Family Budget: ఈ రోజుల్లో ఆదాయం, ఖర్చులు రెండూ పెరిగాయి. ఒకరి ఆదాయం పెరిగే కొద్దీ వారి ఖర్చులు కూడా పెరుగుతాయి. కానీ కొంత ఎక్కువ మొత్తాన్ని సంపాదించినా కూడా పొదుపు చేయలేని వారు చాలా మందే ఉంటారు. తమ ఆదాయం తక్కువగా ఉందనే భావనలోనే ఎక్కువ మంది ఉంటారు. మనం డబ్బు ఆదా చేయాలని అనుకుంటే తక్కువ జీతం అయినా సరే ఎంతో కొంత చేయొచ్చు. ఇలా చేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో వాడటానికి ఈ డబ్బు ఉపయోగపడుతుంది.
అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోలేకపోవడం వల్లే సేవింగ్స్ చేయ లేకపోతారు. మీరు కూడా ఇలానే చేస్తున్నట్లయితే.. తప్పకుండా బడ్జెట్ తయారు చేసుకోండి. బడ్జెట్ ప్రకారం ఖర్చు చేయడం వల్ల అనవసరమైన ఖర్చులను ఎలా అరికట్టవచ్చో, చిన్న చిన్న మొత్తంలో ఎలా సేవింగ్స్ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ ఆదాయాన్ని లెక్కించండి:
ముందుగా అన్ని చోట్ల నుండి వచ్చే మీ మొత్తం ఆదాయాన్ని లెక్కించండి. పీఎఫ్, టీడీఎస్ వాటిని లెక్కకట్టకండి. ఇదే కాకుండా EMI, ఆరోగ్య బీమా మొదలైన వాటిని కూడా పరిగణలోకి తీసుకోకండి. అన్నీ పోనూ మీ చేతికి వచ్చే డబ్బు ఎంత అనేది ముందుగా లెక్కించండి. ముందుగానే ఇవన్నీ కౌంట్ చేయకపోతే.. మీ దగ్గర జీతం డబ్బులు లేదా ఇతర మార్గాల ద్వారా వచ్చే డబ్బు చాలా ఉందని.. ఎక్కువగా ఖర్చు చేయవచ్చని భావిస్తారు.
ఖర్చులను ట్రాక్ చేయండి:
మీ ఆదాయాన్ని ముందుగా లెక్కించిన తర్వాత.. దేనికి, ఎక్కడ, ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నారో చూసుకోండి. దీని కోసం ఎప్పటికప్పుడు మీ ఖర్చులను మీ మొబైల్‌లో లేదా డైరీలో యాప్‌లో రాసుకుంటూ ఉండండి. ఖర్చు ఎక్కడ ఆపాలో తెలుసుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది. అంతే కాకుండా డబ్బు ఆదా చేయడంలో కూడా మీకు ఉపయోగపడుతుంది.
వాస్తవిక లక్ష్యాలు నిర్దేశించుకోండి:
బడ్జెట్ తయారు చేసుకుప్పుడే.. మీరు తగ్గించు కోగలిగే ఖర్చులను మాత్రమే నియంత్రించడానికి ప్రయత్నించండి. అప్పుడే మీరు పొదుపులను తెలుసుకోగలుగుతారు. ఇందులో స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను వేరుగా ఉంచి, తదనుగుణంగా మీ లక్ష్యాలను నిర్దేశించుకోండి.
నెలవారీ బడ్జెట్ తప్పనిసరి:
మీ ఆదాయం ఆధారంగా, మీరు ఎక్కడ ఖర్చు చేస్తున్నారో , తర్వాత ఎక్కువ ఖర్చు చేయాలనుకుంటున్నారో చూడండి. దీని ప్రకారం.. మీరు ఎక్కడ డబ్బు ఆదా చేసుకోవచ్చో, పొదుపు చేయవచ్చో చూడండి. వీటి లిస్ట్ తయారు చేయండి. దీనిలో అన్ని ఖర్చుల వివరాలను, మారుతూ ఉండే ఖర్చులను నోట్ చేసుకోండి.
50/30/20 బడ్జెట్ నియమం:
మీ ఆదాయం, ఖర్చులను 50/30/20 బడ్జెట్ నియమాన్ని ఫాలో అవుతూ తయారు చేయండి. దీని అర్థం మీ ఆదాయంలో 50 శాతం మీ అవసరాలకు, 30 శాతం మీరు కోరుకునే వస్తువులకు, 20 శాతం పొదుపు చేయాలి. ఖర్చులను నియంత్రించుకోలేని వ్యక్తులు ఎన్వలప్ బడ్జెటింగ్ చేయాలి. కేటగిరీ ప్రకారం డబ్బును ఆదా చేయండి. ఒక రకం పనులకు డబ్బు అయిపోయినప్పుడు, మీరు ఖర్చు చేయడం దాదాపు మానేయాలి.
Also Read: ప్రతి రోజు ఉదయం ఈ ఒక్క పని చేస్తే.. మెదడు షార్ప్‌గా పని చేస్తుంది !
మీ బడ్జెట్ ప్రకారం సర్దుబాటు చేసుకోండి:
మీరు బడ్జెట్ తయారు చేసుకుని, మీ ఆదాయం, ఖర్చులను తెలుసుకున్న తర్వాత, బడ్జెట్ ప్రకారం మీ ఖర్చులను సర్దుబాటు చేసుకోండి. కొత్త ఖర్చులు చేయడం మానుకోండి.
గమనిస్తూ ఉండండి:
మీరు తయారుచేసిన బడ్జెట్‌ను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండండి. ఖర్చులు జరుగుతున్న రంగాలు అవసరమా లేదా ఆపగలరా అని చూడండి. మీకు ఏదైనా తక్కువ ఖర్చు చేయగలిగే ఆప్షన్ ఉంటే దానిని ఎంచుకోండి. మీరు ఎక్కువగా ఖర్చు చేసేవారైతే ఈ విధంగా బడ్జెట్ వేయడం ద్వారా మీ ఖర్చులను తగ్గించుకోవచ్చు