BigTV English

Tips For Best Sleep: రాత్రి త్వరగా నిద్ర రావట్లేదా ? అయితే ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి

Tips For Best Sleep: రాత్రి త్వరగా నిద్ర రావట్లేదా ? అయితే ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి

Tips For Best Sleep: బిజీ లైఫ్ స్టైల్‌ కారణంగా మంచి నిద్ర కరువైపోయింది. అర్థరాత్రి వరకు మొబైల్ వాడటం, సమయానికి తినకపోవడం, ఒత్తిడి , క్రమరహిత జీవన శైలి, ఇవన్నీ మన నిద్ర నాణ్యతపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. దీని ఫలితంగా మనం ఆలస్యంగా నిద్రపోతాము. అంతే కాకుండా తరచుగా మేల్కొంటాము. దీనివల్ల ఉదయం నిద్ర లేచినప్పటి నుండి నీరసంగా, చిరాకుగా అనిపిస్తుంటుంది.


మీరు నిద్రలేమితో బాధపడుతుంటే.. లేదా రాత్రి పూట ఎక్కువ సేపు మీకు మేల్కొని ఉంటే అంతే కాకుండా రోజంతా అలసిపోయినట్లు అనిపిస్తే.. మీ నిద్ర సమయాన్ని తిరిగి సెట్ చేసుకోవలసిన సమయం ఆసన్నమైంది. మంచి నిద్ర శరీరానికే కాదు.. మనసుకు కూడా ముఖ్యం. 5 సులభమైన, ప్రభావవంతమైన పద్ధతులను అవలంబించడం ద్వారా.. మీరు మళ్ళీ ప్రశాంతమైన, గాఢమైన నిద్రను పొందవచ్చు.

నిర్ణీత సమయంలో పడుకోవడం:
నిద్రను మెరుగుపరచడం అనేది ఒక స్థిరమైన దినచర్యతో ప్రారంభమవుతుంది. ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకుని మేల్కొనడానికి ప్రయత్నించండి. సెలవు రోజుల్లో కూడా దీనినే ప్రయత్నించండి. ఇది మీ శరీరం యొక్క జీవ గడియారాన్ని సెట్ చేస్తుంది. దీని కారణంగా నిద్ర సమయానికి రావడం ప్రారంభమవుతుంది. ప్రారంభంలో ఇది కష్టంగా అనిపించవచ్చు. కానీ కొన్ని రోజుల్లో మీ శరీరం ఈ షెడ్యూల్‌కు అలవాటు పడుతుంది.


స్క్రీన్ సమయాన్ని తగ్గించండి:
ఫోన్, ల్యాప్‌టాప్ లేదా టీవీ నుండి వచ్చే నీలి కాంతి మీ మెదడును చురుగ్గా ఉంచుతుంది. ఇది నిద్ర ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది. నిద్ర పోయే ముందు కనీసం 1 గంట ముందు స్క్రీన్లకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. బదులుగా.. పుస్తకం చదవండి, లేదా సంగీతం వినండి. ధ్యానం చేయండి. ఇది మీ మనసుకు విశ్రాంతినిస్తుంది. అంతే కాకుండా మీరు త్వరగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

కెఫీన్, పదార్థాలను నివారించండి:
సాయంత్రం వేళల్లో టీ, కాఫీ లేదా ఎనర్జీ డ్రింక్స్ వంటి కెఫీన్ కలిగిన డ్రింక్స్ తాగడం వల్ల నిద్రపై ప్రభావం చూపుతుంది. అదేవిధంగా.. రాత్రిపూట వేయించిన ఆహారాన్ని తినడం వల్ల జీర్ణక్రియ కూడా ప్రభావితమవుతుంది. ఇది నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. రాత్రి భోజనం త్వరగా తినడం వల్ల నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.

ప్రశాంతమైన వాతావరణం:
మంచి నిద్రలో మీ గది వాతావరణం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. గదిని చీకటిగా, చల్లగా , నిశ్శబ్దంగా ఉంచుకోండి. ప్రకాశవంతమైన వెలుతురు, శబ్దం లేదా అసౌకర్యమైన మంచం తరచుగా నిద్రకు అంతరాయం కలిగించే అవకాశాలు కూడా ఉంటాయి. మీరు అరోమాథెరపీ లేదా వైట్ నాయిస్ మెషీన్‌ను కూడా ప్రయత్నించవచ్చు. ఇవి గాఢ నిద్రకు సహాయపడతాయి.

Also Read: రాత్రి పూట మొబైల్ చూస్తున్నారా ? ఈ వ్యాధులు రావడం ఖాయం

కొంత వ్యాయామం చేయండి:
శారీరక శ్రమ నిద్రకు దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. మీరు రోజంతా చురుకుగా ఉంటే లేదా  వ్యాయామం చేస్తే, రాత్రికి మీ శరీరం అలసిపోతుంది. ఫలితంగా మీరు సులభంగా నిద్రపోతారు. యోగా, వాకింగ్ వంటివి నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయి. కానీ సాయంత్రం లేదా రాత్రి చాలా ఆలస్యంగా వ్యాయామం చేయకూడదని గుర్తుంచుకోండి. ఇది వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×