Tips For Headache: తలనొప్పి అనేది ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారి ఎదుర్కునే సాధారణ సమస్య అవుతుంది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. కొంత మంది ఎండలో అడుగు పెట్టగానే..నుదిటి జలదరింపు ప్రారంభమవుతుంది. అంతే కాకుండా తల బరువుగా అనిపించడం మొదలవుతుంది. ఇలాంటి సమయంలో ఫ్యాన్, ఏసీ లేదా చల్లటి నీరు తాగిన తర్వాత కూడా ఉపశమనం ఉండదు. కొన్నిసార్లు తలనొప్పి చాలా తీవ్రంగా మారుతుంది. ఫలితంగా పనిపై దృష్టి పెట్టడం కూడా కష్టం అవుతుంది. ఇలాంటి పరిస్థితిలో.. మందులకు బదులుగా కొన్ని హోం రెమెడీస్ వాడితే ఇంట్లోనే క్షణాల్లోనే దీని నుండి బయటపడవచ్చు. ఎలాంటి హోం రెమెడీస్ వాడితే తలనొప్పి నుండి ఈజీగా బయటపడవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మకాయ నీరు:
వేసవిలో.. చెమటతో శరీరం నుండి చాలా ఎలక్ట్రోలైట్లు, ఖనిజాలు పోతాయి. ఇది నిర్జలీకరణం, తలనొప్పికి కారణమవుతుంది. ఇలాంటి పరిస్థితిలో.. నిమ్మ నీరు ఒక మాయాజాలంలా పనిచేస్తుంది. ఒక గ్లాసు చల్లటి నీటిలో సగం నిమ్మకాయను పిండి.. కొద్దిగా రాక్ సాల్ట్ , తేనె కలపండి. దీని ద్వారా శరీరానికి తక్షణ హైడ్రేషన్ లభిస్తుంది. అంతే కాకుండా ఇది రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. తలనొప్పి నుండి ఉపశమనం అందిస్తుంది.
కొబ్బరి నీళ్లు:
కొబ్బరి నీరు శరీరాన్ని పూర్తిగా హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇది తలనొప్పి నుండి ఉపశమనం అందిచడంలో సహాయపడుతుంది. అందుకే కొబ్బరి నీరు తాగడం వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఎండ నుండి తిరిగి వచ్చిన తర్వాత, ఇది మీ అలసటను తగ్గిస్తుంది. ఫలితంగా మీరు తలనొప్పి నుండి ఈజీగా బయటపడేందుకు అవకాశాలు కూడా ఉంటాయి.
తులసి టీ:
తులసిలో శోథ నిరోధక , ఒత్తిడిని తగ్గించే లక్షణాలు ఉన్నాయి. ఇవి మానసిక అలసట, వేడి వల్ల కలిగే తలనొప్పిని తగ్గిస్తాయి. ఒక కప్పు నీటిలో 5 తులసి ఆకులను మరిగించి.. మీకు కావాలంటే కొద్దిగా అల్లం, తేనె కలపండి. ఈ టీ మెదడును ప్రశాంతపరుస్తుంది. తలలో వేడిని తగ్గిస్తుంది. అంతే కాకుండా అలసట నుండి ఉపశమనం కలిగిస్తుంది.
తలనొప్పి తగ్గించడానికి ఇతర మార్గాలు:
రోజంతా తగినంత నీరు తాగుతూ ఉండండి.
ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు గొడుగు లేదా టోపీని ఉపయోగించండి.