Best Air Coolers | దేశం వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉత్తర, దక్షిణం అని తేడా లేకుండా వేడిగాలులతో అన్ని ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఉత్తర్ భారత దేశంలోని బిహార్, రాజస్థాన్, బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎండలకు తట్టుకోలేక ప్రజలు చల్లదనం కోసం ఏసీలు, కూలర్ల కొనుగోలుకు క్యూ కడుతున్నారు. అయితే ఖరీదైన ఏసీలు కొనలేని వారికి కూలర్లే దిక్కు. అందుకే బడ్జెట్ తక్కువ ఉన్నవారి కోసం మార్కెట్లో కొన్ని మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఈ కూలర్లు చల్లదనంలో ఏసీలతో పోటీపడతాయి. పైగా ఇవి ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో భారీ డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్నాయి.
ఫ్లిప్ కార్ట్ లో కూలర్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు.. 63 శాతం వరకు డిస్కౌంట్
మీరు కొత్త కూలర్ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం. 63 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్లతో ఫ్లిప్ కార్ట్ ఈ కూలర్లను అందిస్తుండడంతో ఇవి మీ బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ లో డిస్కౌంట్ తో లభిస్తున్న టాప్ పవర్ ఫుల్ కూలర్ల జాబితా ఒకసారి చూడండి.
పవర్ గార్డ్ 70 లీటర్ల డెజర్ట్ ఎయిర్ కూలర్
ధర రూ.20,999. 63 శాతం డిస్కౌంట్ ఉండడంతో ఇప్పుడు కేవలం రూ.7,699 మాత్రమే. ఇందులో పెద్ద వాటర్ ట్యాంక్ తో పాటు టర్బో కూలింగ్ కోసం ఐస్ చాంబర్ కూడా ఉంది.
సింఫనీ 75 లీటర్ల డెజర్ట్ ఎయిర్ కూలర్
ధర.. రూ.11,299 అయితే 16 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.9,491తో అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఇది చాలా మంచి బ్రాండ్, మంచి కూలింగ్ పవర్, వాటర్ కెపాసిటీ కూడా ఎక్కువే.
క్రాంప్టన్ 75 లీటర్ల్ డెజర్ట్ ఎయిర్ కూలర్
ధర రూ.17,200, 41 శాతం డిస్కౌంట్ తరువాత రూ.9,999 మాత్రమే. ఇది 45 అడుగుల దూరం వరకు గాలిని వీచగలదు. ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో ఈ కూలర్ బెస్ట్ ఆప్షన్
Also Read: ఏసీ కొంటున్నారా?.. కరెంటు బిల్లు గంటకు ఎంతవుతుందో తెలుసా?
క్రాంప్టన్ 88 లీటర్ల్ డెజర్ట్ ఎయిర్ కూలర్
ధర రూ.19,990, 46 శాతం తగ్గింపుతో ఇప్పుడు కేవలం రూ.10,699 కు అందుబాటులో ఉంది. ఇందులో ఐస్ చాంబర్, హనీ కూంబ్స్ తో పాటు నలు దిక్కులా డిఫ్లెక్షన్ తో గాలి వీచే ఆప్షన్ ఉంది. పెద్ద పెద్ద గదుల కోసం ఏసీ లాంటి కూలింగ్ ఇవ్వగలదు.
హింద్ వేర్ స్మార్ట్ ఎయిర్ కూలర్ 45 లీటర్ కెపాసిటీ
ధర రూ.13,990, 57 శాతం డిస్కౌంట్ తరువాత రూ.5,999 ధరకే అందుబాటులో ఉంది. అదనంగా మరో 5 శాతం ఫ్లిప్ కార్ట్ యాక్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే లభిస్తుంది.
పై చెప్పిన కూలర్లన్నీ ఆఫర్లు బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే ధర ఇంకా తగ్గిపోతుంది.సో ఏసీ లేకున్నా టెన్షన్ వద్దు. ఈ కూలర్లు ఉన్నాయిగా.