్ కు గురి చేసింది. కేరళలోని పండలం ఆర్టీసీ బస్ డిపో పరిధిలో ఈ ఘటన జరిగింది. కొట్టారక్కరకు చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్ డ్యూటీకి రిపోర్టు చేయడానిక వచ్చాడు. వస్తూ వస్తూ.. ఇంట్లో కోసిన పనసపండును తనతో పాటు తీసుకొచ్చాడు. ఆ పండు ముక్కలను తన తోటి డ్రైవర్లు, కండక్టర్లకు ఇచ్చాడు. అందరూ హ్యాపీగా తినేశారు. పనస పండు చక్కటి వాసనతో పాటు రుచిగా ఉండటంతో అందరూ మరికొన్ని ముక్కలు తిన్నారు. ఆ తర్వాతే అసలు కథ మొదలయ్యింది. అదే పండు కాసేపు డ్రైవర్లు అందరినీ పరేషాన్ చేసింది.
బ్రీత్ అనలైజర్ పరీక్షల్లో డ్రైవర్లు ఫెయిల్
సాధారణంగా డ్రైవర్లు డ్యూటీకి ఎక్కే సమయంలో ఆర్టీసీ అధికారులు అందరికీ బ్రీత్ అనలైజర్ టెస్టులు చేస్తారు. ఎప్పటి లాగే తాజాగా డ్యూటీకి ఎక్కే డ్రైవర్లకు ఈ పరీక్షలు నిర్వహించారు. వారిలో పరిమితికి మించి 10 పాయిట్లు అదనంగా చూపించింది. అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. తాము మద్యం తాగలేదని, అయినా అలా ఎలా వచ్చిందంటూ పరేషాన్ అయ్యారు. పండుతెచ్చిన డ్రైవర్ కూడా తాను మద్యం తీసుకోలేదన్నాడు. కావాలంటే బ్లడ్ టెస్టుకు రెడీ అన్నాడు.
అసలు దోషి ఎవరంటే?
అటు ఆర్టీసీ అధికారులు కూడా ఆల్కహాల్-డిటెక్షన్ మిషన్ పని చేస్తుందా? లేదా? అని అనుమానపడ్డారు. అదే సమయంలో డ్రైవర్లు అందరికీ రీడింగ్ ఎక్కువగా రావడం పట్ల అనుమానాన్ని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేశారు. పొద్దున నుంచి ఏం తిన్నారు? అని డ్రైవర్లను అడిగారు. అందరూ పనస పండు తిన్నటలు చెప్పారు. అయితే, ముందుగా పనస పండు తినని డ్రైవర్ కు పరీక్ష చేశారు. నార్మల్ గానే వచ్చింది. ఆ తర్వాత అతడితో పనస పండు తినిపించారు. మళ్లీ తనకు బ్రీ అనలైజర్ పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత అతడు మళ్లీ ఊదాడు. అప్పుడు రీడింగ్ 10 పాయింట్లు ఎక్కువగా చూపించింది. స్టార్టింగ్ లో నెగెటివ్ గా చూపించిన టెస్ట్.. పనసపండు తిన్న తర్వాత పాజిటివ్ అని రావడంతో అందరికీ అసలు విషయం అర్థం అయ్యింది. ఇక్కడ నిజమైన దోషి పనసపండు అని తేల్చారు.
అసలు నిజం తెలిసి ఊపిరి పీల్చుకున్న డ్రైవర్లు
ఇక ఈ వ్యవహారం అంతటికీ కారణంగా పనసపండు అని తెలియడంతో అందరూ కాసేపు రిలాక్స్ అయ్యారు. ఆ పనస పండు బాగా పండి సహజంగా పులియబెట్టినట్లు కావడంతో బ్రీత్ ఎనలైజర్ పరీక్షల్లో పాజిటివ్ గా చూపించినట్లు గుర్తించారు. కాసేపట్లో పరేషాన్ అయిన అందరూ అసలు నిజం తెలియడంతో రిలాక్స్ అయ్యారు. పనసపండు తెచ్చి ఎంత పని చేశావయ్యా? అంటూ మిగతా డ్రైవర్లు పండు తెచ్చిన డ్రైవర్ ను ఆటపట్టించారు. సుమారు గంట పాటు గందరగోళం తర్వాత డ్రైవర్లు అంతా తమ విధుల్లో చేరిపోయారు.
Read Also: ప్యాసింజర్లతో పోల్చితే క్యాబిన్ క్రూ సీట్ బెల్ట్స్ డిఫరెంట్ గా ఉంటాయి, ఎందుకో తెలుసా?