BigTV English
Advertisement

IRCTC Tour Uttarakhand Corbett : జిమ్ కార్బెట్, నైనీతాల్, ఢిల్లీ టూర్.. హైదరాబాద్ వాసుల కోసం ఐఆర్‌సిటిసి స్పెషల్ ప్యాకేజీ

IRCTC Tour Uttarakhand Corbett : జిమ్ కార్బెట్, నైనీతాల్, ఢిల్లీ టూర్.. హైదరాబాద్ వాసుల కోసం ఐఆర్‌సిటిసి స్పెషల్ ప్యాకేజీ

IRCTC Tour Uttarakhand Package | ఆధ్యాత్మిక ప్రదేశాల పర్యటనతో పాటు జిమ్ కార్బెట్ సఫారీ చేయాలనుకునే వారికోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కొత్త టూర్ ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో, తాజాగా “దేవభూమి ఉత్తరాఖండ్”ను తక్కువ ధరకు సందర్శించేందుకు ఒక అద్భుతమైన ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ ధర ఎంత? ఏ ఏ ప్రదేశాలు చూడొచ్చు? టూర్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


“గ్రీన్ ట్రయాంగిల్ ఆఫ్ ఉత్తరాఖండ్” ప్యాకేజీ
IRCTC ఈ ప్యాకేజీని “గ్రీన్ ట్రయాంగిల్ ఆఫ్ ఉత్తరాఖండ్” పేరుతో ప్రవేశపెట్టింది. ఈ టూర్ మొత్తం 7 రాత్రులు, 8 రోజులు కొనసాగుతుంది. ఈ ప్యాకేజీ హైదరాబాద్ నుంచి రైలు మార్గంలో ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో కార్బెట్, నైనితాల్, అల్మోరా, ముక్తేశ్వర్, ఢిల్లీ వంటి ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంది. ఈ టూర్ ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది.

టూర్ షెడ్యూల్

మొదటి రోజు: హైదరాబాద్ నుంచి (ట్రైన్ నంబర్ 12723) ఉదయం 6 గంటలకు ప్రయాణం ప్రారంభమవుతుంది. మొత్తం రోజు ప్రయాణం కొనసాగుతుంది.


రెండవ రోజు: ఉదయం 7:40 గంటలకు దిల్లీ చేరుకుంటారు. అక్కడి నుంచి హోటల్‌కు తీసుకెళ్లి, ఫ్రెష్ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ తర్వాత కార్బెట్‌కు బయలుదేరుతారు. సాయంత్రం కార్బెట్ చేరుకుని హోటల్‌లో చెక్ ఇన్ చేసుకుంటారు.

మూడవ రోజు: ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత కార్బెట్ సఫారీ మరియు కార్బెట్ వాటర్ ఫాల్స్ సందర్శన ఉంటుంది. తర్వాత నైనితాల్‌కు బయలుదేరుతారు. నైనితాల్ చేరుకున్న తర్వాత హోటల్‌లో చెక్ ఇన్ చేసుకుంటారు.

Also Read: వేసవి సెలవుల్లో కర్ణాటక చుట్టేయండి.. హైదరాబాద్ వాసులకు ఐఆర్‌సిటిసి ఆఫర్!

నాల్గవ రోజు: మొత్తం రోజు నైనితాల్‌లోని పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తారు. రాత్రికి హోటల్‌లో బస చేస్తారు.

ఐదవ రోజు: అల్మోరా మరియు ముక్తేశ్వర్‌లోని దర్శనీయ ప్రదేశాలను సందర్శిస్తారు. రాత్రికి నైనితాల్‌లో బస చేస్తారు.

ఆరవ రోజు: హోటల్ నుంచి చెక్ అవుట్ చేసుకుని ఢిల్లీకి బయలుదేరుతారు. సాయంత్రం దిల్లీ చేరుకుని అక్షర్ధామ్ ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రికి ఢిల్లీలో బస చేస్తారు.

ఏడవ రోజు: హోటల్ నుంచి చెక్ అవుట్ చేసుకుని కుతుబ్ మినార్ మరియు లోటస్ టెంపుల్ సందర్శిస్తారు. తర్వాత ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ నుంచి ట్రైన్ బయలుదేరుతుంది.

ఎనిమిదవ రోజు: సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ చేరుకుని టూర్ ముగుస్తుంది.

ధర వివరాలు

సింగిల్, డబుల్, ట్రిపుల్ షేరింగ్ ఆప్షన్స్ 

స్టాండర్డ్ (SL): సింగిల్ షేరింగ్‌కు ₹58,220, డబుల్ షేరింగ్‌కు ₹31,630, ట్రిపుల్ షేరింగ్‌కు ₹24,120. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు (బెడ్ తో) ₹16,970, (బెడ్ లేకుండా) ₹15,440.

కంఫర్ట్ (3A): సింగిల్ షేరింగ్‌కు ₹60,910, డబుల్ షేరింగ్‌కు ₹34,480, ట్రిపుల్ షేరింగ్‌కు ₹27,020. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు (బెడ్ తో) ₹19,960, (బెడ్ లేకుండా) ₹18,440.

నలుగురు నుంచి ఆరుగురు షేరింగ్ ప్రయాణికులు:

స్టాండర్డ్ (SL): డబుల్ షేరింగ్‌కు ₹26,870, ట్రిపుల్ షేరింగ్‌కు ₹22,640. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు (బెడ్ తో) ₹16,970, (బెడ్ లేకుండా) ₹15,440.

కంఫర్ట్ (3A): డబుల్ షేరింగ్‌కు ₹29,730, ట్రిపుల్ షేరింగ్‌కు ₹25,530. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు (బెడ్ తో) ₹19,960, (బెడ్ లేకుండా) ₹18,440.

ప్యాకేజీలో ఉన్న సౌకర్యాలు
హైదరాబాద్ నుంచి దిల్లీకి మరియు దిల్లీ నుంచి హైదరాబాద్‌కు రైలు టికెట్లు.

హోటల్ అకమోడేషన్.

ట్రావెల్ ఇన్సూరెన్స్.

ఇతర సౌకర్యాలు.

టూర్ తేదీ
ప్రస్తుతం ఈ ప్యాకేజీ ఫిబ్రవరి 25 (మంగళవారం) తేదీ నుంచి ప్రతి మంగళవారం అందుబాటులో ఉంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు మరియు టికెట్ బుకింగ్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Related News

Karnataka Tour: కర్ణాటకలోని..ఈ ప్రదేశాలు చూడటానికి రెండు కళ్లు సరిపోవు !

US flight crisis: అమెరికాలో ఒక్కసారిగా రద్దైన 1,460 ఫ్లైట్లు.. ఇబ్బందుల్లో వేలమంది ప్రయాణికులు

Train PNR Status: ఇంటర్నెట్ లేకున్నా ట్రైన్ PNR స్టేటస్ తెలుసుకోవచ్చు, ఎలాగంటే?

AP Family Tour: ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేస్తున్నారా ? ఏపీలోని ఈ ప్లేస్‌‌లపై ఓ లుక్కేయండి !

Assam Temple darshan: రూ.7వేలకే అస్సాం పవిత్ర యాత్ర.. కామాఖ్య, ఉమానంద ఆలయ దర్శనం ప్యాకేజ్ వివరాలు

Vande Bharat Trains: వందే భారత్ చూసి విదేశీయులే ఆశ్చర్యపోతున్నారు.. మోడీ కీలక వ్యాఖ్యలు!

Northeast India Tour: ఇండియాలోనే చూపు తిప్పుకోలేని అందాలు.. దీని ముందు వరల్డ్ టూర్ వేస్ట్ !

Vande Bharat: వందే భారత్ రైలు జర్నీకి బ్రిటన్ దంపతులు ఫిదా, అల్లం చాయ్ అదుర్స్ అంటూ..

Big Stories

×