Kitchen Tips: వేసవిలో, కూరగాయలు త్వరగా ఎండిపోవడం, లేదా కుళ్ళిపోవడం వంటివి జరుగుతుంటాయి. అంతే కాకుండా కూరగాయలు ఎండిపోతే వాటిలోని పోషకాలు కూడా తగ్గిపోతాయి. ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ, ఆకు కూరలు క్రమంగా వాడిపోవడం ప్రారంభం అవుతుంది. సమ్మర్‌లో ఇతర కూరగాయలు కూడా త్వరగా తేమను కోల్పోతాయి. మరి ఇలాంటి పరిస్థితిలో కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉండేలా కొన్ని సరైన పద్ధతులను అవలంభించాలి. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మార్కెట్ నుండి కూరగాయలు తెచ్చిన తర్వాత, వాటిని ఫ్రిజ్‌లో ఉంచడం మాత్రమే సరిపోదు. ప్రతి కూరగాయ స్వభావం భిన్నంగా ఉంటుంది. దానిని నిల్వ చేసే విధానం కూడా భిన్నంగా ఉంటుంది. కొన్ని కూరగాయలకు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే తేమ తప్పకుండా అవసరం. కానీ కొన్నింటిని బయట ఉంచినా కూడా పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటాయి.
కూరగాయలను నిల్వ చేయడానికి చిట్కాలు:
1. కూరగాయలు కడగకండి:
మార్కెట్ నుండి తెచ్చిన కూరగాయలను కడిగి వెంటనే నిల్వ చేయడం సాధారణంగా అందరూ చేసే తప్పు. కడగడం వల్ల కూరగాయలపై ఉన్న సహజ పొర తొలగిపోతుంది. అంతే కాకుండా తేమ కారణంగా అవి త్వరగా కుళ్ళిపోతాయి. కూరగాయలను కడగకుండా గుడ్డతో మెల్లగా శుభ్రం చేసి ఫ్రిజ్‌లో ఉంచండి. ఉపయోగించే ముందు కడగడం మంచిది.
2. కాగితం లేదా గుడ్డలో చుట్టండి:
కూరగాయలను ప్లాస్టిక్ సంచిలో ఉంచడం వల్ల వాటిలో తేమ పూర్తిగా తొలగిపోతుంది. దీనివల్ల అవి త్వరగా కుళ్ళిపోతాయి. దీనికి బదులుగా.. కూరగాయలను కాటన్ క్లాత్ లేదా న్యూస్ పేపర్‌లో చుట్టి ఉంచండి. ఇది తేమను అదుపులో ఉంచుతుంది. అంతే కాకుండా కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
3. ఫ్రిజ్‌లో సరైన ఉష్ణోగ్రత:
కూరగాయలను ఫ్రిజ్‌లోని కూరగాయల బాక్స్‌లో మాత్రమే ఉంచండి. అంతే కాకుండా ఉష్ణోగ్రత 5°C లో నిల్వ చేయండి. ఎక్కువ కూలింగ్ లేదా వేడి రెండూ కూరగాయల నాణ్యతను ప్రభావితం చేస్తాయి. పాలకూర, మెంతికూర, కొత్తిమీర మొదలైన ఆకు కూరలను గాలి చొరబడని కంటైనర్లలో ఉంచండి. తద్వారా వాటి తేమ చెక్కు చెదరకుండా ఉంటుంది.
4.నిమ్మకాయ, ఆకు కూరలను ఇలా నిల్వ చేయండి:
నిమ్మకాయలను ప్లాస్టిక్ సంచిలో అస్సలు స్టోర్ చేయకూడదు. బదులుగా.. వాటిని బయటి ప్రదేశంలో లేదా కాగితపు బ్యాగ్‌లో ఉంచండి. కొత్తిమీర, పుదీనా వంటి వాటిని కడిగి ఆరబెట్టి, టిష్యూ పేపర్‌లో చుట్టి గాలి చొరబడని డబ్బాలో ఉంచండి. ఇలా చేయడం వల్ల అవి ఒక వారం పాటు తాజాగా ఉంటాయి.
Also Read: ఇలా చేస్తే.. చాలు, 30 రోజుల్లోనే ఈజీగా బరువు పెరుగుతారు !
5.బంగాళదుంపలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి:
ఈ కూరగాయలను ఫ్రిజ్‌లో అస్సలు ఉంచకూడదు. కానీ చల్లని , గాలి వచ్చే ప్రదేశంలో నిల్వ చేయాలి. ఉల్లిపాయల నుండి విడుదలయ్యే వాయువులు బంగాళదుంపలను త్వరగా చెడిపోయేలా చేస్తాయి. కాబట్టి వాటిని ఎప్పుడూ తేమగా ఉండే ప్రదేశంలో ఉంచకూడదు. అంతే కాకుండా మరియు వాటిని ఒకదానికొకటి విడిగా నిల్వ చేయకూడదు.