IND VS NZ Final: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో( Champions Trophy 2025 Tournament ) భాగంగా.. మరి కాసేపట్లోనే ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా ( New Zealand vs Team India ) తలపడబోతున్నాయి. ఈ మేరకు రంగం సిద్ధమైంది. దుబాయ్ లోని ( Dubai) అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో… ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ లో… టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 14 సార్లు టాస్ ఓడిన టీమిండియా.. నేడు కూడా ఓడింది. దీంతో ఇప్పటి వరకు 15 సార్లు టీమిండియా టాస్ ఓడినట్లయింది. అటు కెప్టెన్ గా వరుసగా 12 సార్లు టాస్ ఓడిపోయాడు రోహిత్ శర్మ. న్యూజిలాండ్ టాస్ నెగ్గడంతో ఇవాళ మొదట
టీమిండియా బౌలింగ్ చేయనుంది.
Also Read: Shubman Gill: రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై గిల్ సీరియస్.. ఎవడ్రా మీకు చెప్పిందంటూ ?
అయితే.. నిన్న విరాట్ కోహ్లీ గాయపడ్డాడని ప్రచారం జరిగింది. దీంతో… న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా ఫైనల్ మ్యాచ్ కు దూరం అవుతాడని కూడా ప్రచారం చేశారు. కానీ విరాట్ కోహ్లీ కోలుకుని… జట్టులోకి వచ్చేశాడు. ఇవాళ్టి మ్యాచ్ కూడా ఆడుతున్నాడు. దీంతో.. ఫ్యాన్స్ జోష్ లో ఉన్నారు. ఇక ఇవాళ గెలిచిన జట్టు… ఛాంపియన్ గా నిలువనుంది. ఓడిన జట్టు రన్నరప్ కానుంది.. అయితే… ఇప్పటివరకు న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగిన వన్డే మ్యాచ్ లో మన టీమిండియానే ఎక్కువ గెలిచింది. కానీ.. ఐసీసీ టోర్నమెంట్ లో మాత్రం ఎక్కువ శాతం న్యూజిలాండ్ గెలవడం జరిగింది. కాబట్టి ఆచితూచి ఆడాల్సి ఉంటుంది టీమిండియా.
ఇక న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఫైనల్ మ్యాచ్… జియో హాట్ స్టార్ లో ఉచితంగా చూడవచ్చు. అలాగే స్టార్ స్పోర్ట్స్ తో పాటు స్పోర్ట్స్ 18 లో కూడా ఈ మ్యాచ్ లు వస్తాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో( Champions Trophy 2025 Tournament ) భాగంగా అన్ని మ్యాచ్ లు కూడా జియో హాట్ స్టార్ లో ఉచితంగా చూస్తున్నారు. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఫైనల్ మ్యాచ్ తర్వాత.. టీమిండియా గెలిచిన లేదా ఓడినా … రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని చెబుతున్నారు. వన్డే మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించి… కేవలం టెస్టులకు పరిమితం కావాలని రోహిత్ శర్మ అనుకుంటున్నాడట. ఈ మేరకు బీసీసీఐ పెద్దలతో కూడా చర్చించినట్లు చెబుతున్నారు. అటు గిల్ మాత్రం… ఈ అంశంపై భిన్నంగా స్పందించాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదంటూ క్లారిటీ ఇచ్చాడు.
Also Read: RCB Fan in Alipiri Steps: తిరుమలలో ఆర్సీబీ ఫ్యాన్.. కప్పు కొట్టాలని నడిచి మరీ !
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్లు
భారతదేశం (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(c), శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, KL రాహుల్(wk), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(wk), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(c), కైల్ జామిసన్, విలియం ఓరూర్కే, నాథన్ స్మిత్